అమ్మకానికి ఉద్యోగాలు
‘పశు’ సంవర్థక శాఖలో సొమ్ములే సొమ్ములు 8 31 పోస్టులకు 28 అమ్మకం
కావల్సినవారైనా కాసులు పడాల్సిందే 8 లక్షల రూపాయల బేరసారాలు
కొత్త కలెక్టర్ దృష్టి సారించాలని నిరుద్యోగుల విజ్ఞప్తి
ఏ సంస్థయినా ఉద్యోగిని వేసుకోవాలంటే నోటిఫికేష¯ŒS ఇస్తుంది. ఉద్యోగం కోసం ఎవరైనా దరఖాస్తుచేస్తే మీరేమి చదువుకున్నారు?మీకున్న అర్హతలేమిటని అడుగుతారు. అర్హతలు పక్కాగా ఉంటే నిబంధనల ప్రకారం ఇంటర్వూ్య నిర్వహించి నియమిస్తారు. కానీ ఉద్యోగుల భర్తీకి ఇవేమీ అవసరం లేదంటున్నారు పశుసం వర్థకశాఖలో అధికారులు. ఆ శాఖలో ఉద్యోగాల భర్తీ అంటే కాసుల పంట పండిస్తోంది. గతంలో 14 పోస్టుల భర్తీలో లక్షలు మెక్కేసిన వారే ఇప్పుడు కూడా అదే పంథాను అనుసరించి ఆదాయం మూటగడుతున్నారు. అలాఅని అవి పర్మినెంట్ ఉద్యోగాలు కూడా కావు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
కాంట్రాక్ట్ ఉద్యోగమైనా ‘లక్ష’ కొట్టండి ‘పోస్టు’ పట్టేయండి జిల్లా పశు సంవర్థక శాఖలో వసూళ్ల దందా నడుస్తోంది. గడచిన ఏడాది కాలంగా ఆ శాఖలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ అనే తేడా లేకండా ఉద్యోగమేదైనా పైసలిస్తే పని కానిచ్చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలే ప్రభుత్వం మూడేళ్లుగా పర్మినెంట్ పోస్టులు భర్తీ చేయడం లేదు. ఫలితంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగమైనా నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో ‘క్యూ’ కడుతున్నారు. నిరుద్యోగుల అవసరాన్ని ఆ శాఖలో కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. ఆ శాఖ పరిధిలో ఉన్న వెటర్నరీ డిస్పెన్సరీలనవెటర్నరీ ఆస్పత్రులుగా మార్పు చేశారు. ఆ ఆస్పత్రులకు పశువైద్యుల స్థానే అసిస్టెంట్ డైరక్టర్ స్థాయికి తీసుకు వచ్చారు. అలా జిల్లాలో గొల్లప్రోలు, కరప, సామర్లకోట, పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని, ఆలమూరు, రావులపాలెం తదితర ఆస్పత్రులు ఈ జాబితాలో ఉన్నాయి. వెటర్నరీ ఆస్పత్రుల నిర్వహణకుగాను జిల్లాకు 31 డీఈఓ (డేటా ఎంట్రీ ఆపరేటర్లు) పోస్టులు మంజూరయ్యాయి. ఈ పోస్టులు తాత్కాలిక ప్రాతిపదికన నియామకం చేపట్టాల్సి ఉంది. నోటిఫికేష¯ŒS పిలిచి అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను ఏజెన్సీ తీసుకుని సంబంధిత శాఖకు అందజేస్తుంది. శాఖాధికారులు వాటిని పరిశీలించి సంయుక్తంగా ఇంటర్వూ్యలు నిర్వహించి ఎంపిక చేస్తారు. అదే సందర్భంలో సంబంధితశాఖ అధికారుల అభీష్టానికి భిన్నంగా ఏమీ చేయలేని పరిస్థితి. అదే వారికి సిరులు కురిపించే కామధేనువుగా మారిందంటున్నారు. పోస్టుల భర్తీకి గ్రీ¯ŒSసిగ్నల్ ఇచ్చి నెల రోజులైనా నోటిఫికేష¯ŒS ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. దీని వెనుక పెద్ద ‘తతంగమే’ నడుస్తోందని కార్యాలయ వర్గాల సమాచారం.
గతంలోనూ ఇంతే...
ఇదే పంథాలో గతంలో 14 పోస్టులు అమ్మేసుకున్నారనే విమర్శలు అప్పట్లో పెద్ద ఎత్తున వచ్చాయి. ఆ పోస్టులను కార్యాలయంలో పనిచేసే వారు తమ కుటుంబ సభ్యులు, బంధువులతో భర్తీ చేశారనే విమర్శలున్నాయి. అయినవారైనా ముడుపులు తీసుకోకుండా పోస్టింగులు మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు ఒకేసారి 31 పోస్టులు, అన్నీ డేటా ఎంట్రీ ఆపరేటర్లే కావడం, జీతం కూడా ఆశాజనకంగా ఉండటంతో పోస్టుల కోసం పోటీపడి మరీ చేజిక్కించుకునేందుకు లక్షలు కుమ్మరించారంటున్నారు. ఇలా వెనుకేసుకున్న ఆ అధికారి 28 మందితో ఒక జాబితాను సిద్ధం చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
జిల్లా కలెక్టర్‌పైనే ఆశలన్నీ..
ప్రభుత్వ శాఖల్లో అవినీతి, అవకతవకలపై కొరడా ఝళిపిస్తున్న కొత్త కలెక్టర్ కార్తికేయ మిశ్రా పశు సంవర్థక శాఖలో పోస్టుల బాగోతంపై దృష్టి పెట్టాలని నిరుద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.
బేరం ఇలా...
మొత్తం 31 పోస్టులకుగాను ఇప్పటికే 28 పోస్టులు లక్షా, రూ.1.25 లక్షలు, రూ.1.50 లక్షలు..ఇలా అవకాశాన్ని బట్టి అమ్మేసు కున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు నెలకు రూ.16 వేలు జీతం. ఇందులో ఏజెన్సీకి రూ.1500లు, íపీఎఫ్ రూ.1500 పోను రూ.13 వేలు చేతికొస్తుంది. పర్మినెంట్ ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం సడలిపోవడంతో ఈ పోస్టులకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ కారణంగానే లక్ష, లక్షన్నర ఇవ్వడానికి కూడా వెనుకాడలేదంటున్నారు. వెటర్నరీ జాయింట్ డైరక్టర్ కార్యాలయంలో ఒక అధికారి తన వద్ద పనిచేసే ఇద్దరు నాలుగో తరగతి ఉద్యోగుల ద్వారా ఈ లంచాల బాగోతాన్ని నడిపించినట్టు తెలియవచ్చింది.