saint paul
-
హిమపర్వం ఆగడం బగడం
మంచు కురిసే శీతకాలం ఎంత సరదాగా ఉంటుందో ప్రపంచానికి చూపించడంలో అమెరికావాసులు ఎప్పుడూ ముందే ఉంటారు. అందులో భాగంగానే మిన్నెసోటా రాష్ట్రం, సెయింట్ పాల్ నగరంలో ప్రతి ఏడాది పది రోజుల పాటు ఈ ‘వింటర్ కార్నివాల్ ఉత్సవాలు’ జరుగుతాయి. ఇవి అత్యంత పురాతనమైన సంబరాలు.సెయింట్ పాల్‌ను 1885లో సందర్శించిన న్యూయార్క్ విలేఖరులు ‘ఈ సెయింట్ పాల్ నగరం మరో సైబీరియా లాంటిది. శీతకాలంలో మానవ నివాసానికి పనికిరాదు’ అని పత్రికల్లో రాశారు. ఆ రాతలకు సెయింట్ పాల్ వాసులు మనస్తాపం చెందారు. తమ ప్రాంతం గొప్పదనాన్ని ప్రపంచానికి వెల్లడించడానికి, ప్రపంచంలో తమదైన ప్రత్యేకతను నిలుపుకోవడానికి ఈ వినూత్న సంబరాలను మార్గంగా ఎన్నుకున్నారు. అప్పటికే కెనడాలోని మాంట్రియల్ నగరంలో ఈ కార్నివాల్ ఉత్సవాలు జరుగుతుండేవి. వాటిని ప్రేరణగా తీసుకుని, 1886లో ఈ ఉత్సవాలకు నమూనాలు రూపొందించారు. ఇవి ప్రారంభమైన నాటి నుంచి కేవలం రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో తప్ప, ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.ఈ ఏడాది జనవరి 25 నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు ఫిబ్రవరి 3తో ముగుస్తాయి. ఈ వేడుకలకు బోరియాస్ పురాణాన్ని ప్రామాణికంగా చెబుతారు. ఇక్కడి ప్రజలు శీతకాలపు దేవుడుగా బోరియాస్ను కొలుస్తారు. కళ్లు చెదిరేలా జరిగే ఈ వేడుకల్లో ఐస్ పాలస్, మంచు శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.ఈ వేడుకల్లో గడ్డాల పోటీలు, హాట్ డిష్ పోటీలు, ఐస్ రన్ పోటీలు ఇలా చాలానే నిర్వహిస్తుంటారు. కనువిందు చేసే ఈ మంచు వేడుకను చూడటానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తుంటారు. వివిధ దేశాల రాచ కుటుంబీకులు, ప్రముఖులు, అధికారులు ఇలా చాలామంది ఈ వేడుకకు ప్రత్యేకంగా హాజరవుతుంటారు. -
దైవ సాక్షాత్కారం
క్రీస్తు పేరెత్తిన వారిని బంధించి, చిత్రహింసలు పెట్టడంలోని అపరిమిత ఆనందానికి దాసుడనై ఉండగా ఒకనాటి మధ్యాహ్నం – యెరూషలేము నుంచి దమస్కునకు వెళుతున్నపుడు – విర్రవీగుతున్న పౌలు అహంకారానికి దారి మధ్యలో కర్రసాయం కావలసి వచ్చింది! భరించలేని వెలుగొకటి అకస్మాత్తుగా అతడి కళ్లను కమ్మింది. దివ్యమైన ఆ వెలుగు అతడి చుట్టూ ప్రకాశించింది. మూర్ఛిల్లిన విధంగా నేలపై పడ్డాడు పౌలు. ‘‘సౌలా... సౌలా... నీవెందుకు హింసించుచున్నావు’’ అంటోంది అదృశ్య స్వరం. ‘‘ఎవరు నువ్వు?’’ అని అడిగాడు పౌలు... తన అంధకారంలోంచి లేవకుండానే. ‘‘నజరేయుడైన యేసును’’ అనే పలుకు వినిపించింది. పౌలు చుట్టూ ఉన్నవాళ్లు ఆ వెలుగును చూశారు కానీ, ఆ మాటలు వారికి వినిపించలేదు. అంత వెలుగును చూశాక పౌలు ఒక్కసారిగా అంధుడైపోయాడు. ‘‘ప్రభువా, నన్నేమి చెయ్యమంటావు’’ అని అడిగాను. వెంటనే దమస్కు వెళ్లమని ఆయన పౌలును ఆజ్ఞాపించారు. అక్కడికి వెళ్లాక ఏం చెయ్యవలసిందీ తెలుస్తుందని సముదాయించారు. లేచి, దమస్కు వైపు పగటిపూట చీకట్లో తడుముకుంటూ నడిచాడు. అననీయ అనే భక్తుడు అక్కడ పౌలును కలిసి ‘‘సౌలా... సహోదరా, దృష్టిని పొందుము’’ అని చెప్పిన తక్షణం పౌలు ఈ ప్రపంచాన్ని చూడగలిగాడు. పౌలుకు మెల్లిగా ప్రభువు మహిమ తెలుస్తోంది! దమస్కు నుంచి యెరూషలేము తిరిగి వచ్చి క్రీస్తును వెతుక్కున్నాడు. దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా పరవశుడై ప్రభువుని చూశాడు! తన పాపాలకు „ýమాపణ వేడుకున్నాడు. స్తెఫను అనే విశ్వాసిని రాళ్లతో కొట్టి చంపుతుండగా చూస్తూ నిలబడి, హంతకుల వస్త్రాలకు కావలిగా ఉన్న తన దుర్మార్గానికి ప్రాయశ్చిత్తాన్ని కోరాడు. యేసు కనికరించాడు. నేటి నుంచి నువ్వు ‘సౌలు’ కాదు, ‘పౌలు’గా పిలవబడతావు అని దీవించాడు. దేవుడు కనిపిస్తాడా? కనిపిస్తాడు! కనిపిస్తే చూడగలమా? చూడగలం! ఈ క్షణం వరకు మనం గడిపిన జీవితానికి, మారుమనసు పొంది కొత్తగా జీవితాన్ని ప్రారంభించిన క్షణానికి మధ్య దేవుడి సాక్షాత్కారం అవుతుంది! మహోజ్వలమైన వెలుగులో ఆయనను చూసే శక్తి మనకు లేకపోవచ్చు. పరివర్తన వల్ల మనలో కలిగే ప్రతిమార్పూ దైవాంశకు ప్రతిరూపమే. ఈ మాటను లోకానికి చాటుతూ, ఖండాలు తిరిగాడు క్రైస్తవ మత ధర్మదూతగా మారిన పౌలు. ఆయనే సెయింట్ పాల్. -
విజేత సెయింట్ పాల్
బాస్కెట్ బాల్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-14 బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో సెయింట్ ట్ పాల్ జట్టు విజేతగా నిలిచింది. విక్టరీ ప్లేగ్రౌండ్‌లో శనివారం జరిగిన ఫైనల్స్‌లో సెయింట్ పాల్ జట్టు 21-06 తేడాతో ఓబుల్ రెడ్డి జట్టును చిత్తుగా ఓడించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో సెయింట్ పాల్ జట్టు 8-3తో జెడ్పీహెచ్ఎస్ జట్టుపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో ఓబుల్ రెడ్డి జట్టు 10-6తో డాన్ బాస్కో జట్టుపై నెగ్గింది.