కొరియాలో మరో మూడు మెర్స్ కేసులు నమోదు
సియోల్: దక్షిణ కొరియాలో మరో ముగ్గురు మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వైరస్ బారిన పడ్డారు. దీంతో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 169కి చేరిందని ఆ దేశ వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం వెల్లడించింది. ఈ వైరస్ బారిన పడిన ఇద్దరు వైద్య సిబ్బందితోపాటు వైద్యుడు ప్రస్తుతం సియోల్‌లోని శామ్ సంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది.
ఈ వైరస్‌తో ఇప్పటి వరకు 25 మంది మృతి చెందారని చెప్పింది. అయితే మరో ఆస్పత్రిలోని వైద్య సిబ్బందిలోని ఓ వ్యక్తి కూడా ఈ వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నామని... ఈ నేపథ్యంలో అతడికి స్థానికంగా మరో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. మెర్స్ వైరస్ దక్షిణ కొరియాను వణికిస్తున్న సంగతి తెలిసిందే.