salaries doubling
-
‘ఆ ఉద్యోగులకు భారీగా వేతన పెంపు’
సాక్షి, న్యూఢిల్లీ : దేశ సరిహద్దుల్లో రహదారుల నిర్మాణం, మౌలిక ప్రాజెక్టుల్లో పనిచేసే ఉద్యోగులకు భారీగా వేతన పెంపు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతాల్లో పనిచేసే సిబ్బంది కనీస వేతనాన్ని 100 నుంచి 170 శాతానికి ప్రభుత్వం పెంచింది. తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న లడఖ్ సెక్టార్లో పనిచేసే ఉద్యోగులకు అత్యధిక వేతన పెంపును వర్తింపచేశారు. పెరిగిన వేతనాలు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని జాతీయ హైవేలు మౌలిక రంగ అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్హెచ్ఐడీసీఎల్) వెల్లడించింది. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పనిచేసే సిబ్బందికి రిస్క్ అలవెన్స్‌ను 100 నుంచి 170 శాతానికి పెంచినట్టు ఆ సంస్థ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజా ఉత్తర్వుల ప్రకారం డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి సాంకేతికేతర సిబ్బంది వేతనం నెలకు ప్రస్తుతమున్న 16,770 రూపాయల నుంచి 41,440 రూపాయలకు పెరిగింది. ఇక ఢిల్లీలో ఇదే పోస్టులో పనిచేసే వ్యక్తి వేతనం 28,000 రూపాయలు కావడం గమనార్హం. లడఖ్ ప్రాంతంలో పనిచేసే అకౌంటెంట్ వేతనం తాజా పెంపుతో 47,360 రూపాయలకు పెరిగింది. లడఖ్ ప్రాంతంలో పనిచేసే సివిల్ ఇంజనీర్ వేతనం గతంలో 30,000 రూపాయలు కాగా ఇప్పుడది రెట్టింపై 60,000 రూపాలకు చేరింది. సీనియర్ మేనేజర్ వేతనం 55,000 రూపాయల నుంచి 1,23,600కు పెరిగింది. వేతన ప్రయోజనాలతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు రూ పది లక్షల ప్రమాద బీమాను పొందుతారు. వారికి టీఏ, డీఏ, పీఎఫ్ వంటి సదుపాయాలనూ వర్తింపచేస్తారు. చదవండి : ఈ నెల పూర్తి వేతనం -
ఎన్నికల కమిషనర్ల వేతనం రూ.2.50 లక్షలు
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషనర్ల వేతనాలు రెండింతలు పెరిగాయి. సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సమానంగా వారు వేతనాలు అందుకోనున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌తోపాటు ఎన్నికల సంఘంలో ఉన్న మిగతా ఇద్దరు కమిషనర్లూ ప్రస్తుతం ఉన్న నెలకు రూ.90 వేల బదులు రూ.2.50 లక్షలు అందుకోనున్నారు. పెరిగిన వేతనం 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు, ఎన్నికల కమిషనర్లకు కూడా వర్తిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
తమిళ ఎమ్మెల్యేల జీతాలు రెట్టింపు
చెన్నై: రాష్ట్ర ఎమ్మెల్యేల జీతాలు, అలవెన్సుల మొత్తాన్ని తమిళనాడు ప్రభుత్వం దాదాపు రెట్టింపు చేసింది. ప్రస్తుతం వారికి నెలకు అందిస్తున్న రూ. 55 వేలను 90.91 శాతం పెంచి రూ.1,05,000కు చేర్చింది. సీఎం పళణిస్వామి అసెంబ్లీలో ఈమేరకు ప్రకటించారు. ఎమ్మెల్యే ఎస్. పాండి, మాజీ ఎమ్మెల్యేల వినతితో జీతాలను సీఎం భారీగా పెంచారు. ఎమ్మెల్యేలందరి ముఖాల్లో సంతోషం కనిపిస్తోందని స్పీకర్ ధనపాల్ అన్నారు. సీఎం, మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, విపక్ష నేత, ప్రభుత్వ చీఫ్ విప్ల అలవెన్సులు కూడా పెరిగాయి. పెంపు ఈ నెల 1 నుంచి అమల్లోకి వస్తుంది. అప్పులు కట్టలేక, పంటలకు గిట్టుబాటు ధరల్లేక అల్లాడిపోతున్న రాష్ట్ర రైతులు తమ డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని ఢిల్లీలో నెలల తరబడి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల జీతాలను భారీగా పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.