sacrifice of the martyrs
-
ప్రశ్న.. పాఠమయ్యేదెప్పుడు?
నిర్మల్: దేశచరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటనగా జలియన్‌వాలాబాగ్ ఊచకోతకు పేరుంది. జనరల్ డయ్యర్ చేసిన ఈ నరమేథాన్ని దేశం ఇప్పటికీ గుర్తుపెట్టుకుంది. కారణం మన చరిత్రపుటల్లో ఈ ఘటనకు..కారకులకు..అమరులకు చోటిచ్చారు కనుక. కానీ.. జలియన్‌వాలాబాగ్ ఘటన కంటే దాదాపు 60 ఏళ్లకిందట అంతకంటే దారుణమైన మారణహోమం మనరాష్ట్రంలోనే చోటుచేసుకుంది. ఒకేసారి వెయ్యిమందిని అత్యంత కిరాతకంగా కాళ్లూచేతులు విరగ్గొట్టి, ఒకే మర్రిచెట్టుకు ఉరితీసి చంపేశారు. ఈ దారుణ మారణకాండ గురించి దేశానికి కాదు.. కనీసం ఆ జిల్లాలోనే ఇప్పటికీ చాలామందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. మరో దారుణమేమంటే.. అసలు ఎక్కడా.. ఏ చరిత్రపుటల్లో.. ఏ పుస్తకంలో.. ఏ పాఠంలో.. చెప్పని ఆ చారిత్రక ఘటన గురించి ఇటీవల నిర్వహించిన గ్రూప్–3 పరీక్షలో ఓ ప్రశ్నగా అడిగారు.తెలంగాణ చరిత్రను ఆసాంతం చదివిన వారికి ఎక్కడో ఓ చోట రాసిన విషయం గుర్తుంటే తప్ప.. సమాధానం ఇవ్వలేరు. వెయ్యిమంది వీరుల త్యాగం పాఠ్యాంశంగా అందించాలన్న డిమాండ్ ఉంది. ఏంటా ప్రశ్న... తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ ఇటీవల నిర్వహించిన గ్రూప్–3 పరీక్షలో రాంజీగోండుకు సంబంధించి అడిగారు. రెండవ పేపర్లో 18వ శతాబ్దంనాటి రాంజీగోండు తన బృందంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ ప్రాంతం నుంచి నిర్మల్ వరకు తన ప్రాబల్యాన్ని పెంచుకొని, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, చివరకు వెయ్యిమంది సైన్యంతో కలిసి ఉరికొయ్యలకు బలికావడం తదితర అంశాలపై ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు చాలామంది సరైన సమాధానాలు రాయలేకపోయామని చెప్పారు. ఇందుకు కారణం రాంజీగోండు, వెయ్యి ఉరుల మర్రి ఘటన గురించి చిన్నప్పటి నుంచి ఏ పాఠ్యపుస్తకంలో చదవకపోవడమే. ఎక్కడ ఆ ఘటన.. ఎవరా రాంజీ ! 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ సమయంలోనే వెలుగులోకి వచ్చిన ఆదివాసీ వీరుడు రాంజీగోండు. గోండురాజుల వంశానికి చెందిన రాంజీ అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్, గోండ్వానా రాజ్యంలో చెల్లాచెదురుగా ఉన్న వారందరినీ ఏకం చేశాడు. పరాయిదేశం నుంచి వచ్చి భరతమాతను బంధించిన ఆంగ్లేయులపై, స్వదేశంలో ఉంటూ వారికి తొత్తులుగా ఉన్న నిజాం రాజులపైనా పోరాడాలని పిలుపునిచ్చాడు. ఇందుకు గోదావరి తీరంలో చుట్టూ దట్టమైన అడవులు, గుట్టలతో ఉన్న నిర్మల్ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ప్రథమ సంగ్రామంలో పాల్గొన్న రొహిల్లాలు.. ఈ ఆదివాసీ వీరులకు తోడుకావడంతో నెలల తరబడి ఆంగ్లేయులను ముప్పతిప్పలు పెట్టారు. తమ వద్ద సరైన బలగాలు, మందుగుండు సామగ్రి, ఆయుధాలు లేకున్నా.. రాంజీ సారథ్యంలో గెరిల్లా తరహా పోరుసల్పారు. కొరకరాని కొయ్యగా మారిన గోండువీరులను శత్రువులు దొంగదెబ్బ తీశారు. రాంజీ సహా వెయ్యిమంది వీరులను బంధించారు. మరోసారి ఇలాంటి తిరుగుబాటు చేయడానికి కూడా ఎవరూ సాహసించొద్దని ఆ వీరులను అత్యంత దారుణంగా హింసించారు. ఒకే మర్రిచెట్టుకు.. వెయ్యిమంది 1860, ఏప్రిల్ 9న నిర్మల్ నుంచి ఎల్లపెల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న పెద్ద మర్రిచెట్టుకు ఈ వెయ్యిమంది వీరులను ఒకేసారి ఉరితీశారు. అలా వారంతా మాతృభూమి కోసం ఉరికొయ్యలను ముద్దాడారు. ఇంతటి పోరాటాన్ని సాగించిన రాంజీగోండు, వెయ్యిమంది వీరుల చరిత్ర దశాబ్దాలపాటు కనీసం బయటకు రాలేదు. ఇప్పటికీ ఈ దారుణ మారణకాండ గురించి ఎక్కడా చరిత్రలో, పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కలేదు. 2021 సెపె్టంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్మల్ వచ్చి వెయ్యిమంది అమరులకు నివాళులరి్పంచారు. అయితే ఇప్పటికీ నిర్మల్‌లో వారి స్మారకార్థం ఎలాంటి చర్యలు చేపట్టలేదు.ముందుతరాలకు తెలిసేలా.. నిర్మల్ జిల్లాకేంద్రంలో ఎప్పుడో 1857–60లోనే జరిగిన వెయ్యి ఉరులమర్రి ఘటనను ఇప్పటికీ బయటకు తీయకపోవడం దారుణం. ఇలాంటి ఘటనను ముందుతరాలకు తెలిపేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. – ధోండి శ్రీనివాస్, చరిత్రకారుడుపాఠ్యాంశంగా పెడితే... వెయ్యి ఉరుల మర్రి ఘటన గురించి పాఠ్యాంశంగా పెట్టడంతోపాటు విస్తృ తంగా ప్రచారం కల్పించాల్సిన అవసరముంది. అప్పుడే ఇలాంటి ఘటనలపై అడిగే ప్రశ్నలకు సమాధానాలివ్వగలుగుతారు. – డాక్టర్ కట్కం మురళి, అసిస్టెంట్ ప్రొఫెసర్ -
mann ki baat: ‘మేరీ మాటీ.. మేరీ దేశ్’
న్యూఢిల్లీ: మన అమర జవాన్లను, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పౌరులను గౌరవించుకోవడానికి స్వాతంత్య్ర దినోత్సవం(ఆగస్టు 15) వరకూ దేశవ్యాప్తంగా మేరీ మాటీ.. మేరీ దేశ్ (నా మట్టి.. నా దేశం) పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. వారి జ్ఞాపకార్థం ప్రతి గ్రామ పంచాయతీలో స్మారకాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆదివారం ‘మన్ కీ బాత్’లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. మేరీ మాటీ.. మేరీ దేశ్ కార్యక్రమంలో భాగంగా అమృత్ కలశ్ యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. దేశమంతటా వివిధ ప్రాంతాల నుంచి 7,500 కలశాల్లో పవిత్ర మట్టిని, దాంతోపాటు మొక్కలను దేశ రాజధాని ఢిల్లీకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఆ పవిత్ర మట్టితో ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం సమీపంలో ‘అమృత్ వాటిక’ను నిర్మించబోతున్నట్లు చెప్పారు. అక్కడే మొక్కలను నాటనున్నట్లు వివరించారు. ఈ అమృత్ వాటిక ‘ఏక్ భారత్.. శ్రేష్ట్ భారత్’కు ఒక గొప్ప చిహ్నం అవుతుందని స్పష్టం చేశారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలి ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఇప్పటికే 