saint francis college
-
ఎక్సలెంట్ సెయింట్ ఫ్రాన్సిస్
జూబ్లీహిల్స్: గతేడాది 50వ వసంతం పూర్తిచేసుకొని గోల్డెన్ జూబ్లీ జరుపుకున్న సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల తాజాగామరో అరుదైన ఘనత సాధించింది. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ర్యాంకింగ్ఫ్రేమ్వర్క్’ పేరుతో ఆ శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్గురువారం నివేదిక విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంనుంచి ఏకైక కాలేజీగా, దేశవ్యాప్తంగా టాప్ 100లో73వ స్థానంలో నిలిచి అరుదైన ఘనత సాధించినట్లుకాలేజీ యాజమాన్యం వివరించింది. నేపథ్యం.. ♦ సిస్టర్స్ ఆఫ్ చారిటీ.. ఇటలీలో 1832లో ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా సామాజిక, విద్యారంగంలో సేవలు అందిస్తున్న ప్రఖ్యాత సేవాసంస్థ. 1860 ప్రారంభంలో మనదేశంలో ప్రవేశించిన సంస్థ క్రమంగా తన సేవలను విస్తరించుకుంటూ వచ్చింది. 1959లో 15మంది విద్యార్థినులతో సికింద్రాబాద్‌లో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ పేరుతో మహిళా కళాశాల ప్రారంభించింది. ముందుగా బీఏకోర్స్ తర్వాత బీకామ్, బీఎస్సీ కోర్స్‌లు ప్రారంభించింది. 1977 ప్రాంతంలో బేగంపేటలోని కుందన్‌బాగ్‌లో 8ఎకరాల సువిశాల ప్రాంగణంలోకికళాశాలను మార్చారు. ♦ 1999లో నాక్ 5 స్టార్ గుర్తింపు లభించింది. ఆ తర్వాత క్రమంగా 2006, 2012లో ఏ గ్రేడ్‌తో గుర్తింపు కొనసాగింది. 2014లో ప్రతిష్టాత్మకమైన‘కాలేజ్ విత్ పొటెన్షియల్ ఎక్స్‌లెన్స్’ (సీపీఈ)గా నాక్ ప్రకటించింది. 2018లో గోల్డెన్ జూబ్లీ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. క్రమంగాకొత్త కోర్సులు ప్రారంభిస్తూ వచ్చారు. ప్రస్తుతం 172మందిఅధ్యాపకులు, 110మంది నాన్‌టీచింగ్ స్టాఫ్,4వేలకు పైగా విద్యార్థినులతో కార్యకాలపాలు నిర్వహిస్తోంది. అటానమస్.. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కొనసాగుతున్న కళాశాలకు నగరంలో మొదటిసారిగా 1988లో యూజీసీ అటానమి హోదా లభించింది. 2015 నుంచి కాలేజీలో ‘ఛాయిస్ అండ్ క్రెడిట్ బేస్డ్ సెమిస్టర్ సిస్టమ్’(సీసీబీఎస్‌ఎస్) పద్ధతి అమలు చేస్తున్నారు. దీనిద్వారా కరిక్యులమ్, ప్రాజెక్ట్స్ డిజైన్, ప్రెజెంటేషన్, స్లిప్‌టెస్ట్, క్విజ్పద్ధతిలో పరీక్షల నిర్వహణ చేస్తున్నారు. కోర్స్‌లను స్వతంత్రంగా డిజైన్ చేసుకునే అవకాశం లభించింది. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సదుపాయాలు.. 