గోబెల్స్ బాబు.. సైబర్ డాబు
ఐటీ అనగానే హైదరాబాద్‌లోసైబర్‌టవర్స్‌ను చూపి గొప్పలు చెప్పుకునే చంద్రబాబు జమానాలో ఐటీ అభివృద్ధి గోరంతే.1999లో ప్రారంభమైన సైబర్ టవర్స్‌లో ఐటీ అభివృద్ధి టవర్స్ గడప కూడా దాటలేదు. అప్పట్లో ఆరు కంపెనీలు మాత్రమే ఇందులో తాత్కాలికంగా కార్యాలయాలు ఏర్పాటు చేశాయి. సరిపడా మౌలిక వసతులు లేకపోవడంతో సొంత భవనాలు ఏర్పాటు చేసుకున్నాక అవి సైబర్ టవర్స్‌కు గుడ్‌బై చెప్పేశాయి. ఈ టవర్స్‌లో మరో 28 సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటు చేసుకునే స్థలం ఉన్నా బాబు సర్కారు నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు అందకపోవడంతో అవి ముందుకురాలేదు.
దీంతో సైబర్టవర్స్ నాలుగేళ్ల పాటు బోసిపోయింది. పరువుపోతుందన్న ఆందోళనతో ప్రభుత్వం విధాన నిర్ణయాలు మార్చుకోవడంతో 2003 చివరి నాటికి మరో 28 కంపెనీలు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో అప్పటి వరకు ఉపాధి పొందుతున్న ఐదువేల మందితోపాటు మరో మూడువేల మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. రూ.120 కోట్ల విలువైన సైబర్టవర్స్ నిర్మాణ కాంట్రాక్టు దక్కించుకున్న ఎల్అండ్టీ సంస్థతో బాబు చీకటి ఒప్పందం కుదుర్చుకుని ప్రతిగా ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌ను కొట్టేశారు.