2 లక్షలకుపైగా కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. అమృత్ మహోత్సవ్ నినాదం అంతటా ప్రతిధ్వనిస్తోంది. గత ఏడాది ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమం కోసం దేశమంతా ఒక్కతాటిపైకి వచి్చంది. ప్రజలంతా తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలు ఎగరేశారు. ఆ సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి ప్రయత్నాలతో మన బాధ్యతలను మనం గుర్తించగలుగుతాం. దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన బలిదానాలను స్మరించుకుంటాం. స్వేచ్ఛా స్వాతంత్య్రాల విలువను గుర్తిస్తాం. అందుకే ప్రతి పౌరుడూ ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలి. ప్రజల్లో సాంస్కృతి చైతన్యం ఇనుమడిస్తోంది. పుణ్య క్షేత్రాలను సందర్శించే యాత్రికుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కాశీని ప్రతిఏటా 10 కోట్లకు పైగా యాత్రికులు సందర్శిస్తున్నారు. అయోధ్య, మథుర, ఉజ్జయిని లాంటి క్షేత్రాలను సందర్శించే భక్తుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీనివల్ల లక్షలాది మంది పేదలకు ఉపాధి లభిస్తోంది. మరో 50,000 అమృత్ సరోవరాలు ఇటీవల దేశంలో భారీ వర్షాలు కురిశాయి. వరదలు ముంచెత్తాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. జనం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుకోవడానికి వారు కలిసికట్టుగా పని చేశారు. అలాగే జల సంరక్షణ కోసం జనం కృషి చేయడం సంతోషకరం. ఉత్తరప్రదేశ్‌లో ఒక్కరోజులో 30 లక్షల మొక్కలు నాటారు. జల సంరక్షణ కోసం దేశంలో ఇప్పటికే 60,000 అమృత్ సరోవరాలు నిర్మించారు. మాదక ద్రవ్యాలకు ప్రజలు దూరంగా ఉండాలని కోరుతున్నా. భవిష్యత్తు తరాలను కాపాడుకోవాంటే డ్రగ్స్‌ను దూరం పెట్టాల్సిందే. ఇందుకోసం 2020 ఆగస్టు 15న ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ ప్రారంభించాం. 11 కోట్ల మందికిపైగా జనం ఈ అభియాన్‌తో అనుసంధానమయ్యారు. రూ.12,000 కోట్ల విలువైన 10 లక్షల కిలోల డ్రగ్స్‌ను అధికారులు ధ్వంసం చేశారు. ఇదొక విశిష్టమైన రికార్డు. మధ్యప్రదేశ్‌లోని బిచార్పూర్ అనే గిరిజన గ్రామం ఒకప్పుడు అక్రమ మద్యం, డ్రగ్స్‌కు అడ్డాగా ఉండేది. ఇప్పుడు ఆ గ్రామస్థులు వ్యసనాలు వదిలేశారు. ఫుట్‌బాల్ ఆటలో నిష్ణాతులుగా మారారు. మనసుంటే మార్గం ఉంటుంది’ అని మోదీ ఉద్ఘాటించారు. కళాఖండాలు తిరిగొచ్చాయి మన దేశానికి చెందిన వందలాది అరుదైన, ప్రాచీన కళాఖండాలు ఇటీవలే అమెరికా నుంచి తిరిగివచ్చాయి. అమెరికా వాటిని తిరిగి మనకు అప్పగించింది. దీనిపై సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. అమెరికా నుంచి వచ్చిన వాటిలో 2,500 నుంచి 250 ఏళ్ల క్రితం నాటికి కళాఖండాలు ఉన్నాయి. 2016, 2021లో అమెరికాలో పర్యటించా. మన కళాఖాండలను వెనక్కి తీసుకురావడానికి కృషి చేశా. -
మీ త్యాగం వృథాకాదు..
