సాకేతపురంలో పర్యటించిన వైఎస్ జగన్
విశాఖపట్నం: హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగోరోజు పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం నగరంలోని సాకేతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న ఇళ్లను ఆయన పరిశీలించారు.
ఈ సందర్బంగా వైఎస్ జగన్కు స్థానికులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్ గాజువాక, స్టీల్ ప్లాంట్, బర్మా కాలనీ, హైస్కూల్ రోడ్డు, అశోక్ నగర్, దయాళ్ నగర్లలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు.