'సస్పెన్షన్ ఎత్తివేసేలా చొరవ తీసుకోండి'
హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో శుక్రవారం తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ నుంచి తమను సస్పెన్షన్ చేయటాన్ని వారు ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లారు. తమపై సస్పెన్షన్ ఎత్తివేసి సభలోకి అనుమతించేలా చొరవ తీసుకోవాలని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ గవర్నర్‌ను కలిసేందుకు అసెంబ్లీ నుంచి ఛలో రాజ్‌భవన్‌కు వెళ్లారు. కాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయ్యేవరకూ తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే.