breaking news
Sahibzada Farhan
-
Asia cup 2025: పాకిస్తాన్ ఆటగాళ్ల ఓవరాక్షన్‌పై ఐసీసీ చర్యలు
ఆసియా కప్ 2025లో (Asia cup 2025) భాగంగా సెప్టెంబర్ 21న టీమిండియాతో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో (India vs Pakistan) పాకిస్తాన్ ఆటగాళ్లు హారిస్ రౌఫ్ (Haris Rauf), సాహిబ్జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) ఓవరాక్షన్ చేసిన విషయం తెలిసిందే.ఆ మ్యాచ్‌లో రౌఫ్ ఫీల్డింగ్ చేసే సమయంలో విమానం క్రాష్ అయినట్లు సంజ్ఞలు చేశాడు. అలాగే ఆరు సంఖ్యను సూచిస్తూ చేతి వేళ్లను ప్రదర్శించాడు. ఫర్హాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అనంతరం బ్యాట్‌ను గన్లా భావిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. పాక్ ఆటగాళ్లు చేసిన ఈ ఓవరాక్షన్‌పై బీసీసీఐ అభ్యంతం వ్యక్తం చేసింది. ఐసీసీకి ఫిర్యాదు చేసింది.దీనిపై రౌఫ్, ఫర్హాన్ ఇవాళ (సెప్టెంబర్ 26) విచారణ ఎదుర్కొన్నారు. మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ (Richie Richardson) ఆధ్వర్యంలో జరిగిన ఈ విచారణలో వారిద్దరూ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను (Level 1 offence) ఉల్లంఘించినట్లు నిర్ధారించారు. ఈ చర్యలు గేమ్ స్పిరిట్‌ను దెబ్బతీసేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.ఇలాంటి ప్రవర్తన మరోసారి రిపీట్ చేస్తే సహించేది లేదంటూ రౌఫ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జరిమానాగా మ్యాచ్ ఫీజ్‌లో 30 శాతం కోత విధించారు. ఫర్హాన్‌కు సైతం వార్నింగ్ ఇస్తూ.. మందలింపుతో వదిలిపెట్టారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.సూర్యకుమార్‌కు జరిమానాఇదే టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించగా.. ఆ విజయాన్ని సూర్యకుమార్ "ఆపరేషన్ సిందూర్" అనే ప్రభుత్వ చర్యను ప్రస్తావిస్తూ, భారత మిలిటరీ సర్వీసెస్‌కు అంకితం చేశాడు.ఈ వ్యాఖ్యలపై పీసీబీ అభ్యంతరం తెలుపుతూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఈ విషయమై సూర్యకుమార్‌ను సైతం విచారణ చేసి, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించింది. అలాగే మ్యాచ్ ఫీజ్‌లో 30 శాతం విధించినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో ఇదివరకే రెండు సార్లు (గ్రూప్ దశ, సూపర్-4) తలపడిన భారత్-పాకిస్తాన్.. ఆదివారం జరుగబోయే ఫైనల్లో మరోసారి తలపడనున్నాయి. పై రెండు సందర్భాల్లో భారత్ పాక్‌ను చిత్తుగా ఓడించింది. చదవండి: సెలెక్ట్ చేస్తారని అనుకున్నా.. కరుణ్ నాయర్ ఆవేదన -
గన్ సెలబ్రేషన్‌పై సిగ్గులేకుండా ఫర్హాన్ బలుపు కామెంట్స్..
