breaking news
SA20 Auction
-
SA20 Auction: టాప్-5 ఖరీదైన ప్లేయర్లు.. ఖరారైన ఆరు జట్ల పూర్తి వివరాలు
సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలం-2026 (SA20 Auction) ముగిసింది. వచ్చే ఏడాది జరిగే ఈ పొట్టి ఫార్మాట్ టోర్నీ కోసం ఆరు జట్లు తమ ఆటగాళ్లను ఖరారు చేసుకున్నాయి. జొహన్నస్‌బర్గ్ వేదికగా మంగళవారం జరిగిన ఈ వేలంపాటలో ప్రొటిస్ యువ తరంగం డెవాల్డ్ బ్రెవిస్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.ప్రిటోరియా క్యాపిటల్స్ బ్రెవిస్ (Dewald Brevis)ను రూ. 8.31 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, అంతకంటే ముందు డర్బన్ సూపర్ జెయింట్స్.. సౌతాఫ్రికా టీ20 జట్టు కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ను రూ. 7 కోట్లకు దక్కించుకుంది.టాప్-5 ఖరీదైన ప్లేయర్లు వీరేఈ నేపథ్యంలో ఎస్ఏటీ20 చరిత్రలో ఖరీదైన ఆటగాళ్లుగా బ్రెవిస్, మార్క్రమ్ తొలి రెండు స్థానాలు దక్కించుకున్నారు. ఆ తర్వాతి ప్లేస్‌లో వియాన్ ముల్దర్ (రూ. 4.50 కోట్లు- జోబర్గ్ సూపర్ కింగ్స్), గెరాల్డ్ కోయెట్జి (రూ. 3.73 కోట్లు- డర్బన్ సూపర్ జెయింట్స్), నండ్రీ బర్గర్ (రూ. 3.20 కోట్లు- జొబర్గ్ సూపర్ కింగ్స్) నిలిచారు.మరి.. ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు, వేలంలో అమ్ముడుపోయిన ప్లేయర్లు.. వెరసి వచ్చే ఏడాది ఆరు ఫ్రాంఛైజీలకు సంబంధించి ఖరారైన జట్ల వివరాలు తెలుసుకుందామా?!సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్👉ముందస్తు ఒప్పందం: జానీ బెయిర్‌స్టో, ఏఎమ్ ఘజన్ఫర్, ఆడం మిల్నే.👉రిటైన్డ్ ప్లేయర్లు: ట్రిస్టన్ స్టబ్స్👉వైల్డ్‌కార్డు: మార్కో యాన్సెన్ఎంఐ కేప్‌టౌన్👉రిటైన్డ్ ప్లేయర్లు: ట్రెంట్ బౌల్ట్, రషీద్ ఖాన్, రియాన్ రికెల్టన్, కగిసో రబడ, జార్జ్ లిండే, కార్బిన్ బాష్.👉ముందస్తు ఒప్పందం: నికోలస్ పూరన్.జొహన్నస్‌బర్గ్ సూపర్ కింగ్స్👉రిటైన్డ్ ప్లేయర్లు: ఫాఫ్ డుప్లెసిస్, డొనొవాన్ ఫెరీరా👉ముందస్తు ఒప్పందం: జేమ్స్ విన్స్, అకీల్ హొసేన్ప్రిటోరియా క్యాపిటల్స్👉ముందస్తు ఒప్పందం: ఆండ్రీ రసెల్, విల్ జాక్స్, షెర్ఫానే రూథర్ఫర్డ్పర్ల్ రాయల్స్👉రిటైన్డ్ ప్లేయర్లు: లువామన్-డి- ప్రిటోరియస్, డేవిడ్ మిల్లర్, జార్జ్ ఫార్చూన్👉ముందస్తు ఒప్పందం: సికందర్ రజా, ముజీబ్-ఉర్- రహమాన్.డర్బన్ సూపర్ జెయింట్స్👉ముందస్తు ఒప్పందం: సునిల్ నరైన్👉రిటైన్డ్ ప్లేయర్లు: నూర్ అహ్మద్👉వైల్డ్ కార్డ్: హెన్రిచ్ క్లాసెన్వేలం ముగిసిన తర్వాత పూర్తి జట్లుసన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుట్రిస్టన్ స్టబ్స్, మార్కో యాన్సెన్, జానీ బెయిర్‌స్టో, AM ఘజన్ఫర్, ఆడమ్ మిల్నే, క్వింటన్ డి కాక్, మాథ్యూ బ్రీట్జ్కే, అన్రిచ్ నోర్ట్జే, సెనురాన్ ముత్తుసామి, పాట్రిక్ క్రూగర్, లూథో సిపమ్లా, మిచెల్ వాన్ బ్యూరెన్, జోర్డాన్ హర్మన్, బేయర్స్ స్వనేపోల్, జేమ్స్ కోల్స్, క్రిస్ వుడ్, లూయిస్ గ్రెగరీ, సీజే కింగ్, జేపీ కింగ్.