అత్యాచారానికి పాల్పడిన నిందితుడు రిమాండ్
డబీర్‌పురా: మైనర్ బాలికపై ఆత్యాచారానికి పాల్పడిన ఓ నిందితున్ని శనివారం డబీర్‌పురా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డబీర్‌పురా పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మీర్‌చౌక్ ఏసీపీ ఎస్.గంగాధర్ వివరాలను వెల్లడించారు. వివరాలు.. నూర్‌ఖాన్‌బజార్ ప్రాంతానికి చెందిన సాబేరా బేగం ఇంట్లో షాహిన్‌నగర్ ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక (12) గత ఐదు నెలలుగా పని చేస్తుంది.
కాగా సాబేరా బేగం ఇంటి సమీపంలో అల్లుడు అహ్మదుల్లా ఖాన్ ఆలియాస్ ఫర్హత్ (50) నివాసముంటున్నాడు. బాలిక తరుచూ కూరగాయలను ఇచ్చేందుకు అహ్మదుల్లా ఇంటికి వెళ్లేది. కాగా బాలికపై కన్నేసిన అహ్మదుల్లా గత నాలుగు రోజుల క్రితం బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. షాహిన్‌నగర్ నుంచి కూతురిని చూసేందుకు తల్లి అఫ్సియా బేగంకు చేరుకుంది. దీంతో బాలిక జరిగిన సంఘటనను తల్లి అఫ్సియా బేగంకు వివరించింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు శనివారం అహ్మదుల్లాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.