-
పాక్ ఆటగాళ్ల బరితెగింపు.. షాకిచ్చిన బీసీసీఐ!.. మరోసారి పీసీబీ ఓవరాక్షన్
టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా కవ్వింపులకు పాల్పడ్డ పాకిస్తాన్ ఆటగాళ్లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) చర్యలకు ఉపక్రమించింది. భారతీయల మనోభావాలు దెబ్బతినేలా.. రెచ్చగొట్టేలా ప్రవర్తించిన సాహిబ్జాదా ఫర్హాన్, హ్యారిస్ రవూఫ్‌లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి ఫిర్యాదు చేసింది.కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆసియా టీ20 కప్-2025 వేదికగా భారత్- పాక్ (IND vs PAK)జట్లు తొలిసారి ముఖాముఖి తలపడిన విషయం తెలిసిందే. లీగ్ దశలో మ్యాచ్ సందర్భంగానే టీమిండియా తమ వైఖరిని దాయాదికి తెలియజేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో కరచాలనానికి నిరాకరించింది.రెచ్చగొట్టేలా సెలబ్రేషన్స్ఇక సూపర్-4 మ్యాచ్‌లోనూ టీమిండియా తన వైఖరిని కొనసాగించింది. అయితే, లీగ్ దశ మ్యాచ్‌లో కాస్త సైలెంట్‌గానే ఉన్నపాక్ ఆటగాళ్లు.. ఈసారి మాత్రం రెచ్చగొట్టేలా కవ్వింపులకు పాల్పడ్డారు. ఓపెనర్ ఫర్హాన్ అర్ధ శతకం పూర్తి చేసుకోగానే.. ఏకే-47 మాదిరి బ్యాట్‌ను ప్రేక్షకుల వైపు ఎక్కుపెట్టి.. కాలుస్తున్నట్లు సంబరాలు చేసుకున్నాడు.పహల్గామ్లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను కాల్చి చంపిన ఘటనను ఈ చర్య ద్వారా ఫర్హాన్ మరోసారి గుర్తుచేసినట్లయింది. అయితే, మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ కూడా.. తాను సాధారణంగా హాఫ్ సెంచరీకి సెలబ్రేట్ చేసుకోనని.. ఈసారి మాత్రం ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని అనిపించిందని మరోసారి రెచ్చగొట్టాడు.‘6-0’ సంజ్ఞతో రవూఫ్ కవ్వింపులుఅంతేకాదు.. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా తాను లెక్కచేయనంటూ ఫర్హాన్ అహంకారపూరితంగా మాట్లాడాడు. ఇక హ్యారిస్ రవూఫ్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ‘6-0’ సంజ్ఞతో టీమిండియా అభిమానుల వైపు చూస్తూ అతి చేశాడు.కాగా పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరిట భారత ఆర్మీ.. ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఇందుకు బదులుగా పాక్ సైన్యం రంగంలోకి వచ్చి ఎదురుదాడికి ప్రయత్నించగా.. భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ ఘటనలో పాక్ ఎయిర్‌బేస్‌లు కూడా ధ్వంసమైనట్లు సమాచారం.కిక్కురమనలేదుఅయితే, రవూఫ్ మాత్రం పాక్ చెప్పుకొంటున్నట్లుగా.. తాము భారత్‌కు చెందిన ఆరు యుద్ధ విమానాలు కూల్చేశామన్నట్లు ఇలా సైగ చేయడం గమనార్హం. లీగ్ దశలో షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ఆటలు, రాజకీయం వేరు అంటూ సుద్దులు చెప్పిన పాక్.. సూపర్-4 మ్యాచ్‌లో తమ ఆటగాళ్లు ఇంత యథేచ్చగా బరితెగించినా కిక్కురమనలేదు.షాకిచ్చిన బీసీసీఐఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ.. పాక్ ఆటగాళ్ల ప్రవర్తనపై ఐసీసీకి ఇ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సాహిబ్జాదా ఫర్హాన్, హ్యారిస్ రవూఫ్‌ల నుంచి ఐసీసీ లిఖిత పూర్వక వివరణ అడిగే అవకాశం ఉంది. విచారణలో భాగంగా వీరిద్దరు ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. లీగ్, సూపర్-4 దశలో పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా.. బుధవారం నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి ఆసియా కప్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది.పాక్ బోర్డు ఓవరాక్షన్బీసీసీఐ చర్యల నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు కూడా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. లీగ్ దశలో పాకిస్తాన్‌పై తమ విజయాన్ని సూర్య.. పహల్గామ్ బాధితులు, ఆపరేషన్ సిందూర్ సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత ఆర్మీకి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి పీసీబీ.. ఐసీసీని ఆశ్రయించినట్లు సమాచారం.చదవండి: అసలు అక్కడ ఏం ఉంది?: అభిషేక్ శర్మపై గావస్కర్ ‘ఫైర్’ -