ఎంఐ కేప్‌టౌన్ జట్టుట్రెంట్ బౌల్ట్, రషీద్ ఖాన్, ర్యాన్ రికెల్టన్, జార్జ్ లిండే, కార్బిన్ బాష్, కగిసో రబడా, నికోలస్ పూరన్, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, రీజా హెండ్రిక్స్, డ్వైన్ ప్రిటోరియస్, ట్రిస్టన్ లూస్, జాసన్ స్మిత్, టామ్ మూర్స్, డేన్ పీడ్ట్, టియాన్ వాన్ వారెన్, డాన్ లటేగన్, తబ్రేజ్ షంసీ, కరీం జనత్, జాకెవ్స్ స్నీమాన్.జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్టుఫాఫ్ డు ప్లెసిస్, డోనోవన్ ఫెరీరా, జేమ్స్ విన్స్, అకేల్ హోసేన్, రిచర్డ్ గ్లీసన్, వియాన్ ముల్దర్, నండ్రీ బర్గర్, ప్రేనాలెన్ సుబ్రేయన్, డయాన్ ఫారెస్టర్, స్టీవ్ స్టోక్, జాంకో స్మిత్, నీల్ టిమ్మర్స్, శుభమ్ రంజానే, బ్రాండన్ కింగ్, రీలీ రొసోవ్, రివాల్డో మూన్సామీ, ఇమ్రాన్ తాహిర్, రీస్ టోప్లీ.ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టుఆండ్రీ రస్సెల్, విల్ జాక్స్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, కేశవ్ మహరాజ్, లుంగీ ఎన్గిడి, డెవాల్డ్ బ్రెవిస్, లిజాద్ విలియమ్స్, క్రెయిగ్ ఓవర్టన్, సాకిబ్ మహమూద్, కోడీ యూసుఫ్, కానర్ ఈస్టర్హుజెన్, బ్రైస్ పార్సన్స్, గిడియాన్ పీటర్స్, జునైద్ దావూద్, విల్ స్మీడ్, మీకా- ఈల్ ప్రిన్స్, బయాండా మజోలా, విహాన్ ల్యూబ్, సిబోనెలో మఖాన్య.పర్ల్ రాయల్స్ జట్టులువాన్-డ్రే ప్రిటోరియస్, డేవిడ్ మిల్లర్, జోర్న్ ఫార్చూయిన్, రూబిన్ హెర్మాన్, సికందర్ రజా, ముజీబ్-ఉర్-రహమాన్, ఒట్నీల్ బార్ట్‌మాన్, గుడకేష్ మోటీ, డెలానో పోట్గీటర్, కైల్ వెర్రెయిన్, కీగన్ లయన్-కాచెట్, అసా ట్రూడ్, హార్డస్ విల్జోన్, జాకన్ జొహన్స్ బేసర్, డాన్ లారెన్స్, ఇషాన్ మలింగ, ఎన్కొబానీ మొకొయెనా, విశేన్ హలాంబగే, ఎన్కబా పీటర్.డర్బన్ సూపర్ జెయింట్స్నూర్ అహ్మద్, హెన్రిచ్ క్లాసెన్, సునీల్ నరైన్, జోస్ బట్లర్, క్వేనా మఫాకా, ఐడెన్ మార్క్రమ్, డెవాన్ కాన్వే, గెరాల్డ్ కోయెట్జీ, డేవిడ్ బెడింగ్హామ్, మార్క్వెస్ అకెర్మాన్, ఈథన్ బాష్, ఆండిలే సిమెలానే, టోనీ డీ జోర్జి, డయాన్ గలీమ్, తైజుల్ ఇస్లాం, ఎవాన్ జోన్స్, గిస్బెర్ట్ వేజ్, డేవిడ్ వీస్, డారిన్ డుపావిలోన్.చదవండి: ‘యువీకి అప్‌గ్రేడ్ వర్షన్ అతడు.. గిల్‌కు కూడా మంచి ఛాన్స్’ -
SA20 లీగ్ వేలంలో సంచలనం.. సెకెన్ల వ్యవధిలో 1050 శాతం పెరిగిన ఆటగాడి జీతం
