breaking news
safety measure
-
భారీ వర్షాలు.. బస్ డ్రైవర్లు, కండక్టర్లకు టీఎస్ఆర్టీసీ సూచనలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా టీఎస్ఆర్టీసీ డ్రైవర్లందరూ ప్రమాదాలను నివారించాలని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. వర్షాల నేపథ్యంలో విధి నిర్వహణలో ఏమాత్రం అలసత్వం వహించవద్దని సూచించారు. రాష్ట్రంలో వారం రోజులపాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన సందర్భంగా డ్రైవర్లందరూ భద్రత సూచనలు పాటించాలని కోరారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ సంస్థ ఎంతో కాలంగా ప్రయాణికుల భద్రతకు మారుపేరుగా నిలించిందన్నారు. జాతీయ స్థాయిలో అతి తక్కువ ప్రమాద రేటులో అనేక అవార్డులు అందుకుందని గుర్తుచేశారు. ఆర్టీసీ సంస్థలో సుశిక్షుతులైన డ్రైవర్లు ఉన్నారని, అయినా వర్షాకాలంలో మరోసారి భద్రతా నియమాలను మననం చేసుకుని తూ.చ పాటిస్తూ సురక్షిత డ్రైవింగ్ చేయడం ఎంతైనా అవసరం ఉందన్నారు. జాగ్రత్త సూచనలు 1. వర్షం కురుస్తున్నప్పుడు వేగ నియంత్రణ పాటించాలి 2. మలుపుల వద్ద ఇండికేటర్‌ను ఉపయోగించాలి. 3. ముందు వెళ్ళే వాహనాలతో సురక్షిత దూరాన్ని పాటించాలి. దట్టమైన వర్షం ఉన్నచోట హారన్ ఉపయోగించాలి. 4. వర్షం కురుస్తున్నప్పుడు డ్రైవింగ్ చేయనపుడు వైపర్ వాడాలి. హెడ్‌లైన్‌ను lowbeamలోఫాగ్ lights తప్పనిసరిగా వాడాలి. వైపర్లను కండిషన్లో ఉంచుకోగలరు. బస్సు వేగాన్ని తగ్గించి నిదానంగా వెళ్లాలి. 5. చెరువులు కుంటలు నిండిన చోట నీటి ప్రవాహాన్ని పరిశీలించి జాగ్రత్తగా వాహనాన్ని నడపాలి. నదులు కల్వర్టులు ఎక్కువ నీటి ప్రవాహం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో దాటే ప్రయత్నం చేయవద్దు. 6. Windscreen గ్లాసులను వైపర్‌తో బయట వైపు శుభ్రపరచవలెను. లోపల వైపు ఏదైనా క్లాత్‌తో శుభ్రపరచాలి. 7. డ్యూటికి బయలుదేరుటకు ముందే వైపర్, హెడ్ లైట్స్ పనితీరును పరిశీలించుకొనవలెను. తెల్లవారుజామున 3-5 గంటల సమయములో సమీప బస్ స్టేషన్ నందు ఆపుకొని నీళ్ళతో ముఖంకాళ్ళు చేతులు శుభ్రపరుచుకోవాలి. 8. రోడ్డు మరమ్మత్తులో ఉన్నపుడు బస్సును నిదానంగా నడిపించాలి. డ్యూటికి వచ్చే ముందు తగిన విశ్రాంతి తీసుకోవాలి. 9. దట్టమైన వర్షం ఉన్న సమయంలో ఇతర వాహనాలను ఓవర్ టేక్ చేయరాదు. 10. అకస్మాత్తుగా సడన్ బ్రేక్ వేయకూడదు. వర్షం పడుతున్నప్పుడు తప్పకుండా లైట్లు వేసి వాహనాన్ని నియంత్రణలో నడపాలి. 11. వర్షం కురుస్తున్న సమయంలో డ్రైవింగ్ చేయునపుడు ఎదురుగా వచ్చే వాహనదారులతో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది కనుక ఎట్టి పరిస్థితులో Wrong Route లో వెళ్లరాదు. 12. సెంట్రల్ లైన్ క్రాస్ చేయరాదు. 13. అకస్మాత్తుగా బస్సు యొక్క దిశను మార్చకూడదు. 14. అతివేగంగా బస్సును నడపరాదు. 15. అకస్మాత్తుగా ఇండికేటర్ వేయడం వలన వెనుక వచ్చే వాహనాలతో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది కనుక సడన్ గా ఇండికేటర్ వేయకూడదు. 16. రోడ్డు మరమ్మత్తులో ఉన్నపుడు అతి వేగం తో డ్రైవింగ్ చేయరాదు. 17. బ్రేక్ సిస్టమ్ నుంచి ఎలాంటి ఏయిర్ లీకేజీలు ఉన్నాయో గమనించాలి. 