సమ సమాజ్ పార్టీలో ఎన్టీఆర్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తారక్, జై పాత్రలో ఆకట్టుకున్నాడు. నెగెటివ్ షేడ్స్ ఈ క్యారెక్టర్ ఎన్టీఆర్ లోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది.
ఫుల్ మాస్ యాక్షన్ అవతార్ లో కనిపిస్తున్న జూనియర్ ఈ సినిమాలో రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడు. సమ సమాజ్ పార్టీ నాయకుడిగా ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇటీవల బయటకు వచ్చిన వర్కింగ్ స్టిల్స్ లో ఎన్టీఆర్ ఫోటోతో ఉన్న సమ సమాజ్ పార్టీ జెండాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆ జెండాలు కేవలం ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే ఉండటంతో కథ ఉత్తరాధికి సంబంధించినదని భావిస్తున్నారు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 21న రిలీజ్ కు రెడీ అవుతోంది.