‘ఉబర్‌’ డ్రైవర్‌కు సెల్ఫీ తప్పనిసరి | Uber aims to improve safety; makes drivers take selfies for ‘Real-Time ID check’ | Sakshi
Sakshi News home page

‘ఉబర్‌’ డ్రైవర్‌కు సెల్ఫీ తప్పనిసరి

Published Wed, Mar 15 2017 8:42 AM | Last Updated on Thu, Aug 30 2018 9:05 PM

Uber aims to improve safety; makes drivers take selfies for ‘Real-Time ID check’

న్యూఢిల్లీ: ట్యాక్సీ సేవల సంస్థ ఉబర్‌ భద్రతా చర్యల్లో భాగంగా భారత్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇకపై ప్రయాణికుడిని ఎక్కించుకునే ముందు సంస్థ అధికారిక యాప్‌లో ప్రతీ ఉబర్‌ డ్రైవర్‌ తన సెల్ఫీ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ సెల్ఫీని సంస్థ తమ డేటాబేస్‌లో డ్రైవర్‌ వివరాలతో పోల్చిచూస్తుంది.

సంస్థలో నమోదైన డ్రైవర్‌ కాకుండా మరొక వ్యక్తి క్యాబ్‌ను నడుపుతున్నట్లయితే ఆ క్యాబ్‌ ప్రొఫెల్‌ను తాత్కాలికంగా నిషేధిస్తామని సంస్థ తెలిపింది. ఈ ఫీచర్‌ను మొదటగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా క్యాబ్‌ సర్వీసుల్లో ప్రవేశపెట్టనుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement