ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా వైఖరిని ఆ దేశ స్టార్ టెన్నిస్ ఆటగాడు ఆండ్రీ రుబ్లెవ్ ఏకిపారేశాడు. యుద్దాన్ని వెంటనే ఆపేయాలని.. శాంతి పద్దతిలో చర్చలు జరిపితే మంచిదని అభిప్రాయపడ్డాడు. దుబాయ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శుక్రవారం పొలాండ్‌కు చెందిన హుబెర్ట్ హుర్కాజ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడాడు. మ్యాచ్‌లో 3-6,7-5,7-6(5)తో హుర్కాజ్‌ను మట్టికరిపించిన రుబ్లెవ్ ఫైనల్లోకి ప్రవేశించాడు. కాగా విజయం అనంతరం మీడియాతో మాట్లాడాడు.
''చర్చలతో పోయేదాన్ని రష్యా అనవసరంగా పెద్దదిగా చేస్తోంది. నా సొంత దేశమైనప్పటికి మేం చేస్తున్నది తప్పు. ఉక్రెయిన్ తప్పు ఉండొచ్చు.. కానీ మంచి హోదాలో ఉన్న రష్యా.. బలం లేని చిన్న దేశంపై దాడికి దిగడం అమానుషం. మ్యాచ్ గెలిచినప్పటికి నాకు సంతృప్తి లేదు. ఈ విజయాన్ని యుద్ధంలో మరణించిన ఉక్రెయిన్ వాసులకు అంకితం చేస్తున్నా. జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. ఇప్పటికై యుద్ధం ఆపేయండి.'' అంటూ చెప్పుకొచ్చాడు. చివరలో 'నో వార్' అని కెమెరా లెన్స్‌పై రాసి రుబ్లెవ్ తన సంఘీభావాన్ని ప్రకటించాడు.
కాగా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలపై ప్రత్యక్ష దాడికి దిగిన రష్యా సేనలు శుక్రవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్ సరిహద్దులకు వచ్చాయి. ఉక్రెయిన్‌లోని పలు నగరాలు, మిలటరీ బేస్‌లపై రష్యా వైమానిక దాడులు శుక్రవారం కూడా కొనసాగాయి. మూడు వైపుల నుంచి ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు దాడులు చేస్తున్నాయి. ఉక్రెయిన్‌లో ప్రస్తుత ప్రభుత్వాన్ని తొలగించి తమకనుకూల ప్రభుత్వాన్ని కూర్చోబెట్టాలన్నదే పుతిన్ ప్రయత్నమని ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నాయి.
చదవండి: Nick Kyrgios: కుడిచేయిపై కత్తి గాట్లు.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న టెన్నిస్ స్టార్
Ukraine-Russia War: 'పనికిమాలిన చర్య.. రష్యాకు రేసింగ్‌కు వెళితే చెప్పుతో కొట్టుకున్నట్లే'
Russian tennis player Andrey Rublev writes "No war please" on the camera following his advancement to the final in Dubai. pic.twitter.com/GQe8d01rTd
— TSN (@TSN_Sports) February 25, 2022
Comments
Please login to add a commentAdd a comment