83వేలకు పైగా పుస్తకాలు, ‘స్లిమ్ 21’ పేరుతో కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ జర్నల్స్, ఇంటర్నెట్ రిసోర్స్ సెంటర్, భారీ సైన్స్ ల్యాబ్, ఇంగ్లిష్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, యూజీ, పీజీ సైకాలజీ ల్యాబ్, మాస్‌కమ్యునికేషన్ ల్యాబ్, ఇండోర్ స్టేడియం, స్టూడెంట్ కార్నర్, మైక్రోబయాలజికి ప్రత్యేకించిన లూయిస్‌పాశ్చర్ రీసెర్చ్ ల్యాబ్, ఫిటనెస్ సెంటర్, హెల్త్‌సెంటర్, అమెరికన్ కార్నర్ తదితర సదుపాయాలు ఏర్పాటు చేశారు. విలువలతో కూడిన విద్యాబోధన 1959లో కేవలం 15మంది విద్యార్థినులతో ప్రారంభమైన మా ప్రయాణం ఐదు దశాబ్ధాల కాలంలో 4వేలకు పైగా విద్యార్థినులు,28 విభాగాలు, 300కు పైగా టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌తో సాగుతూఎంతో ఉత్తేజం ఇస్తోంది. ఆడపిల్లలకు నాణ్యమైన విద్య, క్రీడాంశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందించేందుకు కట్టుబడి ఉన్నాం. సంప్రదాయ విలువలకు, ఆధునిక విద్యను జోడిస్తూ ముందుకుసాగుతున్నాం. విలువలతో కూడిన విద్యా బోధన ఇక ముందుకూడా కొనసాగుతుంది.– సాండ్రాహోర్తా, ప్రిన్సిపల్, సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల. కోర్సులు.. 26 వివిధ డిపార్ట్‌మెంట్స్‌తో పలు పీజీ,యూజీ కోర్సులు, సర్టిఫికెట్ కోర్సులు, ఫారిన్ కోలాబరేషన్తో కొన్ని కోర్సులు నిర్వహిస్తున్నారు. -
మోకాళ్ల కిందివరకు కుర్తీ ఉంటేనే కాలేజ్‌కి రండి
-
విద్యార్థినిలకు డ్రెస్ కోడ్.. కాలేజీ తీరుపై ఆందోళన
సాక్షి, హైదరాబాద్ : బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ వుమెన్స్ కాలేజీ విద్యార్థినుల వస్త్రాధారణపై నిబంధన విధించడంతో వివాదం మొదలైంది. మోకాళ్ల కింది వరకు ఉన్న కుర్తీ ధరించి వస్తేనే కాలేజీలోకి అనుమతిస్తామని కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసింది. నిబంధన పాటించని విద్యార్థినులను ప్రిన్సిపల్ వెనక్కి పంపిస్తున్నారు. ఆగస్టు 1 నుంచి ఈ వివాదం కొనసాగుతోంది. అయితే, ఈ నిర్ణయంపై విద్యార్థినులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సాధికారత కోసం పాటుపడుతామని గొప్పలు చెప్పుకునే ఇదే కాలేజీలో ఇలాంటి నియమాలు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రిన్సిపల్‌కు వ్యతిరేకంగా శనివారం ఆందోళన చేపట్టారు. సోమవారం కూడా ఆందోళన తీవ్రతరం చేస్తామని వెల్లడించారు. ఇక సెయింట్ ఫ్రాన్సిస్ పూర్వ విద్యార్థి ఒకరు కాలేజీ యాజమాన్యం తీరుపై ఫేస్బుక్ పోస్టులో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాసంవత్సరం మధ్యలో అనవసర నిబంధనలు పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. పొడవాటి కుర్తీ వేసుకుని కాలేజ్‌కి వస్తేనే మంచి పెళ్లి సంబంధాలు వస్తాయని గతంలో యాజమాన్యం చెప్పిందని ఆరోపించారు. మహిళా సెక్యురిటీ సిబ్బందిని నియమించుకుని మరీ.. కుర్తీలు మోకాళ్ల కింది వరకు ఉన్నాయా అని తనిఖీ చేయిస్తున్నారని వాపోయారు. డ్రెస్ నిబంధనలు పాటించడం లేదని తరగతులకు అనుమతించకపోవడం దారుణమన్నారు. -
విద్యా సౌగంధిక!
