మహబూబ్‌నగర్ టౌన్: తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని రాష్ట్రప్రభుత్వం గుర్తించి.. వారి కుటుంబాలను ఆదుకునేందుకు సంకల్పించింది. ప్రత్యేకరాష్ట్ర సాధన కోసం జిల్లాలో ప్రాణాలర్పించిన 17మంది అమరుల కుటుంబాలకు ఒక్కోకుటుంబానికి రూ.10లక్షల చొప్పున పరిహారం మంజూరుచేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. పరిహారంతో పాటు బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు నిర్ణయించింది.
వారిలో కావలి సువర్ణ (మిరాసిపల్లి, కొత్తకోట మండలం), దాసరి నరేష్ (కొత్తకోట), శంకర్(నాగపూర్, గోపాల్‌పేట మండలం), వీరసాగర్ (పెద్దమందడి), ఇప్పటి నాగరాజు (లంకేశ్వరం అమ్రాబాద్), బాలస్వామి (ఉప్పునుంతల మండల కేంద్రంలోని బీసీ కాలనీ), మల్లేష్ (రంగాపూర్ జడ్చర్ల), కృష్ణయ్య (విద్యానగర్‌కాలనీ కల్వకుర్తి), వెంకటేష్ (దేవునిపడాకల్), కొప్పు వాసు (ఇప్పలపల్లి), అనిల్‌కుమార్‌రెడ్డి (మహబూబ్‌నగర్, కొమ్ము యాదయ్య (బూర్గుల), కరుణాకర్ (పాపిరెడ్డిగూడం), పాపగంటి శేఖర్ (షాద్‌నగర్), ప్రేమ్‌రాజ్ (ఎక్లాస్‌ఖాన్‌పేట), వెంకటయ్యగౌడ్ (మదలాపూర్), సత్యమ్మ (ఘణపూర్)కుటుంబాలకు ఆర్థికసాయం అందనుంది.
మీ త్యాగం వృథాకాదు..
Published Tue, Sep 30 2014 2:34 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
Advertisement