‘సేలం’లో రీపోలింగ్ విజయవంతం
సేలం, న్యూస్‌లైన్: సేలం పార్లమెంట్ నియోజకవర్గంలో ఎడపాడి, కె.కౌండంపట్టి పోలింగ్ కేంద్రాల్లో గురువారం జరిగిన రీపోలింగ్‌లో ఓటర్లు భారీ క్యూలు కట్టి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సేలం పార్లమెంటు నియోజకవర్గంలో గత మే 24వ తేదీ ఎన్నికలు జరిగాయి. ఆనైరోడ్డు కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన 213వ నెంబరు పోలింగ్ కేంద్రం, నామక్కల్ నియోజకవర్గం లో కోట్టపాళయం పోలింగ్ కేంద్రం లో ఈవీఎం యంత్రాల్లో లోపం ఏర్పడింది. ఈ కారణంగా ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు ఆ రెండు నియోజకవర్గాలలో పదో తేదీ రీపోలింగ్ జరిగింది.
ఈ రీపోలింగ్ పలు పార్టీల్లో అనుమానాన్ని ఏర్పరచిన స్థితిలో ఈవీఎంలో లోపం కారణం గా ఎడపాడి నియోజకవర్గం పరిధిలోని క.వడుగపట్టి 254వ నెంబరు పోలింగ్ కేంద్రంలో గురువారం రీపోలింగ్ జరిపేందుకు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రికి రాత్రి ఆ ప్రాంతంలో దండో రా వేసి రీ పోలింగ్‌ను ప్రకటించారు. డీఎంకే, డీఎండీకే, కాంగ్రెస్ పార్టీలు వ్యతిరేకత తెలిపిన స్థితిలో రీపోలింగ్కుగాను పనులను ఎన్నికల కమిషన్ చేపట్టింది. ఆ ప్రకారం ఆ పోలింగ్ కేంద్రంలో కె.వడుగంపట్టి, కచ్చుపల్లి గ్రామాలలో గురువారం ఉదయం 6.30 గంటలకు ఎన్నికల అధికారులు, ఏజెంట్ల సమక్షంలో పోలింగ్ జరిగింది. ఆ తర్వాత 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 6 గంటలకే పోలింగ్ కేం ద్రానికి చేరుకున్న ఓటర్లు క్యూలు కట్టి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కేంద్రంలో పురుషులు 397, మహిళలు 375 లెక్కన మొ త్తం 772 మంది ఓటర్లు ఉన్నారు.