SAAP chairman
-
యువతకు మంచి అవకాశం..‘ఆడుదాం ఆంధ్రా’ : మంత్రి రోజా
సాక్షి,విజయవాడ : దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఆడుదాం ఆంధ్రా వంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్త క్రీడా టోర్నమెంట్ల వీడియో లాంఛ్ ,బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో కలిసి రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ ప్రస్తుతం యువతలో ఫిజికల్ ఫిట్నెస్ సరిగా ఉండటం లేదు. ఆడుదాం ఆంధ్రా యువతకు మంచి అవకాశం. టోర్ణమెంట్‌లో 12 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందిస్తున్నాం’ అని రోజా తెలిపారు. ’100 కోట్ల బడ్జెట్‌తో ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నాం. టోర్ణమెంట్‌లో పాల్గొనేందుకుగాను 72 గంటల్లో 5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంతమంచి అవకాశం మళ్లీ వస్తుందో లేదో ...ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి. కోటి మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారని భావిస్తున్నాం. ఏపీని ఆటల ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనేదే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం. ఆడపిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొనాలి’ అని రోజా కోరారు. శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి మాట్లాడుతూ... ‘రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడే వస్తారనే అభిప్రాయం ప్రజల్లో ఉండేది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో ఒక ట్రెండ్‌ను సృష్టించారు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుంచి ప్రతీ నాయకుడిని నిత్యం జనాల్లో ఉండేలా చూశారు. ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద క్రీడా సంబరం. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం’ అని తెలిపారు. ఇదీచదవండి..రామోజీ.. విషం కక్కడం కాదు.. చర్చకు రా : మంత్రి మేరుగ -
మహిళా గ్రాండ్ మాస్టర్‌కు ‘శాప్’ సత్కారం
సాక్షి, అమరావతి: మహిళా గ్రాండ్ మాస్టర్ నూతక్కి ప్రియాంక విజయం రాష్ట్రానికి గర్వకారణమని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఎండీ ప్రభాకరరెడ్డి కొనియాడారు. ఇటీవల ప్రతిష్టాత్మక ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్ షిప్లో 6.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించడంపై అభినందించారు. గురువారం విజయవాడలోని శాప్ కార్యాలయంలో ప్రియాంకను ఘనంగా సత్కరించారు. ప్రియాంక మాట్లాడుతూ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు, విదేశీ కోచ్‌ల ద్వారా శిక్షణ తీసుకునేందుకు ఆర్థిక సహాయం అందించాలని కోరగా శాప్ చైర్మన్, ఎండీలు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. -
సీఎం జగన్ నమ్మకాన్ని నిలబెడతా: బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. క్రీడాశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్.. సిద్దార్ద్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నాపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నమ్మకాన్ని నిలబెడతాను. రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేస్తాను. నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు నా కృతజ్ఞతలు’’ అని అన్నారు. కాగా, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ గెలుపునకు బైరెడ్డి కీలక పాత్ర పోషించారు. పాదయాత్ర సమయంలో నందికొట్కూరు ప్రచార సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. బైరెడ్డి తన మనసులో ఉన్నాడని, అధికారంలోకి వచ్చాక కచ్చితంగా మంచి ప్రాధాన్యత గల పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. సిద్ధార్థరెడ్డికి నామినేటెడ్ పోస్టు.. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ పదవిని ఇచ్చి హామీ నిలబెట్టుకున్నారు. -
మాట నిలబెట్టుకున్న సీఎం జగన్.. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక పదవి కట్టబెట్టారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారటీ చైర్మన్ పదవి(శాప్)ని బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డికి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో శనివారం నామినేటెడ్ పోస్టులను ప్రకటించారు. దీనిలో భాగంగా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పదవిని సిద్ధార్థ్‌రెడ్డికి అప్పచెప్పారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ గెలుపునకు బైరెడ్డి కీలక పాత్ర పోషించారు. చదవండి: AP Nominated Posts 2021: ఏపీలో నామినేటెడ్ పోస్టుల ప్రకటన కాగా పాదయాత్ర సమయంలో నందికొట్కూరు ప్రచార సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. బైరెడ్డి తన మనసులో ఉన్నాడని, అధికారంలోకి వచ్చాక కచ్చితంగా మంచి ప్రాధాన్యత గల పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. పాదయాత్ర సయమంలో సీఎం జగన్ ఇచ్చిన హామీని ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా నెరవేర్చారని బైరెడ్డి అభిమానులు, నియోజకవర్గ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు పోస్ట్ ఇస్తున్నట్లు ప్రకటించగానే బైరెడ్డి ఇంటి దగ్గర. పార్టీ ఆఫీసు దగ్గర కార్యకర్తలు, అభిమానులు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు. చదవండి: AP Nominated Posts List 2021: ఏపీ నామినేటెడ్ పదవులు దక్కించుకుంది వీరే.. ప్రస్తుతం నందికొట్కూరు నియోజవకర్గ ఇంచార్జ్‌గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తనకు శాప్ పదవి రావడంపై బైరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు కడపలోని ఆయన నివాసంలో సిద్ధార్థ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చారు. -
కొమ్మాదిలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమి
విశాఖపట్నం: ఇకపై తమ సంస్థ ద్వారా జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలన్ని తెలుగులోనే జరుగుతాయని శాప్ చైర్మన్ పీఆర్ మోహన్ వెల్లడించారు. బుధవారం విశాఖపట్నంలో ప్రభుత్వ అతిథి గృహంలో శాప్ 3వ సమావేశంలో పీఆర్ మోహన్ మాట్లాడారు. వ్యాయామ విద్య నిర్బంధ విద్యగా ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు. కొమ్మాదిలో రూ. 15 కోట్ల కేంద్ర నిధులతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మూత పడిన స్పోర్ట్స్ అకాడమీలను పునః ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రీడాకారుల సాయంతో ఏపీ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తామని శాప్ చైర్మన్ పీఆర్ మోహన్ వెల్లడించారు.