సెమీస్‌లో వెస్లీ బాయ్స్
జింఖానా, న్యూస్‌లైన్: చందన్ సహానీ (123), వినీత్ రెడ్డి (126) శతకాలతో రెచ్చిపోవడంతో కోకాకోలా అండర్-16 ఇంటర్ కాలేజ్ టోర్నీలో వెస్లీ బాయ్స్ కాలేజి సెమీఫైనల్‌కు చేరింది. సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజి (బషీర్‌బాగ్) జట్టుతో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్లీ బాయ్స్ 173 పరుగుల భారీ తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్లీ జట్టు మూడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేయగా, అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన సెయింట్ మేరీస్ జట్టు 148 పరుగుల వద్ద ఆలౌటైంది. జట్టులో శంతన్ రెడ్డి (46), అక్షయ్‌కుమార్ (45) చక్కని పోరాట పటిమ కనబరిచారు. మరో మ్యాచ్‌లో ఆల్ సెయింట్స్ హైస్కూల్ జట్టు 59 పరుగుల తేడాతో హెచ్‌పీఎస్ రామంతాపూర్ జట్టుపై విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆల్ సెయింట్స్ 251 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హెచ్‌పీఎస్ రామంతాపూర్ జట్టు 192 పరుగుల వద్ద కుప్పకూలింది. జట్టులో హెచ్‌కే సింహా 40 పరుగులు చేసి ఫరవాలేదనిపించాడు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
హెచ్‌పీఎస్-బీ: 114 (సచిన్ 31; సోహైల్ 3/24), సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్: 115/3 (సోహైల్ 46); ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్: 149 (నవీన్ 32, అంజయ్య 31), భవాన్స్ ఎస్ఏజేసీ: 150/1 (సాయి కిరణ్ 66, నిఖిల్ 62 నాటౌట్).