breaking news
Saiyaara Movie
-
బాక్సాఫీస్ మాత్రమే కాదు.. ఓటీటీలోనూ సంచలనమే!
ఈ ఏడాది సూపర్ హిట్‌గా నిలిచన రొమాంటిక్ లవ్ స్టోరీ సైయారా. మోహిత్ సూరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.580 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఎలాంటి బజ్ లేకుండా వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్‌ను షేర్ చేసింది. ఈ చిత్రం ద్వారా అహాన్ పాండే (Ahaan Panday), అనీత్ పడ్డా (Aneet Padda) బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. జులై 18న విడుదలైన ఈ సినిమా సంచనాలు క్రియేట్ చేసింది. కేవలం మౌత్ టాక్ పవర్‌తో బాక్సాఫీస్ రికార్డ్లను తిరగరాసింది. 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్లో అనేక చిత్రాల కలెక్షన్స్‌ను దాటి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది ఓవర్సీస్లో అత్యధిక వసూళ్లు సొంతం చేసుకున్న బాలీవుడ్ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది బాలీవుడ్ హిట్ సినిమా ఛావా రికార్డ్‌ను కూడా దాటేసింది.ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేస్తోంది. సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన సైయారా ఓటీటీలోనూ తగ్గేదేలే అంటోంది. ఓటీటీకి వచ్చిన తొలి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న నాన్- ఇంగ్లీష్ చిత్రంగా నిలిచింది. వరల్డ్ వైడ్‌గా ఆంగ్లేతర చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో సైయారా కొనసాగుతోంది. ఈ రొమాంటిక్ డ్రామా జర్మన్ చిత్రం 'ఫాల్ ఫర్ మీ', హిందీ మూవీ 'ఇన్స్పెక్టర్ జెండే'లను అధిగమించింది. ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే అగ్రస్థానానికి చేరుకుంది, 'ఫాల్ ఫర్ మీ' మూవీతో సహా అనేక చిత్రాలను దాటేసింది.ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లేతర చిత్రాల జాబితాలో సైయారా మొదటి స్థానంలో ఉంది. ఈ చిత్రం 3.7 మిలియన్ల వ్యూస్‌తో పాటు 9.3 మిలియన్ గంటల వీక్షణలతో దూసుకెళ్తోంది. జర్మన్ థ్రిల్లర్ మూవీ 'ఫాల్ ఫర్ మీ' 6.5 మిలియన్ గంటల వ్యూస్‌తో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత మనోజ్ భాజ్‌పాయ్ నటించిన 'ఇన్స్పెక్టర్ జెండే' 6.2 మిలియన్ గంటల వీక్షణలతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ జాబితాలో విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్డమ్' 2.5 మిలియన్ గంటల వ్యూస్‌తో తొమ్మిదో స్థానంలో ఉంది. -
ఓటీటీలో సెన్సేషనల్ హిట్ సినిమా 'సైయారా'
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'సైయారా'(Saiyaara) ఓటీటీ ప్రకటన వచ్చేసింది. మోహిత్ సూరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.580 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. అహాన్ పాండే (Ahaan Panday), అనీత్ పడ్డా (Aneet Padda) జంటగా 'సైయారా'తో బాలీవుడ్‌కు పరిచయమ్యారు. వీరిద్దరూ క్రిష్, వాణి పాత్రలతో యూత్‌ను మెప్పించారు. ఎలాంటి అంచనాలు లేకుండా జులై 18న విడుదలైన ఈ సినిమా సంచనాలు క్రియేట్ చేసింది. కేవలం మౌత్ టాక్ పవర్‌తో బాక్సాఫీస్ రికార్డ్లను తిరగరాసింది.యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా విడుదలైన 'సైయారా' నెట్‌ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 12న ఓటీటీలోకి రానుందని ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. కేవలం రూ. 