నిన్న జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓ ఆటగాడి జీతం సెకెన్ల వ్యవధిలో 1050 శాతం పెరిగింది. ఈ హఠాత్ పరాణామం చూసి నిర్వహకులు సహా వేలంలో పాల్గొన్న వారంతా నివ్వెరపోయారు.పూర్తి వివరాల్లో వెళితే.. WTC 2023-25 టైటిల్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు సభ్యుడు కైల్ వెర్రిన్ నిన్న జరిగిన వేలంలో R200K (₹10.06 లక్షలు) బేస్ ధరతో పాల్గొన్నాడు. వెర్రిన్ను పార్ల్ రాయల్స్ ఇదే ధరకు దక్కించుకుని సంతృప్తి చెందింది. అయితే ఈలోపే వెర్రిన్ను దక్కించుకునేందుకు ప్రిటోరియా క్యాపిటల్స్ RTM (Right to Match) కార్డ్‌తో ముందుకొచ్చింది.దీంతో అలర్ట్ అయిన రాయల్స్ వెర్రిన్ ధరకు ఒక్కసారిగా 1050 శాతం పెంచి R2.3 మిలియన్లకు (₹1.15 కోట్లు) తీసుకెళ్లింది. ఇది చూసి క్యాపిటల్స్ సహా వేలం నిర్వహకులంతా నివ్వెరపోయారు. రాయల్స్ ఒక్కసారిగా వెర్రిన్ ధరను ఎందుకంత పెంచిందో ఎవ్వరికీ అర్దం కాలేదు. వికెట్‌కీపర్ బ్యాటర్ అయిన వెర్రిన్‌కు రాయల్స్ అంత ప్రాధాన్యత ఇవ్వడం చూసి జనాలు అవాక్కయ్యారు.వాస్తవానికి వెర్రిన్ను పొట్టి ఫార్మాట్లో చెప్పుకోదగ్గ ట్రాక్ రికార్డేమీ లేదు. అతనో సాధారణ వికెట్‌కీపర్ బ్యాటర్ మాత్రమే. అడపాదడపా మెరుపులు మెరిపించగలడు. మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వస్తాడు. రాయల్స్ ఈ స్థాయి భారీ మొత్తం వెచ్చించాలనుకుంటే ఇంతకంటే మెరుగైన ప్రొఫైల్ ఉన్న ఆటగాడి కోసం పోటీపడి ఉండవచ్చు. కానీ వెర్రిన్‌కు ఇంత భారీ బిడ్ ఎందుకు వేసిందో మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉండిపోయింది. ఫైనల్‌గా రాయల్స్ వెర్రిన్ను దక్కించుకోగలిగింది కానీ, అనవసర ఖర్చును మీదేసుకుంది. ఒకవేళ క్యాపిటల్స్ కానీ మరే ఇతర ఫ్రాంచైజీ కానీ వెర్రిన్ కోసం పోటీపడినా అతని ధర భారత కరెన్సీలో ₹30 లక్షలు మించేది కాదు. అలాంటిది రాయల్స్ ఏకంగా ₹1.15 కోట్లు పెట్టి చేతులు కాల్చుకుంది. ఏది ఏమైనా వెర్రిన్ మాత్రం జాక్‌పాట్ కొట్టాడు. ₹10 లక్షలే ఎక్కువనుకుంటే.. సెకెన్ల వ్యవధిలో కోటీశ్వరుడయ్యాడు. అతని కెరీర్లో ఇదే భారీ వేలం మొత్తం. వెర్రిన్ గత రెండు సీజన్లలో క్యాపిటల్స్‌కు ఆడాడు. ఇందుకే ఆ ఫ్రాంచైజీ వెర్రిన్ కోసం RTM వాడింది.Paarl Royals Squad 2025–26: డేవిడ్ మిల్లర్ (కెప్టెన్), కైల్ వెర్రిన్, సికందర్ రజా, ముజీబ్ ఉర్ రెహ్మాన్, గుడకేష్ మోటీ, బ్జోర్న్ ఫోర్టుయిన్, డాన్ లారెన్స్, హార్డస్ విల్జోయెన్, డెలానో పోట్గిటర్, రూబిన్ హెర్మన్, లుహాన్-డ్రే ప్రిటోరియస్, కీగన్ లయన్-కాషెట్, ఎషాన్ మాలింగ, ఆసా ట్రైబ్, విశెన్ హలంబేజ్, జాకబ్ బాస్సన్, ఎన్కోబాని మొకోయెనా, ఎన్కాబయోమ్జీ పీటర్ -
బవుమాకు ఘోర అవమానం.. వరుసగా రెండోసారి..!
