డెంగీతో చిన్నారి మృతి
రైల్వే కోడూరు (వైఎస్సార్ జిల్లా): డెంగీ మహమ్మారి ఓ చిన్నారిని మింగేసింది. వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరులో నివాసం ఉండే దంపతుల కుమార్తె సాయిరేఖకు డెంగీ వ్యాధి సోకింది. దాంతో వైద్యం నిమిత్తం చెన్నైలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ బాలిక సోమవారం మృతి చెందింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.