‘వాళ్లు ఎలా ప్రవర్తించారో చూశాం.. మా జట్టు గర్వకారణం’
సూర్యకుమార్ సేనపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే (Ryan ten Doeschate) ప్రశంసలు కురిపించాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా తమ జట్టు సంయమనంతో వ్యవహరించిన తీరు గర్వకారణం అన్నాడు. పాక్ ఆటగాళ్ల కవ్వింపు చర్యలకు తమ ప్లేయర్లు బ్యాట్‌తో సమాధానమిచ్చిన విధానం అమోఘమని కొనియాడాడు.ఆసియా కప్ టీ20- 2025 టోర్నీలో భాగంగా భారత్- పాకిస్తాన్ (IND vs PAK) ఇప్పటికి రెండుసార్లు తలపడ్డాయి. లీగ్ దశలో పాక్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా ఆ జట్టుతో షేక్‌హ్యాండ్‌కు నిరాకరించింది.తీవ్రస్థాయిలో కవ్వింపులుఇక సూపర్-4 మ్యాచ్‌లోనూ భారత జట్టు మరోసారి పాక్‌పై పైచేయి సాధించింది. ప్రత్యర్థిని ఆరు వికెట్ల తేడాతో ఓడించి.. వరుసగా రెండో గెలుపు అందుకుంది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా పాక్ ఆటగాళ్లు తీవ్రస్థాయిలో కవ్వింపులకు పాల్పడ్డారు.ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ అర్ధ శతకం (58) పూర్తి చేసుకోగానే ఏకే-47 మాదిరి బ్యాట్ ఎక్కుపెట్టి కాల్పులు జరుపుతున్నట్లు సెలబ్రేట్ చేసుకున్నాడు. కాగా జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులపై కాల్పులు జరిపి వారి ప్రాణాలు పొట్టనబెట్టుకున్న విషయం విదితమే.బ్యాట్‌తోనే సమాధానమిచ్చారుదీంతో ఫర్హాన్ సెలబ్రేషన్స్ పాక్ బుద్ధిని చూపిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు.. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నపుడు పాక్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, హ్యారీస్ రవూఫ్ భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ- శుబ్‌మన్ గిల్ (Shubman Gill)లతో మాటల యుద్ధానికి దిగారు.అయితే, ఈ యువ ఆటగాళ్లకు పాక్ ఆటగాళ్లకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చారు. అభి- గిల్ కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి పాక్‌కు తమ స్థాయి ఏమిటో చూపించారు. ఈ పరిణామాలపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ డష్కాటే స్పందించాడు.వాళ్ల చేష్టలు పట్టించుకోము‘‘హ్యారిస్ రవూఫ్ ఏం చేశాడో నేను కూడా చూశాను. అయితే, మా వాళ్లు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఆట మీద మాత్రమే దృష్టి పెటారు. అందుకు నాకు గర్వంగా ఉంది.బ్యాట్‌తోనే క్రీడా యుద్ధంలో మా వాళ్లు గెలిచారు. ఈ టోర్నీలో మా ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. సంయమనంగా ఉంటున్నారు. మాతో మ్యాచ్‌లో పాక్ తొలుత బాగానే బ్యాటింగ్ చేసింది. అప్పుడే అతడు (ఫర్హాన్) అలా చేశాడు.అయితే, మేము తిరిగి పుంజుకున్న తీరు గొప్పగా ఉంది. 10 ఓవర్ల తర్వాత మా బౌలర్లు మ్యాచ్‌ను చేతుల్లోకి తీసుకున్నారు. కానీ పాక్ ఆటగాళ్ల ప్రవర్తన ఎలా ఉందో అందరం చూశాం.గర్వకారణంవాళ్లు ఏదో చెప్పాలని ప్రయత్నించారు. అయితే, మా వాళ్లు కేవలం ఆటకే పరిమితమై తమ పని పూర్తి చేశారు. నిజానికి ఈ మ్యాచ్‌లో మా ఆటగాళ్లపై కూడా ఒత్తిడి ఉంది. కానీ వాళ్లు ఎప్పుడూ కట్టు దాటలేదు.ఇలాంటి మ్యాచ్‌లలో నియంత్రణ కోల్పోవడం సహజం. మా వాళ్లు మాత్రం అలా చేయలేదు. వాళ్ల సెలబ్రేషన్స్, మా బ్యాటర్లతో పాక్ బౌలింగ్ విభాగం వాగ్వాదాలు దృష్టి మళ్లించేవే. అయితే, ముందుగా చెప్పినట్లు మా జట్టు వేటినీ పట్టించుకోకుండా.. అత్యుత్తమ ప్రదర్శనతో గెలిచిన తీరు మాకు ఆనందదాయకం’’ అని డష్కాటే హర్షం వ్యక్తం చేశాడు. చదవండి: బీసీసీఐకి శ్రేయస్ అయ్యర్ లేఖ!.. ఇకపై నేను... -
టీ తాగారు.. భారత్ దెబ్బకు తోకముడిచారు!.. పాక్ బుద్ధి మారదు!