18. ఘాట్ రోడ్డు ప్రయాణంలో ఎట్టి పరిస్థితిలోనూ బస్సును న్యూట్రల్ చేసి నడవకూడదు. 19. హైదరాబాద్ నగర శివారులో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి. నగరంలో మ్యాన్ హోల్స్ మరియు రద్దీ ప్రదేశాలలో కండక్టర్ సహాయంతో వాహనాన్ని నడపగలరు. 20. బస్సులో ఫుట్ బోర్డు ప్రయాణాన్ని నివారించాలి, ఫుట్ బోర్డు లో ఉన్న ప్రయాణికులను బస్సు లోపలికి చేర్చుకోవాలి. 21. నగరంలో అనేక మంది ప్రయాణికులు నడిచే బస్సు ఎక్కడం జరుగుతుంది. దీని ద్వారా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వారి గమ్య స్థానం లోనే కండక్టర్, డ్రైవర్ గారు ఆపగలరు, బస్సులోకి చేర్చుకోగలరు. 22. ఫోన్ మాట్లాడుతూ, ఒంటిచేత్తో డ్రైవింగ్ చేయవద్దు. 23. అతి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా తడిసిన కరెంటు స్తంభాలను ముట్టుకోరాదు. 24. తడి చేతులతో విద్యుత్ ప్రవాహం ఉన్న స్విచ్ బోర్డులను తాకరాదు. ఎంతో పేరున్న ఆర్టీసీ సంస్థ.. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా డ్రైవర్లు, కండక్టర్లు సురక్షితంగా బస్సులు నడిపి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొని సంస్థకు సహకరించాలని సంస్థ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ సూచనలు జారీ చేశారు.. -
వైరల్ వీడియో: బబుల్ బైక్
కొవిడ్ మహమ్మారి నుంచి రక్షణ కోసం క్రికెటర్లకు బయో బబుల్ నిబంధనలు అమలు చేస్తున్నాయి క్రికెట్ కంట్రోల్ బోర్డులు. అదే తరహాలో కరోనా నుంచి రక్షణ కోసం తన బైక్ చుట్టూ ఓ బబుల్ రక్షణ కవచం ఏర్పాటు చేసుకున్నాడో యువకుడు. అంతేకాదు తన బైక్ వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి తనకి తగలకుండా గ్యాప్ వచ్చేలా సీటింగ్ ఎరేంజ్మెంట్స్ కూడా చేశాడు. సెఫ్టీ కేవలం కర్రలు, ప్లాస్టిక్షీట్తో ఆ యువకుడు కరోనా షీల్డ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఎంచక్కా సిటీలో చక్కర్లు కూడా కొట్టాడు. ఇతని పద్దతి చూసి ముచ్చటపడిన కొందరు వీడియో తీసి సోష్‌ల్‌మీడియాలో షేర్ చేశారు. అక్కడా పాపులర్ అయిపోయిందీ బబుల్ బైక్. రూపిన్ శర్మ అనే ఐపీఎస్ అధికారి కొవిడ్ సేఫ్టీ మెజర్స్ అంటూ ట్విట్టర్లో షేర్ చేశారు. #Domestic #Land_Bubble Service Safety Measures फ़ॉर #Corona pic.twitter.com/Vo8qrJf55o — Rupin Sharma IPS (@rupin1992) May 25, 2021 -
‘ఉబర్’ డ్రైవర్‌కు సెల్ఫీ తప్పనిసరి
న్యూఢిల్లీ: ట్యాక్సీ సేవల సంస్థ ఉబర్ భద్రతా చర్యల్లో భాగంగా భారత్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇకపై ప్రయాణికుడిని ఎక్కించుకునే ముందు సంస్థ అధికారిక యాప్‌లో ప్రతీ ఉబర్ డ్రైవర్ తన సెల్ఫీ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ సెల్ఫీని సంస్థ తమ డేటాబేస్‌లో డ్రైవర్ వివరాలతో పోల్చిచూస్తుంది. సంస్థలో నమోదైన డ్రైవర్ కాకుండా మరొక వ్యక్తి క్యాబ్‌ను నడుపుతున్నట్లయితే ఆ క్యాబ్ ప్రొఫెల్‌ను తాత్కాలికంగా నిషేధిస్తామని సంస్థ తెలిపింది. ఈ ఫీచర్‌ను మొదటగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా క్యాబ్ సర్వీసుల్లో ప్రవేశపెట్టనుంది.