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్లో అనేక చిత్రాల కలెక్షన్స్‌ను దాటి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఓవర్సీస్లో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సొంతం చేసుకున్న బాలీవుడ్ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది బాలీవుడ్ హిట్ సినిమా ఛావా రికార్డ్‌ను కూడా దాటేసింది. అందుకే ఈ చిత్రం ఓటీటీ విడుదల గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కథేంటి?వాణి బత్రా(అనీత్ పడ్డా) ఓ రైటర్. తన కాలేజీ సీనియర్ మహేశ్ అయ్యర్‌ని ప్రేమించి, ఇంట్లో వాళ్లని ఒప్పించి పెళ్లికి రెడీ అవుతుంది. కానీ చివరి నిమిషంలో అతడు తన స్వార్థం చూసుకుని ఈమెకు హ్యాండ్ ఇస్తాడు. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ బాధ నుంచి కోలుకున్న వాణి.. ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది. అదేరోజు అనుకోకుండా క్రిష్ కపూర్(అహన్ పాండే)ని కలుస్తుంది. ఇతడో యువ సింగర్. గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంటాడు. ఊహించని పరిస్థితుల్లో క్రిష్-వాణి కలిసి ఓ పాట కోసం పనిచేయాల్సి వస్తుంది. అలా కొన్నాళ్లకు వీళ్లిద్దరూ ప్రేమలో పడతారు. కానీ వాణి జీవితంలోకి ఆమె పాత ప్రేమికుడు మహేశ్ వస్తాడు. మరి ఇద్దరిలో వాణికి ఎవరు దగ్గరయ్యారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇందులో భారీ ఫైట్స్ లేవు. పవర్ఫుల్ డైలాగ్స్ లేవు. కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ కూడా లేవు. కేవలం ఎమోషన్ మాత్రమే ఈ చిత్రాన్ని నిలబెట్టింది. -
ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ఈ వీకెండ్ థియేటర్లలోకి తేజ్ సజ్జా 'మిరాయ్', బెల్లంకొండ శ్రీనివాస్ 'కిష్కంధపురి' చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ రెండింటిపైన కాస్తోకూస్తో హైప్ ఉంది. మరి వీటిలో ఏది హిట్ అవుతుందో చూడాలి. అలానే ఓటీటీల్లోనూ తక్కువ మూవీస్ వస్తున్నప్పటికీ వాటిలో కొన్ని చూడదగ్గ హిట్ చిత్రాలు ఉండటం విశేషం.ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. రజినీకాంత్ 'కూలీ', హిట్ బొమ్మ 'సు ఫ్రమ్ సో' ఈ వీకెండ్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటు బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ 'సయారా' కూడా ఇదే వారం రాబోతుందని సమాచారం. ఈ మూడు కచ్చితంగా చూడదగ్గ మూవీస్. అలానే బకాసుర రెస్టారెంట్, డిటెక్టివ్ ఉజ్వలన్ లాంటి చిత్రాలతో పాటు డు యూ వాన్నా పార్ట్నర్, రాంబో ఇన్ లవ్ తదితర సిరీస్‌లు కూడా ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 8 నుంచి 14 వరకు)అమెజాన్ ప్రైమ్హెల్లువా బాస్ సీజన్ 1 & 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 10ద గర్ల్‌ఫ్రెండ్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 10వెన్ ఫాల్ ఈజ్ కమింగ్ (ఫ్రెంచ్ సినిమా) - సెప్టెంబరు 10కూలీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 11డూ యూ వాన్నా పార్టనర్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 12ఎవ్రీ మినిట్ కౌంట్స్ సీజన్ 2 (స్పానిష్ సిరీస్) - సెప్టెంబరు 12ల్యారీ ద కేబుల్ గాయ్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 