జూబ్లీహిల్స్: సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల. తెలుగు రాష్ట్రాల్లో పరిచయంఅక్కరలేని మహిళా కళాశాల. అరవై వసంతాల ఘన చరిత దీని సొంతం. నగరం నడిబొడ్డున 8 ఎకరాల సువిశాల స్థలంలో సకల సౌకర్యాలతో కూడిన ప్రాంగణంతో ఈ కళాశాల అలరారుతోంది. విద్యా సౌగంధికగా విరాజిల్లుతోంది. డైమండ్ జూబ్లీ వేడుకలు చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కథనం. సిస్టర్స్ ఆఫ్ చారిటీ. ఇటలీలో 1832లో ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా సామాజిక, విద్యారంగంలో సేవలు అందిçస్తున్న ప్రఖ్యాత సేవాసంస్థ. 1860లో భారత్‌లో ప్రవేశించి క్రమంగా తన సేవలను విస్తరించింది. 1959లో 15మంది విద్యార్థినులతో సికింద్రాబాద్‌లో సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాలను ప్రారంభించింది. ముందుగా బీఏ కోర్స్ తర్వాత బీకాం, బీఎస్సీ కోర్సులు ప్రారంభించింది. 1977 ప్రాంతంలో బేగంపేటలోని కుందన్‌బాగ్‌లో 8ఎకరాల సువిశాల ప్రాంగణంలోకి కళాశాలను మార్చారు. 1999లో నాక్ 5 స్టార్ గుర్తింపు లభించింది. క్రమంగా 2006, 2012లలో ‘ఎ’ గ్రేడ్ గుర్తింపు పొందింది. 2014లో ప్రతిష్టాత్మకమైన ‘కాలేజ్ విత్ పొటెన్షియల్ ఎక్స్‌లెన్స్ ’ (సీపీఈ)గా నాక్ ప్రకటించింది. 2018లో గోల్డెన్ జూబ్లీ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం 172మంది అధ్యాపకులు, 110 మంది నాన్‌టీచింగ్ స్టాఫ్, 4 వేలకుపైగా విద్యార్థిలున్నారు. కోర్సులు ఇవీ.. 26 డిపార్ట్మెంట్లతో పలు పీజీ, యూజీ కోర్సులు, సర్టిఫికెట్ కోర్సులు, ఫారిన్ కొలాబరేషన్‌తో కొన్ని కోర్సులునిర్వహిస్తున్నారు. పూర్వ విద్యార్థులు.. హేమాహేమీలు.. వివిధరంగాల్లో ఉన్నత స్థితికి ఎదిగిన ఎంతోమంది విద్యార్థులను ఈ కళాశాల అందించింది. ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, వాణీమోహన్, సునీత ఐపీఎస్ తేజ్‌దీప్‌కౌర్ మీనన్, నటీమణులు మంచు లక్ష్మి, నందిత, అర్చనా వేద తదితరులు ఇక్కడ చదువుకున్నవారే. కళాశాలలో పలు విభాగాలు క్లబ్‌లు నిర్వహిస్తున్నాయి. వ్యాపారంగంలో ప్రవేశించాలనుకునే విద్యార్థినుల కోసం ప్రత్యేక ఎంటర్ప్రెన్యూర్ సెల్ నిర్వహిస్తున్నారు. ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ విభాగాలు ఉన్నాయి. విద్యార్థినులు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని పలు పతకాలు సాధించారు. గ్రీన్ కాలేజీ.. పర్యావరణ పరిరక్షణకు ఈ కళాశాల పెద్దపీట వేస్తోంది. ప్రాంగణంలో వర్షపు నీరు ఒడిసిపట్టడానికి ఇంకుడుగుంతలు ఏర్పాటు చేశారు. శుభం పేరుతో వేస్ట్ మేనేజ్మెంట్, సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ‘ప్రకృతి’ పేరుతో ప్రత్యేకంగా కాలేజీ క్లబ్ ఏర్పాటు చేసి పలు కార్యక్రమాలునిర్వహిస్తున్నారు. యూజీసీ అటానమస్ హోదా.. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కొనసాగుతున్న ఈ కళాశాలకు నగరంలో మొదటిసారిగా 1988లో యూజీసీ అటానమస్ హోదా లభించింది. 2015 నుంచి ‘చాయిస్ అండ్ క్రెడిట్ బేస్డ్ సెమిస్టర్ సిస్టమ్’ (సీసీబీఎస్‌ఎస్) పద్ధతి అమలు చేస్తున్నారు. ఎన్నో సదుపాయాలు 83 వేలకుపైగా పుస్తకాలు, ‘స్లిమ్ 21 ’పేరుతో కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ జర్నల్స్, ఇంటర్నెట్ రిసోర్స్ సెంటర్, సైన్స్ ల్యాబ్, ఇంగ్లిష్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, యూజీ, పీజీ సైకాలజీ ల్యాబ్, మాస్‌కమ్యునికేషన్ ల్యాబ్, ఇండోర్ స్టేడియం, స్టూడెంట్ కార్నర్, మైక్రోబయాలజీకి ప్రత్యేకించిన లూయిస్ పాశ్చర్ రిసెర్చ్ ల్యాబ్, ఫిటనెస్ సెంటర్, హెల్త్‌సెంటర్, అమెరికన్ కార్నర్ తదితర సదుపాయాలు ఏర్పాటు చేశారు. 15 మందితో ప్రస్థానం మొదలు.. 1959లో కేవలం 15మంది విద్యార్థినులతో కళాశాల ప్రయాణం మొదలైంది. ఆరు దశాబ్దాల కాలంలో 4వేలకుమందికిపైగా విద్యార్థినులు, 28 విభాగాలు, 300కిపైగా టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌తో సాగుతోంది. విలువలతో కూడిన విద్యాబోధన మా సొంతం. ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. – సాండ్రా హోర్తా, ప్రిన్సిపాల్ -
