ట్యాంకర్ ఢీకొని వ్యక్తి మృతి
ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా బిర్కూరు మండలం నసుర్లాబాద్లో ఆదివారం ఉదయం నీళ్ల ట్యాంకర్ వాహనం వేగంగా వచ్చి సైకిల్‌పై వెళుతున్న సబావత్ చందర్ (55)ను ఢీకొంది. తీవ్ర గాయాలతో అతడు అక్కడే మృతి చెందాడు. మృతుడ్ని రాములగుట్ట తండాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రాజ్‌భరత్‌రెడ్డి తెలిపారు.