మహబూబ్‌నగర్ టౌన్: తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని రాష్ట్రప్రభుత్వం గుర్తించి.. వారి కుటుంబాలను ఆదుకునేందుకు సంకల్పించింది. ప్రత్యేకరాష్ట్ర సాధన కోసం జిల్లాలో ప్రాణాలర్పించిన 17మంది అమరుల కుటుంబాలకు ఒక్కోకుటుంబానికి రూ.10లక్షల చొప్పున పరిహారం మంజూరుచేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. పరిహారంతో పాటు బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు నిర్ణయించింది. వారిలో కావలి సువర్ణ (మిరాసిపల్లి, కొత్తకోట మండలం), దాసరి నరేష్ (కొత్తకోట), శంకర్(నాగపూర్, గోపాల్పేట మండలం), వీరసాగర్ (పెద్దమందడి), ఇప్పటి నాగరాజు (లంకేశ్వరం అమ్రాబాద్), బాలస్వామి (ఉప్పునుంతల మండల కేంద్రంలోని బీసీ కాలనీ), మల్లేష్ (రంగాపూర్ జడ్చర్ల), కృష్ణయ్య (విద్యానగర్‌కాలనీ కల్వకుర్తి), వెంకటేష్ (దేవునిపడాకల్), కొప్పు వాసు (ఇప్పలపల్లి), అనిల్‌కుమార్‌రెడ్డి (మహబూబ్‌నగర్, కొమ్ము యాదయ్య (బూర్గుల), కరుణాకర్ (పాపిరెడ్డిగూడం), పాపగంటి శేఖర్ (షాద్‌నగర్), ప్రేమ్‌రాజ్ (ఎక్లాస్‌ఖాన్‌పేట), వెంకటయ్యగౌడ్ (మదలాపూర్), సత్యమ్మ (ఘణపూర్)కుటుంబాలకు ఆర్థికసాయం అందనుంది. -
బంగారు తెలంగాణ సాధిస్తాం
గన్‌పార్క్‌వద్ద టీ కాంగ్రెస్ నేతల ప్రతిజ్ఞ సాక్షి, హైదరాబాద్: అమరవీరుల త్యాగాల వల్ల ఏర్పడిన రాష్ట్రాన్ని ‘బంగారు తెలంగాణ’గా మారుస్తామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రతిజ్ఞ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో పార్టీ టికెట్లు దక్కిన నేతలంతా మంగళవారం గన్‌పార్క్ వద్దకు వచ్చి అమరవీరులకు నివాళులు అర్పించారు. ‘సాధిస్తాం.. సాధిస్తాం.. పసిడి తెలంగాణ సాధిస్తాం..’ అని నినాదాలు చేశారు. అక్కడికి వచ్చిన అభ్యర్థులందరితో ఈ మేరకు పొన్నాల ప్రమాణం చేయించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టికెట్ల ఎంపికలో సామాజిక న్యాయం పాటించామని, బీసీలకు పెద్దపీట వేశామని పేర్కొన్నారు. గెలుపే ప్రధాన గీటురాయిగా అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు. వంద అసెంబ్లీ, 15 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక నేతల ఒత్తిడి వల్ల టికెట్ల ఎంపికలో జేఏసీ నాయకులకు సంపూర్ణ న్యాయం చేయలేకపోయామన్నారు. పార్టీలో వర్గపోరు ఉన్నప్పటికీ ఎన్నికల్లో సమష్టిగా పనిచేస్తే కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని స్పష్టంచేశారు. కేంద్ర మంత్రి బలరాంనాయక్, మాజీ మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి సహా పలువురు అభ్యర్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తాము కచ్చితంగా గెలుస్తామని.. తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న వినయ్‌కుమార్, భార్గవ్ దేశ్‌పాండే, ఒబేదుల్లా కొత్వాల్, సామకృష్ణారెడ్డి తదితరులు ధీమా వ్యక్తంచేశారు.