12జెన్ వీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 12నెట్ఫ్లిక్స్డాక్టర్ సెస్ రెడ్ ఫిష్, బ్లూ ఫిష్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 08సయారా (హిందీ సినిమా) - సెప్టెంబరు 12 (రూమర్ డేట్)హాట్స్టార్సు ఫ్రమ్ సో (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 09ఓన్లీ మర్డర్స్ ఇన్ ద బిల్డింగ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 09రాంబో ఇన్ లవ్ (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 12సన్ నెక్స్ట్మీషా (మలయాళ సినిమా) - సెప్టెంబరు 12బకాసుర రెస్టారెంట్ (తెలుగు మూవీ) - సెప్టెంబరు 12లయన్స్ గేట్ ప్లేడిటెక్టివ్ ఉజ్వలన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 12ద రిట్యూవల్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 12 -
అన్ని సినిమాలు మహావతార్, సయారాలు కావుగా!: నిర్మాత
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి రూ.310 కోట్లు కొల్లగొట్టింది మహావతార్ నరసింహ మూవీ (Mahavatar Narsimha). అటు బాలీవుడ్లో కొత్తవారితో తీసిన సయారా చిత్రం ఏకంగా రూ.580 కోట్లు దాటేసింది. ఈ రెండు సినిమాలు ఎంత సెన్సేషన్ అయ్యాయో అందరికీ తెలిసిందే! అయతే కొత్తవారితో తీసిన ప్రతి సినిమా సయారాలా సెన్సేషన్ హిట్ అందుకోలేదంటున్నాడు బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్.భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్.. ఎందుకు?తేజ సజ్జ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మిరాయ్. ఈ సినిమాను హిందీలో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి కరణ్ జోహార్ (Karan Johar) విడుదల చేస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో కరణ్ జోహార్ పాల్గొన్నాడు. అక్కడ.. భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అవడానికి పెరిగిపోతున్న నిర్మాణ వ్యయం లేదా స్టార్స్ తీసుకుంటున్న రెమ్యునరేషన్.. ఏది కారణం? అని ఓ ప్రశ్న ఎదురైంది.ఎవర్నీ తప్పుపట్టలేంఅందుకు కరణ్ స్పందిస్తూ.. ప్రతి సినిమాకు దాని ఫలితం ముందే రాసిపెట్టి ఉంటుంది. పెద్ద హీరోలతో తీసిన భారీ బడ్జెట్ సినిమాలు కూడా హిట్టయిన రోజులున్నాయి. కాకపోతే పరిస్థితులు సరిగా లేవు. అందుకే ఇప్పుడందరూ సినిమాను మరోసారి అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మనం ఎవరినీ తప్పుపట్టలేము. అలాగే కొత్తవారితో పెద్ద సినిమా తీసినప్పుడు అవి సక్సెస్ అయిన రోజులున్నాయి, అలాగే ఫెయిలైన సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడేం జరుగుతుందనేది కచ్చితంగా ఎవరూ చెప్పలేరు.దరిదాపుల్లోకి కూడా రాలేవ్సంగీతాన్ని ప్రధానంగా తీసుకుని వచ్చే ప్రతి సినిమా సయారాలా హిట్టవలేదు. యానిమనేషన్ సినిమాలు కూడా ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. అవన్నీ మహావతార్ నరసింహకు దరిదాపుల్లోకి కూడా రాలేవు అని కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు.చదవండి: సెంచరీలతో స్టార్ హీరో దూకుడు.. మరో హాఫ్ సెంచరీ! -
ఓటీటీకి వచ్చేస్తోన్న రూ.500 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ఇటీవలే విడుదలై లవ్ బర్డ్స్‌ను తెగ ఏడిపించేసిన సినిమా సయారా. జూలై 18న థియేటర్లలోకి వచ్చిన ఈ బాలీవుడ్ రొమాంటిక్ ఫీల్ గుడ్ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రేమకథ ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడంతో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. ఇప్పటివరకు సయారా చిత్రానికి దాదాపు రూ.500 కోట్లకు పైనే గ్రాస్ వసూళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఓవర్సీస్లో అయితే ఏకంగా విక్కీ కౌశల్ ఛావా వసూళ్లు దాటేసింది. అంతలా సూపర్ హిట్‌గా ఈ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ రివీల్ చేశారు. అహాన్ పాండే, అనీత్ పద్దా నటించిన ఈ రొమాంటిక్ చిత్రం వచ్చేనెల 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. సయారా మూవీ కాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. అయితే ఈ చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే మేకర్స్ సైతం అఫీషియల్‌గా ప్రకటించే అవకాశముంది.కాగా.. ఈ సినిమాకు మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో సయారాను తెరకెక్కించారు. భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు చేసిన రొమాంటిక్ చిత్రంగా సయారా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. భారతదేశంలో రూ. 320 కోట్లు వసూలు చేసింది. -
'ఛావా' రికార్డ్ బ్రేక్ చేసిన చిన్న సినిమా
చిన్న సినిమాలు అప్పుడప్పుడు అద్భుతాలు చేస్తుంటాయి. ఇప్పుడు కూడా 'సయారా' అనే బాలీవుడ్ మూవీ ఎవరూ ఊహించని కలెక్షన్స్ సొంతం చేసుకుంటోంది. అలానే కొన్ని రికార్డ్స్‌ని కూడా బ్రేక్ చేస్తోంది. ఇప్పుడు అలానే ఏకంగా 'ఛావా'ని దాటేయడం చర్చనీయాంశమైంది. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: బర్త్‌డే ప్రకటన.. గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్)విక్కీ కౌశల్, రష్మిక నటించిన చారిత్రక సినిమా 'ఛావా'. ఛత్రపతి శివాజీ కుమారుడి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం.. ఊహించని వసూళ్లు సాధించింది. ఓవర్సీస్లోనూ మంచి కలెక్షన్ అందుకుంది. ఇప్పుడు ఆ నంబర్లని 'సయారా' అధిగమించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో థియేటర్లలోకి వచ్చిన 'ఛావా'.. ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర రూ.91 కోట్లు సాధించింది. ఇప్పుడు ఆ నంబర్ని సయారా.. కేవలం 13 రోజుల్లోనే అధిగమించిందని బాలీవుడ్ మీడియా చెబుతోంది. ఇప్పటివరకూ సయరా సినిమాకు ఓవర్సీస్లో రూ.94 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.ఓవరాల్‌గా చూసుకుంటే యువతని ఆకట్టుకుంటున్న సయారా చిత్రానికి ఇప్పటివరకు రూ.400 కోట్లకు పైనే వసూళ్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ ఈ మధ్యనే చెప్పుకొచ్చింది. కేవలం మన దేశంలోనే రూ.260 కోట్లు వరకు వచ్చాయని సమాచారం. పరిస్థితి చూస్తుంటే రూ.500 కోట్ల మార్క్ కూడా మరికొన్నిరోజుల్లో దాటేయడం గ్యారంటీ. ఇంతకీ సయారా బడ్జెట్ ఎంతనుకున్నారు? కేవలం రూ.30 కోట్లు. ఈ లెక్కన చూసుకుంటే నిర్మాణ సంస్థకు వేరే లెవల్ లాభాలు వచ్చినట్లే.(ఇదీ చదవండి: ఫిష్ వెంకట్ ఘటన మరవకముందే మరో విషాదం) -
రూ.200 కోట్ల క్లబ్లో ‘సైయారా’.. ఖాన్స్ రికార్డ్స్ బద్దలు
