స్కూల్ లో కరెంట్ షాక్ : విద్యార్థి మృతి
విజయవాడ: కృష్ణాజిల్లా కంకిపాడులోని సెయింట్ మేరీస్ స్కూల్లో శనివారం విషాదం చోటు చేసుకుంది. స్కూల్ గ్రౌండ్లో ఆడుకుంటున్న 10వ తరగతి విద్యార్థి సునీత్పై కరెంట్ తీగలు తెగిపడ్డాయి. దాంతో అతడుకి కరెంట్ షాక్ కొట్టి... అక్కడికక్కడే మృతి చెందాడు. దాంతో స్కూల్ యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సునీత్ మృతిపై స్కూల్ యాజమాన్యం అతడి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. అతడి తల్లిదండ్రులు స్కూల్కు చేరుకుని... కుమారుడి మృతదేహం చూసి భోరున విలపించారు.