అప్పుల బాధతో రైతు మృతి
బూర్గంపాడు: పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో వాటిని ఎలా తీర్చాలో మనస్ధాపం చెందిన రైతు గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం ఉప్పుసాక గ్రామంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుగులోసు సక్రు అనే గిరిజన రైతు పంట పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు భారీగా పెరిగిపోవడంతో.. అప్పులు ఇచ్చిన వాళ్ల ఒత్తిడి పెరిగిపోవడంతో తీవ్ర మనస్ధాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో శనివారం గుండెపోటుకు గురై మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.