బాలీవుడ్ మొత్తం ఇప్పుడు సైయారా జపం చేస్తోంది. ఎక్కడ చూసినా ఈ చిన్న సినిమా గురించే చర్చిస్తున్నారు. విడుదలై వారం రోజులు దాటినా..జనాలు ఈ సినిమాను మర్చిపోవడం లేదు. బాక్సాఫీస్ కలెక్షన్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వారం రోజుల్లో ఈ చిత్రం రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. బడా హీరోల పేరిట ఉన్న రికార్డులను కొల్లగొడుతోంది.అహన్ పాండే, అనీత్ పడ్డా హీరోహీరోయిన్లు నటించిన ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించాడు. ఈ నెల 18న ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం 800 థియేటర్స్‌లో మాత్రమే విడుదలైంది. తొలి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుంది. ఫలితంగా రెండో రోజు నుంచి ఈ సినిమా వసూళ్లు పుంజుకున్నాయి. ఎనిమిది రోజుల్లో రూ. 200 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. ఇటీవల బాలీవుడ్లో విడుదలైన అన్ని చిత్రాల్లో ఇదే అత్యధిక కలెక్షన్స్. ఖాన్ సినిమాలు సైతం ఈ స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టడం లేదు.(చదవండి: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్.. 'సయారా' రివ్యూ) ఆమిర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్ (164 కోట్లు), అజయ్ దేవ్గన్ రైడ్ 2 (173 కోట్ల) చిత్రాలకు మించిన కలెక్షన్స్‌ని రాబట్టి.. అత్యధిక వసూళ్ల సాధించిన డెబ్యూ ఫిల్మ్‌గా రికార్డెకెక్కింది. సినిమాకు హిట్ టాక్ రావడంతో థియేటర్స్ సంఖ్య కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 2000 థియేటర్స్‌లో ఈ సినిమా ప్రదర్శితం అవుతోంది. సైయారా కథ విషయానికొస్తే..వాణి బత్రా(అనీత్ పడ్డా) ఓ రైటర్. కాలేజీలో తన సీనియర్ అయిన మహేశ్ అయ్యర్‌ని ప్రేమించి, ఇంట్లో వాళ్లకి చెప్పి పెళ్లికి కూడా ఒప్పిస్తుంది. కానీ చివరి నిమిషంలో అతను హ్యాండ్ ఇస్తాడు. ఆరు నెలల వరకు వాణి ఆ డిప్రెషన్లోనే ఉంటుంది. తర్వాత ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది. అదే రోజు ఆమె జీవితంలోకి క్రిష్ కపూర్ (అహన్ పాండే) వస్తాడు. తానో సింగర్. అవకాశాల కోసం తిరుగుతుంటారు. వాణితో కలిసి ఓ పాట కోసం పని చేస్తారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమలో పడిపోతారు. అదే సమయంలో వాణి జీవితంలోకి మళ్లీ మహేశ్ అయ్యర్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది. ఈ ఇద్దరిలో వాణి ఎవరికి దగ్గరైంది అనేదే మిగతా కథ. -
బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్.. 'సయారా' రివ్యూ
రీసెంట్ టైంలో బాలీవుడ్లో ఓ యూత్ ఫుల్ లవ్ రొమాంటిక్ మూవీ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై సెన్సేషన్ సృష్టిస్తోంది. కేవలం మూడు రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే 'సయారా'. జూలై 18న థియేటర్లలోకి వచ్చింది. పేరుకే హిందీ సినిమా అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల దృష్టిలోనూ పడిన ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. 'రోంత్' తెలుగు రివ్యూ (ఓటీటీ))కథేంటి?వాణి బత్రా(అనీత్ పడ్డా) ఓ రైటర్. తన కాలేజీ సీనియర్ మహేశ్ అయ్యర్‌ని ప్రేమించి, ఇంట్లో వాళ్లని ఒప్పించి పెళ్లికి రెడీ అవుతుంది. కానీ చివరి నిమిషంలో అతడు తన స్వార్థం చూసుకుని ఈమెకు హ్యాండ్ ఇస్తాడు. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ బాధ నుంచి కోలుకున్న వాణి.. ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది. అదేరోజు అనుకోకుండా క్రిష్ కపూర్(అహన్ పాండే)ని కలుస్తుంది. ఇతడో యువ సింగర్. గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంటాడు. ఊహించని పరిస్థితుల్లో క్రిష్-వాణి కలిసి ఓ పాట కోసం పనిచేయాల్సి వస్తుంది. అలా కొన్నాళ్లకు వీళ్లిద్దరూ ప్రేమలో పడతారు. కానీ వాణి జీవితంలోకి ఆమె పాత ప్రేమికుడు మహేశ్ వస్తాడు. మరి ఇద్దరిలో వాణికి ఎవరు దగ్గరయ్యారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?రీసెంట్ టైంలో ఏ ఇండస్ట్రీలో చూసినా సరే లవ్ బ్యాక్‌డ్రాప్ మూవీస్ పెద్దగా రావట్లేదు. అందరూ హారర్, యాక్షన్, పీరియాడికల్ అంటూ పాన్ ఇండియా ట్రెండ్ వెంటపడుతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో సింపుల్ ప్రేమకథ, మనసుకు హత్తుకునే పాటలతో వచ్చిన హిందీ సినిమానే 'సయారా'. ఇప్పటివరకు చాలా ప్రేమకథలు వచ్చాయి. వాటిలో ఒకలాంటిదే ఇది కూడా. స్టోరీ పరంగా కొత్తగాం ఏం ఉండదు. చాలాసార్లు చూసేశాం అనిపిస్తుంది. కాకపోతే స్టోరీని ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది.పెళ్లి బట్టలతో వాణి బత్రా.. రిజిస్టర్ ఆఫీస్‌కి వెళ్లిన సీన్‌తో సినిమా మొదలవుతుంది. కానీ బాయ్ ఫ్రెండ్ ఈమెకు హ్యాండ్ ఇస్తాడు. దీంతో కొన్నాళ్ల పాటు బాధతో ఇంటికే పరిమితమవుతుంది. అలా ఆరు నెలల తర్వాత తిరిగి బాహ్య ప్రపంచంలో అడుగుపెడుతుంది. రైటర్‌గా ఓ చోట జాబ్‌లో జాయిన్ అవుతుంది. అదే రోజు తన ఆఫీస్‌కి వచ్చి ఒకడ్ని కొడుతున్న సింగర్ క్రిష్ కపూర్‌ని ఈమె చూస్తుంది. అలా అక్కడ వీళ్లిద్దరికీ మొదలైన పరిచయం కాస్త ఎక్కడి వరకు వెళ్లింది? చివరకు ఏమైందనేదే సినిమా స్టోరీ.హిందీ ఆడియెన్స్ ఈ సినిమా చూసి తెగ ఎమోషనల్ అయిపోతున్నారు గానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఇది ఓకే ఓకే అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ చూస్తుంటే ఎమోషనల్‌గానే అనిపిస్తాయి. మరీ ముఖ్యంగా గతం మర్చిపోయిన వాణి ముఖంలో అమాయకత్వం చూస్తే అయ్యో అనిపిస్తుంది. అలానే పాటలు కూడా దేనికవే బాగుంటాయి. మరీ సూపర్ అని చెప్పాం గానీ ఓ మంచి మూవీ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది.ఎవరెలా చేశారు?క్రిష్ కపూర్‌గా చేసిన అహన్ పాండే, వాణిగా చేసిన అనీత్ పడ్డాకి ఇదే తొలి సినిమా. కానీ అద్భుతంగా చేశారు. అదిరిపోయే కెమిస్ట్రీ పండించారు. కొన్ని క్లోజప్ షాట్స్‌లో హీరోయిన్ని చూస్తుంటే మనల్ని కూడా ఇలాంటి అమ్మాయి ప్రేమిస్తే బాగుండు అనిపిస్తుంది. అంతా బాగుంటుంది మరి. మిగిలిన వాళ్లు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే డైరెక్టర్ మోహిత్ సూరి.. తనకు అచ్చొచ్చిన లవ్ రొమాంటిక్ జానర్లో మరో మంచి మూవీ తీశాడు. సినిమాటోగ్రఫీ, పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాని మరింత ఎలివేట్ చేశాయి.ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో, అది కూడా హిందీలో మాత్రమే ఉంది. ప్రేమలో ఉన్నోళ్లు, ప్రేమలో విఫలమైనోళ్లు ఈ సినిమా చూస్తే కచ్చితంగా ఎమోషనల్ అయ్యే అవకాశముంది. ఒకవేళ బిగ్ స్క్రీన్‌పై చూస్తే ఆసక్తి లేదంటే కొన్నాళ్లు ఆగితే నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తుంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు) -
సైయారా దెబ్బకు ఖాన్స్ రికార్డ్స్ అవుట్
-
తొలి సినిమాకే సెన్సేషన్.. ఎవరీ బ్యూటీ! (ఫోటోలు)
-
తొలి సినిమాకే రూ.150 కోట్ల కలెక్షన్స్.. అయినా సింపుల్‌గా..