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మైదానంలో పాకిస్తాన్ ఆటగాళ్ల వెకిలి చేష్టలు ఎక్కువయ్యాయి. భారత్‌పై తమదే పైచేయి అని నమ్మించే ప్రయత్నంలో బొక్కబోర్లా పడుతున్నా వారి తీరు మాత్రం మారడం లేదు. సీనియర్ క్రికెటర్లకు తామేమీ తీసిపోమన్మట్లుగా ఫుట్‌బాల్ యువ ఆటగాళ్లు కూడా ఓవరాక్షన్‌తో వివాదాలకు కారణమవుతున్నారు.కాగా జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఇందుకు భారత ఆర్మీ ఉగ్రమూకలకు గట్టి కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలను ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’తో నేలమట్టం చేసింది. అయితే, ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడి చేస్తే.. అందుకు ప్రతిగా పాక్ ఆర్మీ ముందుకు వచ్చి మరోసారి తమ బుద్ధిని చాటుకుంది. ఈ క్రమంలో పాక్‌తో అన్ని సంబంధాలు.. ముఖ్యంగా క్రీడల్లోనూ వారితో ఎలాంటి పోటీ వద్దంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే, ఆసియాకప్-2025 (Asia Cup 2025) టోర్నీలో మాత్రం టీమిండియా పాక్‌తో ఆడేందుకు భారత ప్రభుత్వం అనుమతినిచ్చింది. బహుళ దేశాలు పాల్గొంటున్న టోర్నీ కావున ఇందుకు సమ్మతించింది.పప్పులు ఉడకపోవడంతోఈ నేపథ్యంలో లీగ్ దశలో పాక్ ఆటగాళ్లతో టీమిండియా కరచాలనానికి నిరాకరించింది. దీనిని అవమానంగా భావించిన పాక్.. ఐసీసీకి ఫిర్యాదు చేసింది. తమ పప్పులు ఉడకపోవడంతో ఆదివారం నాటి సూపర్-4 మ్యాచ్‌లో ఆటగాళ్లు మైదానంలో ఆటతో కాకుండా తమ చేష్టలతో కవ్వింపులకు పాల్పడ్డారు.ఇక పాక్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ అర్ధ శతకం (58) పూర్తి చేసుకోగానే.. ఏకే-47 మాదిరి బ్యాట్ ఎక్కుపెట్టి ప్రేక్షకులను కాలుస్తున్నట్లు సంబరాలు చేసుకున్నాడు. మరోవైపు.. హ్యారిస్ రవూఫ్ (Haris Rauf).. ‘మీ యుద్ధ విమానాలను కూల్చామన్నట్లుగా’ టీమిండియా అభిమానులకు సైగ చేశాడు.టీ తాగారు.. తోక ముడిచారుతాజాగా ఫుట్‌బాల్ మ్యాచ్‌లో కూడా పాక్‌కు చెందిన ఓ ఆటగాడు ఇదే తరహాలో భారత జట్టును రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కొలంబో వేదికగా దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–17 టోర్నమెంట్లో భాగంగా సోమవారం గ్రూప్-‘బి’లోని చివరి మ్యాచ్‌లో భారత్- పాక్ తలపడ్డాయి. భారత్ తరఫున దలాల్‌మువాన్ గాంగ్టే 31వ నిమిషంలో గోల్ చేయగా.. 43వ నిమిషంలో పాక్ ప్లేయర్ మొహమ్మద్ అబ్దుల్లా ఒక గోల్ సాధించాడు. ఈ క్రమంలోనే పాక్ ఆటగాళ్లు అతి చేశారు. టీ తాగుతున్నట్లుగా అభినయిస్తూ భారత జట్టును టీజ్ చేశారు. కాగా గతంలో సర్జికల్ స్ట్రైక్స్ సందర్భంగా ఎయిర్‌ఫోర్స్ వింగ్ అభినందన్ వర్ధమాన్ అనూహ్య రీతిలో పాక్ ఆర్మీ చేతికి చిక్కగా.. ఆయన టీ తాగుతున్నట్లుగా ఉన్న ఫొటోను విడుదల చేసింది.అయితే, 2019 నాటి ఈ ఘటనలో అభినందన్ దాదాపు 60 గంటలపాటు పాక్ నిర్బంధంలో ఉండగా.. జనీవా ఒప్పందం ప్రకారం తిరిగి భారత్‌కు అప్పగించారు. ఇపుడు ఇదే విషయాన్ని గుర్తుచేస్తున్నట్లుగా పాక్ యువ ఆటగాడు వ్యవహరించడం విశేషం.భారత్ చేతిలో ఓటములేఅయితే, ఈ మ్యాచ్‌లో భారత్- పాకిస్తాన్‌ను 3-2తో ఓడించడంతో పరాజయ భారంతో దాయాది తోకముడిచింది. ఇక ఈ గెలుపుతో భారత్ గ్రూప్-బి టాపర్‌గా సెమీస్ చేరగా.. రెండో స్థానంలో పాక్ కూడా క్వాలిఫై అయింది. సెమీ ఫైనల్లో భారత్- నేపాల్‌తో, పాకిస్తాన్ బంగ్లాదేశ్‌తో తలపడతాయి. ఇదిలా ఉంటే.. ఆసియా కప్ టీ20 టోర్నీలో భారత్ లీగ్, సూపర్ దశలో పాక్‌ను చిత్తు చేసింది.చదవండి: ఎవర్నీ లెక్కచేయను.. నా తీరే అంత.. నచ్చినట్లు చేస్తా: పాక్ బ్యాటర్ ఎక్స్‌ట్రాలుSuch a disgraceful celebration by Pakistani U17 Team at SAFF, Glad we beat them 3-2 today! pic.twitter.com/kfksfrP4h3— The Khel India (@TheKhelIndia) September 22, 2025 -