జోహన్నెస్‌బర్గ్ వేదికగా నిన్న (సెప్టెంబర్ 9) జరిగిన SA20 లీగ్ 2025-26 వేలంలో సౌతాఫ్రికా వన్డే, టెస్ట్ జట్టు కెప్టెన్ టెంబా బవుమాకు ఘోర అవమానం జరిగింది. జాతీయ జట్టుకు రెండు ఫార్మాట్లలో కెప్టెన్ అయినా బవుమాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. వరుసగా రెండో సీజన్లో ఫ్రాంచైజీలు బవుమాను చిన్నచూపు చూశాయి. ఈసారి వేలంలో బవుమా 2 లక్షల ర్యాండ్ల బేస్ ప్రైజ్ విభాగంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. అతనిపై ఒక్క ఫ్రాంచైజీ కూడా ఆసక్తి కనబర్చలేదు.ఫ్రాంచైజీలు చిన్నచూపు చూడటానికి బవుమా టీ20 రికార్డు మరీ అంత తీసికట్టుగా ఏమీ లేదు. ఈ ఫార్మాట్లో అతను 123.99 స్ట్రయిక్‌రేట్‌తో 27.07 సగటున 2653 పరుగులు చేశాడు. అంతర్జాతీయంగానూ బవుమా టీ20 రికార్డు బాగానే ఉంది. సౌతాఫ్రికా తరఫున అతను 36 టీ20ల్లో 118.17 స్ట్రయిక్‌రేట్‌తో 670 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ద సెంచరీ ఉంది.2021-2022 మధ్యలో బవుమా సౌతాఫ్రికా టీ20 కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. అతని సారథ్యంలో సౌతాఫ్రికా రెండు టీ20 వరల్డ్‌కప్‌లు (2021,2022) ఆడింది. అయినా బవుమాను సొంత దేశంలో జరిగే టోర్నీలోనే ఫ్రాంచైజీలు పట్టించుకోకపోవడం నిజంగా బాధాకరం. బవుమా ఆటగాడిగా, కెప్టెన్‌గా తన జట్టుకు వంద శాతం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు. కొన్ని సార్లు సఫలం కాకపోవచు. ఇది ఆటలో సర్వసాధాణం.బవుమాకు పొట్టి క్రికెట్ ఆడే టాలెంట్ లేక విస్మరణకు గురైతే పెద్దగా పట్టింపు లేదు. అతనిలో పొట్టి క్రికెట్‌కు కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నా ఎవరు పట్టించుకోకపోవడమే బాధాకరం. అత్యుత్తమ కెప్టెన్ఎవరు ఔనన్నా కాదన్నా సౌతాఫ్రికా క్రికెట్ చరిత్రలో బవుమా అత్యుత్తమ కెప్టెన్. ఈ ఏడాది అతను సౌతాఫ్రికాను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌గా నిలబెట్డాడు. తాజాగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ను వారి దేశాల్లోనే వన్డే సిరీస్‌ల్లో మట్టికరిపించాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా ఘనమైన ట్రాక్ రికార్డు ఉన్న బవుమాకు సొంత దేశంలో జరిగే టోర్నీలోనే ఆదరణ లభించకపోవడం విచారకరం. ఇదిలా ఉంటే, నిన్న జరిగిన వేలంలో బవుమాతో పాటు జేమ్స్ ఆండర్సన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, కుసాల్ పెరీరా, మొయిన్ అలీ లాంటి స్టార్ ఆటగాళ్లకు కూడా చుక్కెదురైంది. వీరిని కూడా ఏ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. డెవాల్డ్ బ్రెవిస్, ఎయిడెన్ మార్క్రమ్, మాథ్యూ బ్రీట్జ్కీ లాంటి ఆటగాళ్లు మాత్రం జాక్‌పాట్ కొట్టారు. బ్రెవిస్‌ను ప్రిటోరియా క్యాపిటల్స్ రూ. 8.31 కోట్లకు.. మార్క్రమ్ను డర్బన్ సూపర్ జెయింట్స్ రూ. 7.05 కోట్లకు.. బ్రీట్ట్కేను సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ రూ. 3.05 కోట్లకు కొనుగోలు చేశాయి. -
సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలంలో గంగూలీ మార్క్..