ఒక్క సినిమాతో సెన్సేషన్ అయింది యంగ్ బ్యూటీ అనీత్ పడ్డా (Aneet Padda). తను కథానాయికగా నటించిన తొలి చిత్రం సైయారా (Saiyaara Movie). అహాన్ పాండే (అనన్య పాండే కజిన్) హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశంసలతో పాటు భారీ కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ జూలై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోహీరోయిన్లు కొత్తవారైనప్పటికీ జనం ఈ చిత్రాన్ని అక్కున చేర్చుకున్నారు. కేవలం మౌత్‌టాక్‌తోనే ఈ మూవీ ఇప్పటివరకు రూ.153 కోట్లు రాబట్టడం విశేషం. ఈ దూకుడు చూస్తుంటే ఈ వారాంతంలో సైయారా రూ.200 కోట్ల మార్కును చేరడం ఖాయంగా కనిపిస్తోంది.వీడియో వైరల్ఇదిలా ఉంటే తాజాగా అనీత్ పడ్డా ముంబైలోని ఓ సెలూన్‌కు వెళ్లింది. అక్కడినుంచి బయటకు వస్తుండగా ఫోటోగ్రాఫర్లు ఆమెను కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నించారు. ఓ అభిమాని ఆమెతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. అయితే ముఖానికి మాస్క్ ధరించిన అనీత్.. సున్నితంగా అతడి అభ్యర్థనను తిరస్కరించింది. సైలెంట్‌గా తన కారెక్కి వెళ్లిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా అనీత్ పడ్డా.. గతేడాది అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన బిగ్ గర్ల్స్ డోంట్ క్రై వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేసింది. సలాం వెంకీ చిత్రంలోనూ ఓ పాత్రలో మెరిసింది. View this post on Instagram A post shared by Snehkumar Zala (@sneyhzala)చదవండి: కాస్టింగ్ కౌచ్.. అసహ్యంతో ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్న హీరోయిన్ -
కోట్లు కొల్లగొడుతున్న చిన్న సినిమా.. నార్త్ యూత్ ని ఏడిపించేస్తుంది
-
మహేశ్, సుకుమార్‌ని ఫిదా చేసిన సినిమా.. ఏంటి దీని స్పెషల్?
