సఫారీలపై కివీస్ ప్రతీకార విజయం
సెంచూరియన్: ఆతిథ్య సౌతాఫ్రికా చేతిలో మొదటి టీ20లో ఓటమిచెందిన న్యూజిలాండ్ జట్టు.. రెండో టీ 20లో ప్రతీకార విజయాన్ని సాధించింది. సెంచురియన్ సూపర్ స్పోర్ట్ పార్క్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేయగా..లక్ష్యచేధనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. న్యూజిలాండ్‌లో మార్టిన్ గుప్టిల్ 60 పరుగులు చేయగా..దక్షిణాఫ్రికాలో బెహర్డీన్ 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలవడంలో సిరీస్ సమం అయింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు రెండూ మార్టిన్ గుప్టిల్ కే దక్కాయి. ఈ రెండు జట్ల మధ్య మొదటి వన్డే ఆగస్టు 19న జరుగనుంది.