మరో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కన్నుమూత
చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కళా తపస్వీ విశ్వనాథ్ మరణవార్తను మరవక ముందే.. ప్రముఖ నిర్మాత ఆర్ .వి. గురుపాదం (53) కన్నుమూశారు. బెంగళూరులో నివాసం ఉంటున్న ఆయన శనివారం గుండెపోటుతో మరణించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడలో 25కుపైగా చిత్రాలను నిర్మించారు. తెలుగులో వయ్యారి భామలు వగలమారి భర్తలు, పులి బొబ్బిలి, సొమ్ము ఒకడిది సోకు ఒకడిది, తిరుపతి క్షేత్ర మహాత్యం చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.