సెయింట్ ఫ్రాన్సిస్ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ వైఎంసీఏ ఓపెన్ 3–3 మహిళల బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజి జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో సెయింట్ ఫ్రాన్సిస్ 18–14తో కేబీసీ జట్టుపై విజయం సాధించింది. విజేత జట్టు తరఫున అమిత డేనియల్ 12 పాయింట్లతో చెలరేగింది. కేబీసీ తరఫున రచన (8), మానస (6) ఆకట్టుకున్నారు. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో కేబీసీ 12–6తో ఫిబాపై, సెయింట్ ఫ్రాన్సిస్ 16–15తో సెయింట్ పాయ్స్పై గెలుపొందాయి. క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో సెయింట్ ఫ్రాన్సిస్ 17–14తో సెయింట్ ప్యాట్రిక్స్‌పై, ఫిబా 13–7తో రాకెట్స్‌పై, సెయింట్ పాయ్స్ 15–8తో లయోలా అకాడమీపై, కేబీఎస్ 17–14తో సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్‌పై విజయం సాధించాయి. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం సంయుక్త కార్యదర్శి ఎస్. హనుమంతరావు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను, నగదు బహుమతిని అందజేశారు. విజేతగా నిలిచిన సెయింట్ ఫ్రాన్సిస్ జట్టుకు రూ. 3000, రన్నరప్ కేబీసీ జట్టుకు రూ. 2000 ప్రైజ్‌మనీగా లభించాయి. -
కాలేజీలో సందడి చేసిన శిరీష్
సోమాజిగూడ: విద్యార్థుల ఉరకలెత్తే ఉత్సాహంతో కళాశాల ప్రాంగణం మార్మోగింది. ఆటపాటలతో అదిరిపోయింది. బేగంపేట్ సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన ‘ఎస్కేస్ 2016’ కార్యక్రమం ఉర్రూతలూగించింది. వివిధ కార్యక్రమాలతో విద్యార్థులు సందడి చేయగా... సినీ నటులు అల్లు శిరీష్, సుమంత్ ఆశ్విన్‌లు పాల్గొని జోష్ నింపారు. -
ఓవరాల్ చాంపియన్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్ కాలేజ్ మహిళల స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఈ పోటీల్లో 31 పారుుంట్లు సాధించి సెరుుంట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజ్, బేగంపేట్ తొలి స్థానాన్ని దక్కించుకోగా... 15 పారుుంట్లు సాధించిన ఐఐఎంసీ కాలేజ్ రెండో స్థానంలో, 11 పారుుంట్లతో భద్రుక కాలేజ్, కాచిగూడ మూడో స్థానంలో నిలిచారుు. బాస్కెట్‌బాల్,టేబుల్ టెన్నిస్ టైటిల్స్‌కూడా బాస్కెట్‌బాల్, టేబుల్ టెన్నిస్ పోటీల్లోనూ సెరుుంట్ ఫ్రాన్సిస్ జట్లే టైటిల్‌ను దక్కించుకున్నారుు. బాస్కెట్‌బాల్ ఫైనల్లో సెరుుంట్ ఫ్రాన్సిస్ జట్టు 26-21తో సెరుుంట్ ఆన్స జట్టుపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో సెరుుంట్ ఫ్రాన్సిస్ తరఫున రీనా (8), రచన (9), మార్టినా (7)... సెరుుంట్ ఆన్స జట్టులో మానస (7), రవళి (7), తేజు (7) రాణించారు. టేబుల్ టెన్నిస్ ఫైనల్లో సెరుుంట్ ఫ్రాన్సిస్ జట్టు 2-1 తేడాతో సెరుుంట్ ఆన్సపై గెలిచి టైటిల్‌ను దక్కించుకుంది. వివిధ కేటగిరీల విజేతలు: 50మీ. ఫ్రీస్టరుుల్: 1. ఆర్. నమిత (సెరుుంట్ ఫ్రాన్సిస్), 2. కె.ఎస్. భవ్య (భద్రుక), 3. పి. అనూష (భవన్స డిగ్రీ కాలేజ్). 50మీ. బ్యాక్స్టోక్:్ర 1. ఆర్. నమిత (సెరుుంట్ ఫ్రాన్సిస్), 2. మేరీ జెస్సిక (సెరుుంట్ ఫ్రాన్సిస్), 3. ఎస్. దివ్య (యూసీపీఈ). 50మీ. బటర్‌ఫ్లయ్: 1. మేరీ జెస్సిక (సెరుుంట్ ఫ్రాన్సిస్), 2. కె.ఎస్. భవ్య (భద్రుక), 3. కె. సుచిత్ర(సెరుుంట్ ఫ్రాన్సిస్.