S. gopal reddy
-
జూలై 4న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: నీనాగుప్తా (నటి), ఎస్.గోపాల్‌రెడ్డి (సినిమాటోగ్రాఫర్) ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 1 కావడం వల్ల ఈ సంవత్సరం మీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. అవివాహితులకు వివాహ యోగం, జీవితంలో ఉన్నతికి చేరుకుంటారు. కొత్త స్నేహాలు, కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. పిల్లలకు పెళ్లి చేస్తారు. ఆశావహ దృక్పథంతో, దృఢవిశ్వాసంతో తమ రంగాలలో కీలక స్థానానికి చేరుకుంటారు. కంప్యూటర్ రంగంలోని వారికి, ఎంబీఏ; సి.ఎ, ఎల్.ఎల్.బి వారికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి. రియల్ ఎస్టేట్, మైన్స్ రంగాలవారు లాభాలు ఆర్జిస్తారు. అహంభావంతో ప్రవర్తించి, అయిన వారిని దూరం చేసుకునే ప్రమాదం ఉంది కాబట్టి, అహాన్ని తగ్గించుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,4,5, 6; లక్కీ కలర్స్: వయొలెట్, రోజ్, ఆరంజ్, క్రీమ్, గోల్డెన్, శాండల్; లక్కీ డేస్: శుక్ర, శని, ఆదివారాలు. సూచనలు: తండ్రిని, తండ్రి తరఫు వారిని ఆదరించాలి. పేదవారికి గోధుమలు, మినుములు దానం చేయడం, మూగజీవాలకు ఆహారం తినిపించడం, అనాథలకు అన్నదానం చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, సంఖ్య, జ్యోతిష శాస్త్ర నిపుణులు -
వామ్మో...భయపెడతారట
సీనియర్ దర్శకుడు సాగర్ దర్శకత్వంలో శ్రీనివాసరెడ్డి, జస్వంత్ హీరోలుగా జస్వంత్ నిర్మిస్తున్న ‘వామ్మో’ చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి ఎస్.గోపాల్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, బ్రహ్మానందం క్లాప్ ఇచ్చారు. తమ్మారెడ్డి భరద్వాజ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకూ తాను తీసిన 30 సినిమాల్లోకెల్లా విభిన్నంగా ఉండే సినిమా ఇదేననీ, వినోదంతో పాటు ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉండే హారర్ చిత్రమిదనీ సాగర్ చెప్పారు. కమెడియన్‌గా చేస్తూనే మంచి అవకాశం వస్తే.. హీరోగా నటిస్తున్నాననీ, సాగర్ లాంటి మంచి దర్శకునితో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాననీ శ్రీనివాసరెడ్డి అన్నారు. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, మే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. బ్రహ్మానందం, సుధీర్, శ్రీను, మహేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి, కూర్పు: వి.నాగిరెడ్డి, సంగీతం: కీరవాణి, కోటి, మణిశర్మ, దేవిశ్రీప్రసాద్, నేపథ్య సంగీతం: సాయికార్తీక్. -
పెట్రోల్ బంక్‌ల మోసాలపై 18 కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో పెట్రోల్ బంకుల మోసాలకు అడ్డుకట్టపడటం లేదు. తూనికలు, కొలతల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్‌డ్రైవ్‌లో మోసాలకు పాల్పడుతున్న పెట్రోల్‌బంక్‌లపై 18 కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్, అదనపు డీజీపీ ఎస్.గోపాల్ రెడ్డి బుధవారం తెలిపారు. శ్రీకాకుళంలో 4, వరంగల్‌లో 3, గుంటూరు, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో రెండు చొప్పున, కర్నూలు, నిజామాబాద్, నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్ జిల్లాల్లో ఒక్కో పెట్రోల్బంకుపై కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. వినియోగదారులు పెట్రోల్ పంపింగ్‌పై అనుమానాలుంటే తూనికలు కొలతల శాఖ టోల్‌ఫ్రీ నంబర్ 1860-425-3333, లేదా 9490165619 నంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందించాలని గోపాల్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
తూకాల్లో మోసాలపై రాష్ట్రవ్యాప్తంగా 189 కేసులు
హైదరాబాద్, న్యూస్‌లైన్: పత్తి కొనుగోళ్ల సమయంలో తూకంలో మోసాలకు పాల్పడుతున్న స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లుల కేంద్రాలపై రాష్ట్ర వ్యాప్తంగా 189 కేసులు నమోదు చేసినట్లు తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ ఎస్.గోపాల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఈ నెల 20, 21 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లులతో తనిఖీలు నిర్వహించామని.. మోసాలకు పాల్పడిన మిల్లులలపై 189 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. తూనికల, కొలతల శాఖ సీల్ వేసిన యంత్రాలనే వాడాలని తెలిపారు.