విద్యార్థి నాయకుడి వికృత చేష్టలు
విద్యార్థినిపై అత్యాచారయత్నం
'సాక్షి' కథనాలకు స్పందించిన పోలీసులు
అనంతపురం
ఎస్కేయూలో ఎంఏ రాజనీతి శాస్త్రం చదువుతున్న ఓ విద్యార్థి నాయకుడు జూనియర్ విద్యార్థిని వేధింపులకు గురిచేసిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. విభాగంలోనే ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఇది తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు వేధింపులకు పాల్పడుతున్న శశాంక్ నాయక్ తో గొడవపడ్డారు.
ఔశశాంక్ తమ కూతురికి కొంతకాలంగా అసభ్యకరమైన మెసేజ్లు పంపుతున్నాడని ఆగ్రహించారు. ఆమె పలుమార్లు హెచ్చిరించినా అతనిలో మార్పులేదన్నారు. ఈ అంశంపై స్పందించిన విభాగాధిపతి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి మిన్నకుండిపోయారు. దీనిపై రాజనీతి శాస్త్రం విభాగపు విద్యార్థినులు విభాగాధిపతిని నిలదీశారు. తమపై వేధింపులకు పాల్పడుతున్నా నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గురుతర బాధ్యతగల విద్యార్థి నాయకుడి దుష్ర్పవర్తనపై వర్సిటీలో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
'సాక్షి'కి స్పందన
విద్యార్థిని పై అత్యాచార యత్నానికి విద్యార్థి నాయకుడు చేష్టలపై 'సాక్షి' మీడియాలో కథనాలు ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్ధి నాయకుడు శశాంక్ నాయక్ నాయక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.