టీమిండియా దిగ్గజం సౌరవ్ గంగూలీ.. ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా తన పనని మొదలు పెట్టాడు. జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్-2026 వేలంలో గంగూలీ తన మార్క్‌ను చూపించాడు. అత్యధిక పర్స్ వాల్యూతో వేలంలోకి వచ్చిన ప్రిటోరియా క్యాపిటల్స్.. తొలి ఆటగాడిగా సౌతాఫ్రికా స్టార్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్‌ను సొంతం చేసుకుంది.సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ యజమాని కావ్య మారన్‌తో పోటీపడి మరి 1.7 మిలియన్ ర్యాండ్లు(సుమారు రూ. 85 లక్షలు)కు మహారాజ్‌ను ప్రిటోరియా దక్కించుకుంది. అతడిని సొంతం చేసుకోవడంలో గంగూలీది కీలక పాత్ర. ఆ తర్వాత సౌతాఫ్రికా టీ20 వేలంలో పది మిలియన్ ర్యాండ్లు దాటిన మొదటి ఆటగాడిగా నిలిచిన ఐడెన్ మార్క్రమ్ కోసం కూడా ప్రిటోరియా తీవ్రంగా ప్రయత్నించింది. కానీ డర్బన్ సూపర్ జెయింట్స్ గట్టీ పోటీ ఇవ్వడంతో క్యాపిటల్స్ వెనక్కి తగ్గింది. మార్క్రమ్ను డర్బన్ సూపర్ జెయింట్స్ రికార్డు స్థాయిలో రూ. 7 కోట్లకు కొనుగోలు చేసింది.క్యాపిటల్స్‌లోకి బ్రెవిస్..ఇక మార్క్రమ్ను దక్కించుకోవడంలో విఫలమైన సౌరవ్ గంగూలీ.. సౌతాఫ్రికా సూపర్ స్టార్ డెవాల్డ్ బ్రెవిస్‌ను మాత్రం ఆఖరివరకు పోటీపడి మరి తమ జట్టులోకి తీసుకొచ్చాడు. ప్రిటోరియా క్యాపిటల్స్ అతడి కోసం ఏకంగా రూ. 8.3 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో ఎస్ఎ టీ20 లీగ్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా 22 ఏళ్ల బ్రెవిస్ నిలిచాడు. బ్రెవిస్ కోసం జోబర్గ్ సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లేమింగ్ కూడా ఆఖరి వరకు ప్రయత్నించాడు. కానీ ప్రిటోరియా క్యాపిటల్స్ మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గలేదు. అదేవిధంగా గంగూలీ అండ్ కో ప్రోటీస్ స్టార్ ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడీని సైతం సొంతం చేసుకున్నారు. కాగా ప్రిటోరియా క్యాపిటల్స్ ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ సిస్టర్ ఫ్రాంచైజీ కావడం విశేషం. ఈ ఏడాది ఆగస్టులో ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా గంగూలీ ఎంపికయ్యాడు. గత కొన్ని ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా గంగూలీ వ్యహరించిన సంగతి తెలిసిందే. -
వేలంలో రికార్డులు బద్దలు కొట్టిన డెవాల్డ్ బ్రెవిస్.. కాస్ట్లీ ప్లేయర్‌గా చరిత్ర
సౌతాఫ్రికా యువ క్రికెటర్ డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) సరికొత్త చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలం (SAT20 Auction)లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. కాగా 2023లో ఎస్టీ20 లీగ్ మొదలు కాగా.. వరుసగా రెండు సీజన్లలో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టైటిల్ సాధించింది.అత్యధిక ధర పలికిన ఆటగాడిగా మార్క్రమ్ఈ ఏడాది కూడా సన్‌రైజర్స్ ఫైనల్ చేరగా.. ఎంఐ కేప్‌టౌన్ తొలిసారి టైటిల్ సొంతం చేసుకుంది. ఇక వచ్చే ఏడాదికి ఇప్పటికే ఈ లీగ్‌లోని ఆరు జట్లు రిటెన్షన్ జాబితా విడుదల చేయగా.. మంగళవారం వేలానికి షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో ఎస్ఏటీ20 -2026 వేలంలో తొలుత ఐడెన్ మార్క్రమ్ (Aiden Markram) అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు.కాగా సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ కెప్టెన్‌గా రెండుసార్లు టైటిల్ అందించిన ఘనత మార్క్రమ్కు ఉంది. అయితే, కారణమేమిటో తెలియదు గానీ.. వేలానికి ముందే సన్‌రైజర్స్‌తో అతడు బంధం తెంచుకున్నాడు. ఈ క్రమంలో వేలంలోకి రాగా.. డర్బన్ సూపర్ జెయింట్స్ రికార్డు స్థాయిలో రూ. 7 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది.కాసేపటికే రికార్డు బద్దలుతద్వారా ఎస్‌ఏఈ టీ20 లీగ్ చరిత్రలో ఖరీదైన ప్లేయర్‌గా మార్క్రమ్ రికార్డు సాధించాడు. అయితే, కాసేపటికే అతడి రికార్డును యువ తార డెవాల్డ్ బ్రెవిస్ బద్దలు కొట్టేశాడు. ప్రిటోరియా క్యాపిటల్స్ అతడి కోసం ఏకంగా రూ. 8.3 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో లీగ్ హిస్టరీలోనే కాస్ట్లీ ప్లేయర్‌గా 22 ఏళ్ల బ్రెవిస్ చరిత్ర లిఖించాడు.అంతర్జాతీయ క్రికెట్లోనూకాగా ఐపీఎల్లో 2022లో అరంగేట్రం చేసిన డెవాల్డ్ బ్రెవిస్.. ఇప్పటి వరకు 16 మ్యాచ్‌లు ఆడి.. 455 పరుగులు సాధించాడు. చివరగా అంటే 2025 సీజన్లో అతడు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. హిట్టర్‌గా పేరొందిన బ్రెవిస్ 2023లోనే అంతర్జాతీయ క్రికెట్లోనూ అడుగుపెట్టాడు.అయితే, సౌతాఫ్రికా తరపున టీ20లకే పరిమితమైన బ్రెవిస్.. ఈ ఏడాది టెస్టు, వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో 10 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 318 పరుగులు చేశాడు. ఇక ఆరు వన్డేల్లో 110, రెండు టెస్టుల్లో కలిపి 84 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా టీ20 కెప్టెన్‌గా ఉన్న ఐడెన్ మార్క్రమ్ ఈసారి డర్బన్ సూపర్ జెయింట్స్ సారథిగా పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది.సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 రిటెన్షన్స్ జాబితాసన్రైజర్స్ ఈస్టర్న్‌కేప్🏏ముందస్తు ఒప్పందం: జానీ బెయిర్‌స్టో, ఏఎమ్ ఘజన్ఫర్, ఆడం మిల్నే.🏏రిటైన్డ్ ప్లేయర్లు: ట్రిస్టన్ స్టబ్స్🏏వైల్డ్‌కార్డు: మార్కో యాన్సెన్ఎంఐ కేప్‌టౌన్🏏రిటైన్డ్ ప్లేయర్లు: ట్రెంట్ బౌల్ట్, రషీద్ ఖాన్, రియాన్ రికెల్టన్, కగిసో రబడ, జార్జ్ లిండే, కార్బిన్ బాష్.🏏ముందస్తు ఒప్పందం: నికోలస్ పూరన్.జొహన్నస్‌బర్గ్ సూపర్ కింగ్స్🏏రిటైన్డ్ ప్లేయర్లు: ఫాఫ్ డుప్లెసిస్, డొనొవాన్ ఫెరీరా🏏ముందస్తు ఒప్పందం: జేమ్స్ విన్స్, అకీల్ హొసేన్ప్రిటోరియా క్యాపిటల్స్🏏ముందస్తు ఒప్పందం: ఆండ్రీ రసెల్, విల్ జాక్స్, షెర్ఫానే రూథర్ఫర్డ్డర్బన్ సూపర్ జెయింట్స్🏏ముందస్తు ఒప్పందం: సునిల్ నరైన్🏏రిటైన్డ్ ప్లేయర్లు: నూర్ అహ్మద్🏏వైల్డ్ కార్డ్: హెన్రిచ్ క్లాసెన్పర్ల్ రాయల్స్🏏రిటైన్డ్ ప్లేయర్లు: లువామన్-డి- ప్రిటోరియస్, డేవిడ్ మిల్లర్, జార్జ్ ఫార్చూన్🏏ముందస్తు ఒప్పందం: సికందర్ రజా, ముజీబ్-ఉర్- రహమాన్.చదవండి: ఆల్‌టైమ్ ఆసియా టీ20 జట్టు: భారత్ నుంచి ఐదుగురు.. యువీకి నో ఛాన్స్