saddest polar bear
-
‘పిజ్జా’కు తాత్కాలిక విముక్తి
బీజింగ్: ధ్రువపు ఎలుగుబంటి 'పిజ్జా'కు కష్టాలు తాత్కాలికంగా తప్పాయి. బందిఖానా నుంచి స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 'ప్రపంచంలోనే దారుణ విషాదాన్ని చవిచూస్తోన్న ఎలుగుబంటి'గా ముద్రపడిన 'పిజ్జా'కు విముక్తి లభించింది. ఉత్తర చైనాలోని ఝంగ్షూ పట్టణంలో ఉన్న గ్రాండ్ వ్యూ షాపింగ్ మాల్ నుంచి దాన్ని బయటికి తరలించారు. ఆదివారం వీడ్కోలు విందు తర్వాత దాన్ని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఎక్కడికి తరలించారనేది షాపింగ్ మాల్ నిర్వాహకులు వెల్లడించలేదు. ‘ఫేర్ వేల్ పార్టీ తర్వాత బందోబస్తు నడుమ అక్వేరియం నుంచి పిజ్జాను తరలించామ’ని తెలిపారు. ‘పిజ్జా’ జన్మస్థలం టియన్ జిన్ కు దాన్ని తరలించివుంటారని చైనా మీడియా పేర్కొంది. షాపింగ్ మాల్ లోని మిగతా అరుదైన జంతువులకు విముక్తి లభించలేదు. అయితే జంతువులను ఉంచిన ఎన్ క్లోజర్లు నవీకరిస్తున్నామని, ఈ పనులు పూర్తైన తర్వాత ‘పిజ్జా’ను తిరిగి తీసుకొస్తామని షాపింగ్ మాల్ నిర్వాహకులు ప్రకటించారు. అరుదైన జంతువులను వ్యాపార ప్రయోజనాల కోసం ఇరుకైన గదుల్లో బంధించి హింసించడం పట్ల జంతు ప్రేమికులు ఆందోళన చేయడంతో షాపింగ్ మాల్ నిర్వాహకులు దిగివచ్చారు. ‘పిజ్జా’కు తాత్కాలిక ఉపశమనం కలిగించారు. చదవండి: చైనాలో మరో వ్యాపార వికృతం -
చైనాలో మరో వ్యాపార వికృతం
బీజింగ్: చైనాలో మరో వ్యాపార వికృతం వెలుగులోకి వచ్చింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు షాపింగ్ మాల్ లో జంతువులను తీవ్రంగా హింసిస్తున్నారు. చిన్నిచిన్న గదుల్లో అరుదైన జంతువులను బంధించి వాటిని చూపిస్తూ కాసులు దండుకుంటున్నారు. ఈ పోకడను గర్హిస్తూ జంతుప్రేమికులు పెద్ద ఎత్తున పోరాటానికిదిగారు. వీడియోలో కనిపిస్తోన్న ధృవపు ఎలుగుబంటి పేరు 'పిజ్జా'. 'ప్రపంచంలోనే దారుణ విషాదాన్ని చవిచూస్తోన్న ఎలుగుబంటి'గా దీనిని అబివర్ణిస్తున్నారు. ఎక్కడో ధృవప్రాంతంలో స్వేచ్ఛగా తిరగాల్సిన పిజ్జా.. ఉత్తర చైనాలోని ఝంగ్షూ పట్టణంలోని ఒక షాపింగ్ మాల్ లో బందీగా పడిఉంది. క్షణమైనా కూర్చోకుండా బయటికి పోయే దారిని వెతుక్కుంటూ పిజ్జా పడే బాధలు చూస్తే.. మనిషనేనేవాడు కరిగిపోతాడు. కానీ.. పిజ్జా సహా మరికొన్ని అరుదైన జంతువులను చెరలో బంధించిన వ్యాపారులు మాత్రం వాటిని వదిలిపెట్టే సమస్యేలేదంటున్నారు. ప్రభుత్వం అన్ని పర్మిషన్లు ఇంచ్చిందని వాదిస్తున్నారు. దీంతో కొందరు జంతు ప్రేమికులు వాటి విడుదల కోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. పిజ్జా విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా సంతకాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే చైనాలో ఉద్యమం ఊపందుకుంది. ఈ ప్రచారానికి మీరు కూడా మద్దతు పలికితే పిజ్జా చేత.. 'ఏం మనుషులురా బాబూ..' అని తిట్లు తప్పించుకున్నవాళ్లవుతారు. (తప్పక చదవండి: చైనాలో వ్యాపార వికృతం)