టికెట్ రాలేదని తిండిమాని ఆస్పత్రిపాలు
జీడిమెట్ల: గ్రేటర్ ఎలక్షన్లలో టీడీపీ టిక్కెట్ అశించి భంగపడిన రంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆరోగ్యం క్షిణించి అస్పత్రి పాలైంది. వివరాల్లోకి వెళితే జీడిమెట్ల జనప్రియ అపార్ట్మెంట్లో ఉండే సాయి తులసి గత 3 సంవత్సరాలుగా రంగారెడ్డి జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. 2016 గ్రేటర్ ఏన్నికల్లో సుభాష్‌నగర్ డివిజన్ మహిళా రిజర్వేష్‌న్ కాగా ఈ స్థానం నుండి ఆమె పార్టీ టికెట్ అశించారు. గత మూడు సంవత్సరాలుగా ఆమె డివిజన్లో పార్టీ తరపున ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఈ దఫా టికెట్ ఖచ్చితంగా తనకే వస్తుందని ఆశించగా పొత్తులో భాగంగా బీజేపీకి టికెట్ కేటాయించారు.
అయినప్పటికి పట్టు వదలకుండా పార్టీ ఆఫీస్ వద్ద ఆమె ధర్నా చేసి పోరాడారు. చిట్టచివరకు పొత్తు వికటించగా తనకే బీఫామ్ ఇస్తారని ఆశించగా అనూహ్యంగా టీడీపీ హైకమాండ్ టీడీపీ నేత రంగారావు సతీమణి సుజాతకు బీఫామ్ ఇవ్వడంతో మానసికంగా కృంగి పోయింది. అప్పటి నుంచి తిండితప్పలు లేకుండా మదన పడుతూ వస్తోంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు సాయితులసి కుప్పకూలి కింద పడిపోయింది. దీంతో కుమారుడు దీపక్, భర్త శ్రీనివాస్ లు వెంటనే సాయి తులసి ని ఐడీపీఎల్ లోని సౌజన్య ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.