ఆఫీస్ లోనే ఉరేసుకున్న డిప్యూటీ డైరెక్టర్
అనంతపురం: సాక్షర భారత కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ ఈశ్వరయ్య సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కార్యాలయంలోనే ఈశ్వరయ్య ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టించింది. విధులకు హాజరవుదామని వచ్చిన ఉద్యోగాలకు ఈశ్వరయ్య ఉరేసుకుని కన్పించడంతో వారంతా షాక్ కు గురైయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అసలు కార్యాలయంలోనే ఈశ్వరయ్య ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు ఏమిటనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విషాద వార్తను తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి బయల్దేరారు.