నువ్వు ఏకే-47 అంటే.. వాళ్లు ఏకంగా ‘బ్రహ్మోస్’ ప్రయోగించారు: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్ (IND vs PAK) జట్టు ఆట తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా (Danish Kaneria) విమర్శలు గుప్పించాడు. ప్రత్యర్థి జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నపుడు కనీసం 200 పరుగులైనా స్కోరు చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.ఆసియా కప్-2025 టోర్నీలో తొలుత లీగ్ దశలో భారత్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైన పాక్.. తాజాగా సూపర్-4 మ్యాచ్‌లోనూ ఆరు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సల్మాన్ ఆఘా బృందం.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఫర్హాన్ ఓవరాక్షన్పాక్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (45 బంతుల్లో 58) టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే, చేసింది హాఫ్ సెంచరీయే అయినా.. ఏకే-47 మాదిరి గన్ ఎక్కుపెట్టి కాలుస్తున్నట్లు ఫర్హాన్ ఓవరాక్షన్ చేశాడు. అయితే, లక్ష్య ఛేదనలో టీమిండియా ఇందుకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చింది.ఓపెనర్లు అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74)- శుబ్‌మన్ గిల్ (28 బంతుల్లో 47) పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో తొలి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరికి తోడు తిలక్ వర్మ 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి.. పాక్‌ను మరోసారి కంగుతినిపించింది.ఈ నేపథ్యంలో టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ (Abhishek Sharma), శుబ్‌మన్ గిల్‌లపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరు ఆది నుంచే అద్భుత రీతిలో బ్యాటింగ్ చేశారని కొనియాడాడు. ఈ క్రమంలో ఫర్హాన్ సెలబ్రేషన్ చేసుకున్న తీరును కూడా కనేరియా విమర్శించాడు.నువ్వు ఏకే-47 అంటే.. వాళ్లు ఏకంగా ‘బ్రహ్మోస్’ ప్రయోగించారు‘‘సాహిబ్జాదా ఫర్హాన్ ఏకే-47 గన్ కాలుస్తున్నట్లు సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత శుబ్‌మన్ గిల్- అభిషేక్ శర్మ తమ బ్యాట్లతోనే ఏకంగా బ్రహ్మోస్ ప్రయోగించారు.ముఖ్యంగా అభిషేక్ శర్మ అయితే ముద్దులు విసురుతూనే బౌండరీల వర్షం కురిపించాడు. పాక్ బౌలింగ్‌పై వారిద్దరు విరుచుకుపడ్డారు. ఇందుకు పాక్ ఆటగాళ్ల వద్ద సమాధనమే లేకుండా పోయింది.మీరు ఉతుకుడు అని సంబరపడ్డారు. వారు ఉతికి.. ఉతికి ఆరేశారు. ప్రత్యర్థి జట్టులో అభిషేక్ శర్మ- శుబ్‌మన్ గిల్ వంటి ఓపెనర్లు ఉన్నపుడు 200 పరుగుల స్కోరు కూడా చిన్నదే అయిపోతుంది. వాళ్లిద్దరు క్లాస్ ప్లేయర్లు’’ అంటూ డానిష్ కనేరియా వార్తా సంస్థ IANSతో పేర్కొన్నాడు. -
ఎవర్నీ లెక్కచేయను.. నా తీరే అంత.. నచ్చినట్లు చేస్తా: పాక్ బ్యాటర్ ఎక్స్‌ట్రాలు
టీమిండియాతో మ్యాచ్‌లో అతి చేసిన పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (Sahibzada Farhan)పై విమర్శల వర్షం కురుస్తోంది. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత అతడు సంబరాలు చేసుకున్న తీరే ఇందుకు కారణం.ఐ డోంట్ కేర్అయితే, తానేమీ సెలబ్రేషన్స్ విషయంలో పశ్చాత్తాపపడటం లేదని.. తన తీరే అంత అని ఫర్హాన్ తన చర్యను సమర్థించుకున్నాడు. ఎవరేమనుకున్నా ‘ఐ డోంట్ కేర్’ అంటూ హెచ్చులకు పోయాడు. కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆసియా కప్-2025 వేదికగా భారత్- పాక్ తొలిసారి తలపడ్డాయి.లీగ్ దశలో పాక్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన భారత్ (IND vs PAK).. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో సూపర్-4 దశలో ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే, పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లు పాక్ జట్టుతో ఆది నుంచే కరచాలనానికి నిరాకరించారు.గన్ పేలుస్తున్నట్లుగా ఈ నేపథ్యంలో సాహిబ్జాదా ఫర్హాన్ చర్య వివాదానికి దారితీసింది. భారత్‌తో మ్యాచ్‌లో 34 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్న అతడు.. వెంటనే బ్యాట్‌ను ఏకే-47 తుపాకి మాదిరి ప్రేక్షకుల వైపు ఎక్కుపెట్టి గన్ పేలుస్తున్నట్లుగా అభినయించాడు.ఓవైపు పహల్గామ్లో అమాయక పర్యాటకులను కాల్చి చంపిన ఘాతుకానికి నిరసనగా టీమిండియా షేక్‌హ్యాండ్ No- Shakehand)కు నిరాకరిస్తుంటే.. ఫర్హాన్ ఇలా రెచ్చగొట్టేలా ప్రవర్తించడంపై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై సాహిబ్జాదా ఫర్హాన్ తాజాగా స్పందిస్తూ.. మరోసారి అతి చేశాడు. ఈసారి అలా చేయాలనిపించింది‘‘మీరు సిక్సర్ల గురించి మాట్లాడుతున్నారేమో.. భవిష్యత్తులో ఇంకా ఎక్కువే చూస్తారు. ఇక సెలబ్రేషన్ గురించి అంటారా.. ఆ సమయంలో అలా చేయాలని అనిపించిందంతే.మామూలుగా 50 కొడితే నేను సెలబ్రేట్ చేసుకోను. కానీ ఈసారి అలా చేయాలనిపించింది. దాని గురించి ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను. ఎక్కడైనా సరే దూకుడుగా ఆడటం నా లక్ష్యం. టీమిండియా అయినా.. ఏ జట్టు అయినా నా శైలి ఇలాగే దూకుడుగా ఉంటుంది’’ అని మీడియా సమావేశంలో ఫర్హాన్ పేర్కొన్నాడు.అంతొద్దుకాగా 2018లో ఆస్ట్రేలియాతో టీ20 సందర్భంగా 29 ఏళ్ల ఫర్హాన్ పాక్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 24 టీ20 మ్యాచ్‌లు ఆడి.. 510 పరుగులు చేయగలిగగాడు. ఈ నేపథ్యంలో అతడి వ్యాఖ్యలను ఉటంకిస్తూ నెటిజన్లు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. సెంచరీలు బాదిన వాళ్లు కూడా ఇలా ఓవరాక్షన్ చేయరంటూ చురకలు అంటిస్తున్నారు.ఇక టీమిండియాతో మ్యాచ్‌లో ఫర్హాన్ 45 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేశాడు. శివం దూబే బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.చదవండి: ఇంకోసారి అలా అనకండి: పాక్ జట్టు పరువు తీసిన సూర్యసెకండ్ వికెట్ పడగొట్టిన Shivam Dube 💥 చూడండి #INDvPAK లైవ్Sony Sports Network TV Channels & Sony LIV లో#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/EZGkRemo4D— Sony Sports Network (@SonySportsNetwk) September 21, 2025इनको कौन समझाये ये बैट है AK47 नहीं 😡😡#INDvPAK pic.twitter.com/oV456mlCXq— Shivani (@shivani_di) September 21, 2025 -
పవర్ ప్లేలో వాళ్లు అద్భుతం.. మేమింకా స్థాయికి తగ్గట్లు ఆడలేదు: పాక్ కెప్టెన్
టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మరోసారి పరాభవమే ఎదురైంది. ఆసియా కప్-2025 టోర్నీమెంట్లో లీగ్ దశలో భారత్ చేతిలో పరాజయం పాలైన పాక్.. తాజాగా సూపర్-4 దశలోనూ అదే ఫలితాన్ని చవిచూసింది. అయితే, గత మ్యాచ్ కంటే ఈసారి కాస్త మెరుగైన ప్రదర్శన చేయగలిగింది.ఈ నేపథ్యంలో టీమిండియా చేతిలో ఓటమిపై పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) స్పందించాడు. తాము ఇంతవరకు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదని.. అయితే, మెరుగ్గా ఆడామని పేర్కొన్నాడు. పవర్ ప్లేలో టీమిండియా మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకుందని .. తాము ఇంకో 10- 15 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని వ్యాఖ్యానించాడు.171 పరుగులుదుబాయ్ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన పాక్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో సాహిబ్జాదా ఫర్హాన్ (45 బంతుల్లో 58) రాణించగా.. ఫఖర్ జమాన్ (9 బంతుల్లో 15) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. హ్యాట్రిక్ డకౌట్ల ‘స్టార్’ సయీబ్ ఆయుబ్ (17 బంతుల్లో 21) ఈసారి ఫర్వాలేదనిపించగా.. హుసేన్ తలట్ (10), మొహమ్మద్ నవాజ్ (21) తేలిపోయారు.అభి- గిల్ రఫ్పాడించారుకెప్టెన్ సల్మాన్ ఆఘా 17, ఫాహిమ్ ఆష్రఫ్ 20 బంతులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి పాక్ 171 పరుగులు చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74), శుబ్‌మన్ గిల్ (28 బంతుల్లో 47) ఆకాశమే హద్దుగా చెలరేగారు.పవర్ ప్లేలో విజృంభణతో తొలి వికెట్‌కు వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అభి (Abhishek Sharma)- గిల్ (Shubman Gill) మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పేశారు. తిలక్ వర్మ (19 బంతుల్లో 30 నాటౌట్) కూడా వేగంగా ఆడగా.. 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా పని పూర్తి చేసింది.మా స్థాయికి తగ్గట్లుగా ఆడనేలేదుఈ నేపథ్యంలో సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. ‘‘ఇంత వరకు మేము మా స్థాయికి తగ్గట్లుగా ఆడనేలేదు. అయితే, మెరుగ్గా ఆడామని చెప్పగలను. కానీ పవర్ ప్లేలోనే వారు మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నారు. ఇంకో 10- 15 పరుగులు చేసి.. 180 వరకు స్కోరు బోర్డు మీద పెట్టి ఉంటే బాగుండేది.పవర్ ప్లేలో వాళ్లు అద్భుతంఏదేమైనా పవర్ ప్లేలో వాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అదే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. మా జట్టులోనూ ఫఖర్, ఫర్హాన్ బాగా బ్యాటింగ్ చేశారు. హ్యారీ కూడా మెరుగ్గా ఆడాడు. తదుపరి శ్రీలంకతో మ్యాచ్‌లో సత్తా చాటుతాం’’ అని పేర్కొన్నాడు.కాగా గతంలో సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లలో సల్మాన్ బృందం మూడు మ్యాచ్‌లలోనూ 200కు పైగా స్కోరు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని విలేకరులు సల్మాన్ ఆఘా దగ్గర తాజాగా ప్రస్తావించారు.ఇందుకు బదులిస్తూ.. ‘‘అక్కడికి .. ఇక్కడికి పరిస్థితులు వేరు. మాకు మంచి పిచ్ దొరికితే కచ్చితంగా 200కు పైగా స్కోరు చేస్తాము. కానీ ఈ పిచ్‌లు మాకు అంతగా సహకరించడం లేదు’’ అని సల్మాన్ ఆఘా చెప్పుకొచ్చాడు. చదవండి: ఇంకోసారి అలా అనకండి: పాక్ జట్టు పరువు తీసిన సూర్యStarting your Monday with the Blue Storm that lit up Dubai last night 🌪️ 💙 Watch the #DPWorldAsiaCup2025, Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/DNKy14ylYn— Sony Sports Network (@SonySportsNetwk) September 22, 2025 -
ఛీ.. మీ బుద్ధిమారదా?.. బరితెగించిన పాక్ ఆటగాళ్లు!
టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు బరితెగించారు. ఓ బ్యాటర్ ఏకే-47 మాదిరి బ్యాట్‌తో సంబరాలు చేసుకుంటే.. ఇంకో ఆటగాడు ఇంకాస్త దిగజారి వ్యవహరించాడు. ప్రేక్షకులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు. దీంతో భారత నెటిజన్లు పాక్ ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఛీ.. మీ బుద్ధి మారదా?‘‘ఛీ.. మీ బుద్ధి మారదా? ఇంతకంటే ఇంకెంతకు దిగజారుతారు?’’ అంటూ చివాట్లు పెడుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఆసియా కప్-2025 టోర్నీ సూపర్-4లో భాగంగా భారత్- పాకిస్తాన్ (IND vs PAK) ఆదివారం తలపడ్డాయి.దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసి.. పాక్‌ను 171 పరుగులకు కట్టడిచేసింది. ఆపై 18.5 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇదిలా ఉంటే.. పాక్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.ఏకే-47 గన్ ఎక్కుపెట్టినట్లుగాఫర్హాన్ నలభై ఐదు బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 58 పరుగులు సాధించాడు. అయితే, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగానే ఏకే-47 గన్ ఎక్కుపెట్టినట్లుగా అభినయిస్తూ బ్యాట్‌ను చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు.విరాట్ కోహ్లి నామస్మరణయువ ఆటగాడు ఫర్హాన్ సంగతి ఇలా ఉంటే.. సీనియర్ ప్లేయర్ హ్యారిస్ రవూఫ్ మరో అడుగు ముందుకు వేశాడు. బౌండరీ రోప్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో భారత దిగ్గజం విరాట్ కోహ్లి నామస్మరణ చేస్తూ ప్రేక్షకులు టీమిండియాను ఉత్సాహపరిచారు. దీంతో టీ20 ప్రపంచకప్-2022లో కోహ్లి తన బౌలింగ్‌లో రెండు వరుస సిక్స్‌లు బాది.. మ్యాచ్‌ను లాగేసుకున్న విషయం అతడికి గుర్తుకు వచ్చినట్లు ఉంది.ఇదొక దిగజారుడు చర్యఅయితే, ఇందుకు తాజా మ్యాచ్‌లో తన బౌలింగ్‌తో సమాధానం ఇవ్వాల్సింది పోయి.. రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్.. భారత్‌కు చెందిన ఆరు ఫైటర్ జైట్లను కూల్చామని ప్రగల్బాలు పలికిన విషయం తెలిసిందే. మరోసారి ఈ విషయాన్ని గుర్తుచేస్తూ.. హ్యారిస్ రవూఫ్ సైగలు చేశాడు.అంతకు ముందు ప్రాక్టీస్ సమయంలో ఫుట్‌బాల్ ఆడుతూ.. 6-0sతో లీడ్‌లో ఉన్నామంటూ భారత జర్నలిస్టుల ముందు పాక్ ఆటగాళ్లు అతి చేశారు. ఈ నేపథ్యంలో ఇదొక దిగజారుడు చర్య అంటూ క్రికెట్ ప్రేమికులు పాక్ ఆటగాళ్ల తీరును విమర్శిస్తున్నారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు భారత ఆటగాళ్లు నిరాకరిస్తున్న విషయం తెలిసిందే.ఆసియా కప్ -2025 సూపర్ 4: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్👉పాకిస్తాన్ స్కోరు: 171/5 (20)👉టీమిండియా స్కోరు: 174/4 (18.5)👉ఫలితం: ఆరు వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా.చదవండి: ఇంకోసారి అలా అనకండి: పాక్ జట్టు పరువు తీసిన సూర్య Haris Rauf never disappoints, specially with 6-0. pic.twitter.com/vsfKKt1SPZ— Ihtisham Ul Haq (@iihtishamm) September 21, 2025సెకండ్ వికెట్ పడగొట్టిన Shivam Dube 💥 చూడండి #INDvPAK లైవ్Sony Sports Network TV Channels & Sony LIV లో#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/EZGkRemo4D— Sony Sports Network (@SonySportsNetwk) September 21, 2025