దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
నాచారంలోని శ్రీసాయి వైన్స్ వద్ద జరిగిన దాడిలో గాయపడి చికి త్స పొందుతున్న యాదగిరి(50) బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. మంగళవారం యాదగిరి మద్యం కోసం వైన్స్‌కు వెళ్ళాడు. అప్పుడే వైన్స్‌కి స్టాక్ రావడంతో వైన్స్‌లో పనిచేస్తున్న శ్యామ్ అనే వ్యక్తి యాదగిరిని కాసేపు ఆగాలని కోరాడు. దానికి నిరాకరించిన యాదగిరి శ్యామ్‌ను దూషించాడు. ఆగ్రహానికి గురైన శ్యామ్ యాదగిరి పై దాడి చే శాడు. తలకు తీవ్రగాయం కావడంతో యాదగిరి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.