బాలీవుడ్ అనగానే చాలామందికి రొమాంటిక్ ఫీల్ గుడ్ మూవీస్ గుర్తొచ్చేవి. కానీ గత కొన్నేళ్లలో చూసుకుంటే ఆ తరహా సినిమాలు తగ్గిపోయాయని చెప్పొచ్చు. అప్పట్ల 'ఆషికి 2' ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇన్నాళ్లకు మళ్లీ అదే మూవీ తీసిన డైరెక్టర్ మోహిత్ సూరి నుంచి 'సయారా' అనే మూవీ వచ్చింది. గత వీకెండ్లో థియేటర్లలో రిలీజైంది. నార్త్ యువత అంతా తెగ ఫీలైపోతున్నారు.(ఇదీ చదవండి: వృత్తిపరంగా ఇబ్బందుల్లో ఉన్నా.. యాంకర్ రష్మీ పోస్ట్)అంతెందుకు మన స్టార్ హీరో మహేశ్ బాబు, 'పుష్ప 2' డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ సినిమా చూసి ఫిదా అయిపోయారు. ఎంత నచ్చిందో ఏమోగానీ మహేశ్ ట్వీట్ చేయగా.. సుక్కు తన ఇన్ స్టా స్టోరీలో సినిమా అదిరిపోయిందని పోస్ట్ చేశాడు. మరి సినిమా అంత బాగుందా? ఇంతకీ మూవీ కథేంటి? అనేది ఇప్పుడు చూద్దాం.'సయారా' విషయానికొస్తే.. ప్రేమలో విఫలమైన హీరోయిన్(అనీత్ పడ్డా) ఓ రైటర్. అయితే ఓ అప్ కమింగ్ సింగర్(అహన్ పాండే)ని ప్రేమిస్తుంది. వీళ్లిద్దరి ప్రేమకు దేవుడు పెద్ద అవాంతరం కలిగిస్తాడు. హీరోయిన్‌కి అల్జీమర్స్ వ్యాధి వచ్చి ప్రతిదీ మర్చిపోతూ ఉంటుంది. అలాంటి టైంలో హీరోయిన్ పాత ప్రేమికుడు తిరిగొచ్చి ఆమెని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మరోవైపు కెరీర్లో ఎదగడానికి ఎంతో ప్రయత్నిస్తున్న హీరో.. కెరీర్‌ని కావాలనుకున్నాడా? ప్రేమని కోరుకున్నాడా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: వరలక్ష్మికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే?)అరే ఈ స్టోరీ లైన్ చూడగానే ఏదో తెలుగు సినిమా గుర్తొస్తుందే అనిపించిందా? అవును మీరు అనుకున్నది నిజమే. స్వయానా ఈ మూవీ తీసిన మోహిత్ సూరి 'ఆషికి 2' ఛాయలతో పాటు తెలుగు సినిమాలైన 'పడిపడి లేచే మనసు', 'అర్జున్ రెడ్డి' ఛాయలు కూడా గట్టిగానే కనిపిస్తాయి. మన ఆడియెన్స్ 'బేబి' రిలీజైనప్పుడు ఎంతలా ఫీలయ్యారో.. ఇప్పుడు నార్త్ ఆడియెన్స్ కూడా అలానే తెగ ఎమోషనల్ అయిపోతున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.ప్రస్తుతానికైతే బాలీవుడ్లో 'సయారా' కాస్త గట్టిగానే సౌండ్ చేస్తోంది. ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే హీరోహీరోయిన్ ఇద్దరు కొత్తోళ్లే. అహన్ పాండే.. హీరోయిన్ అనన్య పాండేకి అన్నయ్య. అంటే పెదనాన్న కొడుకు. ఇతడు చూడటానికి అందంగా, ఫ్రెష్‌గా ఉన్నాడు. యాక్టింగ్ కూడా బాగానే చేశాడు. హీరోయిన్ అనీత్ పడ్డా కూడా గ్లామరస్‌గా భలే ఉంది. మోహిత్ సూరి ఎప్పటిలానే తనకు అచ్చొచ్చిన లవ్ రొమాంటిక్ జానర్ కథతో అదరగొట్టేశాడు. దానికి తోడు హిందీ ఇండస్ట్రీలోని డ్రై పీరియడ్ కూడా దీనికి కాస్త గట్టిగానే కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఈ మూవీకి ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఐదు పాటలు ఇచ్చారు. అవన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. అది ఇంకో ప్లస్. అలా అన్ని ప్లస్సులు కలిసి 'సయారా'ని సూపర్ హిట్ చేసినట్లు కనిపిస్తోంది.(ఇదీ చదవండి: తల్లి సమాధి దగ్గర మంచు లక్ష్మి.. వీడియో)