sai prakash raju
-
వివాహేతర సంబంధం: భార్యను పోలీసులకు అప్పగించిన భర్త
వరంగల్ క్రైం : తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతోపాటు తనను గతంలో సస్పెండ్ చేయించాడనే కోపంతో సామాజిక కార్యకర్త ఛిడం సాయి ప్రకాశ్‌ను హత్య చేసిన కేసులో ఓ కానిస్టేబుల్‌తో సహా ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లా వెంకటాçపురం(ఎం) పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న బాషబోయిన శ్రీనివాస్ గతంలో వెంకటాçపురం(కె) పోలీస్ స్టేషన్లో విధులు నిర్వరిస్తున్న క్రమంలో ఓ భూమి విషయంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన చింతం నిర్మలతో పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆ విషయంపై నిర్మల భర్తతో కలిసి మృతుడు సాయి ప్రకాశ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్‌ను సస్పెన్షన్ చేశారు. ఫోన్ సమాచారంతో కిడ్నాప్.. హత్యఈనెల 15వ తేదీన నిందితురాలు నిర్మల, ఆమె భర్తతో కలిసి మృతుడు సాయిప్రకాశ్ తన కారులో ఆస్పత్రికి వచ్చారు. ఈ విషయన్ని నిర్మల.. నిందితుడు శ్రీనివాస్‌కు ఫోన్లో తెలియజేయడంతో ప్రణాళిక ప్రకారం కారును వెంబడించి రాత్రి 11.30 గంటల సమయంలో గోపాల్‌పూర్‌లోని బేబిసైనిక్ స్కూల్ వద్ద కారును ఆటోతో ఢీకొట్టించాడు. అనంతరం సాయి ప్రకాశ్‌ను కారులోనే కిడ్నాప్ చేసి హసన్‌పర్తి పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి శాలువతో గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని హుస్నాబాద్ పీఎస్ పరిదిలోని జిల్లేడగడ్డ తండా గ్రామ శివారులోని ఓ బావి లో పడేశారు. అనంతరం వేలేరు మండలం మీదుగా హనుమకొండ ఏషియాన్ మాల్ దగ్గర కారు నిలిపి వేసి వెళ్లారు. నిందితుల అరెస్ట్..ప్రధాన నిందితుడు కానిస్టేబుల్ బాషబోయిన శ్రీనివాస్‌తో పాటు ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన డేవిలిసాయి, హనుమకొండకు చెందిన అలోతు అరుణ్‌కుమార్ అలియాస్ పండు, బాదావత్ అఖిల్ నాయక్, బాదావత్ రాజు, వాజేడు వెంకటాపూర్‌కు చెందిన చింతం నిర్మలను అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. నిందితుల నుంచి హత్యకు వినియోగించిన ఓ కారు, రెండు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ఫోన్లు, పిస్టోల్‌ను స్వా«ధీనం చేసుకున్నట్లు సీపీ పేర్కొన్నారు. అధికారులకు అభినందనలు..సామాజిక కార్యకర్త సాయి ప్రకాశ్ హత్య కేసును వేగంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్, హనుమకొండ ఏసీపీ కొత్త దేవేందర్‌రెడ్డి, హనుమకొండ ఇన్స్పెక్టర్ సతీశ్, సిబ్బందిని సీపీ సన్‌ప్రీత్‌సింగ్ అభినందించారు. -
సినిమాల్లో అవకాశాలు రాలేదని..
సాక్షి, వరంగల్: సినిమాల్లో సరైన పాత్రలు లభించడం లేదనే కారణంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు.. వడ్డేపల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. కాజీపేట సీఐ సార్ల రాజు కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా మార్తాండ నగర్ గ్రామానికి చెందిన పిల్లి సాయి ప్రకాశ్(26) పలు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించాడు. అయితే ఇప్పటి వరకూ సరైన అవకాశాలు దక్కలేదు. ఈ క్రమంలో 20 రోజుల క్రితం భద్రాచలం వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే భద్రాచలం వెళ్లకుండా హనుమకొండ జిల్లా కేంద్రానికి చేరుకుని హాస్టల్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో జీవితంలో స్థిరపడే అవకాశం రాలేదనే మనస్తపంతో ఈ నెల 28న వడ్డేపల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు సీఐ రాజు వివరించారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: కలెక్టరేట్ ఉద్యోగి.. అలా అవ్వడానికి అసలు కారణాలేంటి? -
అదృశ్యానికి అక్రమ సంబంధమే కారణమా !!
► మిస్టరీగా యువకుడి అదృశ్యం కేసు ► వారం రోజులుగా కనిపించిన పరిస్థితి ► వివాహేతర సంబంధంపై అనుమానాలు ► అర్బన్ పీసీలో మిస్సింగ్ కేసు నమోదు రాజంపేట: రాజంపేట పట్టణంలో గాదెరాజు సాయిప్రకాశ్‌రాజు(19) అదృశ్యం మిస్టరీగా మారింది. వారంరోజులుగా కనిపించని పరిస్థితి నేపథ్యంలో రాజంపేట అర్బన్ పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. మండలంలోని పాపరాచపల్లెకు చెందిన సాయిప్రకాశ్‌రాజు తన తల్లితండ్రులతో కలిసి పట్టణంలోని విద్యుతనగర్లో ఉంటున్నారు. ఇతని అదృశ్యం వెనుక వివాహేతర సంబంధంపై అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. సాయి స్నేహితులను కూడా పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. గత శనివారం ఇంటి నుంచి వెళ్లిపోయిన సాయి వారంరోజులుగా రాకపోవడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. వెంటనే తన బిడ్డ అదృశ్యమైయ్యాడని తండ్రి చంద్రరాజు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీశారు. ఆ యువకుడు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు సమాచారం రావడంతో పట్టణంలో సాయినగర్‌లో నివాసం ఉంటున్న ఓ వివాహితను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అప్పుడప్పుడు ఆమెతో గొడవపడి కొట్టేవాడ నే వాదనలు వెలుగులోకి వచ్చాయి. కాగా ఈమె భర్త జీవోనపాధికై గల్ఫ్‌దేశానికి వెళ్లాడని సమాచారం. మరొకరితో వివాహేతర సంబంధం కారణమనే... సాయిప్రకాశ్‌రాజు సంబంధం పెట్టుకున్న మహిళ కడపకు చెందిన మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణమే వీరిద్దరికి మధ్య గొడవలు మొదలైనట్లు పలువురు చెప్పుకుంటున్నారు. ఈ యువకుడు ఆమె ఇంటిలోకి వెళ్లగానే అక్కడ కడపకు చెందిన ఓ యువకుడు ఉన్నట్లు, తర్వాత వారి మధ్య ఘర్షణ వాతవరణం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో సాయిపై దాడి చేయగా మృతి చెందినట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. పోలీసు విచారణలో ఉన్న వివాహిత కూడా ఇదే విధంగా వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. అసలు సాయి ఉన్నడా? లేక హత్య చేసిన శవాన్ని మాయం చేశారా? ఎక్కడ బూడ్చారా అన్న అంశాలు పోలీసులకు సవాల్‌గా మారాయి.