sailing week
-
హుస్సేన్ సాగర్ తీరాన సెయిలింగ్ వీక్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని హుస్సేన్ సాగర్ వేదికగా ఈఎమ్ఈ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, లేసర్ క్లాస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో 37వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం ఎంసీఈఎంఈ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ జే ఎస్ సిధాన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభకనబరచిన సెయిలర్స్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిథ్యం వహిస్తారని తెలిపారు. ఈ పోటీలను ఏషియన్ గేమ్స్ ట్రయల్స్‌గా ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సెయిలింగ్ వీక్‌ను నిర్వహిస్తున్న సికింద్రాబాద్ ఈఎమ్ఈ సెయిలింగ్ అసోసియేషన్‌ను అభినందించారు. అంతే కాకుండా క్రీడా రంగంలో యువతను విశేషంగా ప్రోత్సహిస్తున్న తెలంగాణ స్పోర్ట్స్ అసోసియేషన్ అభినందించారు. లేజర్ స్టాండర్డ్, లేజర్ 4.7 తదితర విభాగాల్లో జరుగుతున్న ఈ పోటీల్లో మంగళవారం వరకు 11 క్లబ్స్ నుంచి 89 మంది సెయిలర్స్ రిజిష్టర్ చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఇందులో దేశ వ్యాప్తంగా 11 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సెయిలింగ్ వీక్ లో రాష్ట్రం నుంచి 17 మంది పాల్గొంటున్నారు. ఈ ఏడాది పోటీల్లో తన ప్రతిభను కనబరుస్తున్న 72 ఏళ్ల మురళి కానూరి అతి పెద్ద వయసు్కడిగా అందరినీ ఆకర్షిస్తున్నాడు. ఈ పోటీలు 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రారంభ కార్యక్రమానికి సికింద్రాబాద్ క్లబ్ ప్రెసిడెంట్ రఘురామ్ రెడ్డి, తదితర ఆర్మీ అధికారులు హాజరయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హుస్సేన్ సాగర్ లో సెయిలింగ్ వీక్ పోటీలు ప్రారంభం (ఫొటోలు)
-
హుస్సేన్ సాగర్‌లో హైదరాబాద్ సెయిలింగ్ వీక్ సందడి
-
జూలై 3 నుంచి సెయిలింగ్ వీక్
సాక్షి, హైదరాబాద్: చరిత్రాత్మక హుస్సేన్‌సాగర్ జలాల్లో సెయిలింగ్ చాంపియన్‌షిప్ క్రీడా ప్రియులను అలరించనుంది. దేశంలోనే అతిపెద్ద సెయిలింగ్ చాంపియన్‌షిప్‌కు హుస్సేన్ సాగర్ వేదిక కాబోతోంది. జూలై 3 నుంచి 8 వరకు హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పేరుతో సీనియర్ మల్టీక్లాస్ సెయిలింగ్ చాంపియన్‌షిప్ జరగనుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సహకారంతో నిర్వహిస్తోన్న ఈ పోటీలను రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సోమవారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు టోర్నమెంట్ వివరాలను ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, మేజర్ జనరల్ పరమ్‌జీత్ సింగ్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గతేడాది జూలైలో జరిగిన సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో 175 ఎంట్రీలు నమోదవగా... ఈసారి 195 ఎంట్రీలు వచ్చాయని చెప్పా రు. ఎంట్రీలకు గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరింత మంది టోర్నీలో పాల్గొనే అవకాశముందని ఆయన అన్నారు. టోర్నీ కోసం 195 బోట్లు అందుబాటులో ఉన్నాయన్న ఆయన 95 రేసులను నిర్వహిస్తామని చెప్పారు. ఒలిం పిక్స్, ఆసియా గేమ్స్‌లో పాల్గొన్న ప్రముఖ సెయిలర్లు ఈ పోటీల్లో పాల్గొనేందుకు తరలి వస్తున్నారన్నారు. ఒలింపిక్స్ క్రీడల్లో ఏడు రకాల సెయిలింగ్ పోటీలు జరుగుతుండగా, హైదరాబాద్ సెయిలింగ్ వీక్‌లో 5 రకాల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ‘హెవీ వెయిట్ సింగిల్ హాండ్లర్’ క్లాస్ పోటీలను తొలిసారిగా ఇక్కడ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెయిలింగ్ పోటీలతో సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్‌కు 25 ఏళ్ల అనుబంధముందని క్లబ్ ప్రతినిధి ప్రద్యుమ్న గుర్తు చేశారు. ఈసారి పోటీల్లో 22 మంది మహిళా సెయిలర్లు పాల్గొంటున్నారు. రెగెట్టా (సిరీస్ ఆఫ్ బోట్ రేస్ ఈవెంట్) విభాగంలో అత్యధికంగా 75 ఎంట్రీలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.