Samaikya heat
-
ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్‌కు సమైక్య సెగ
-
ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్‌కు సమైక్య సెగ
నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ రాధాకృష్ణన్‌కు సమైక్య సెగ తగిలింది. పీఎస్ఎల్వీ సీ25 ప్రయోగం విజయవంతమైన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు సమైక్యాంధ్రకు మద్దతుగా జర్నలిస్టులు నినాదాలు చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గళం వినిపించారు. ఊహించని పరిణామంతో రాధాకృష్ణన్ కొంత ఆశ్చర్యానికి లోనయ్యారు. తర్వాత తేరుకుని ప్రసంగాన్ని కొనసాగించారు. తమ ప్రాంత ఆకాంక్షను కేంద్ర మంత్రి వి నారాయణస్వామికి తెలిపేందుకు జర్నలిస్టులు సమైక్య నినాదాలు చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందంలో నారాయణస్వామి సభ్యుడిగా ఉన్నారు. మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వం తరపున నారాయణస్వామి హాజరయ్యారు. మరోవైపు 'తమిళ త్రయం'గా ముద్రపడిన కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, నారాయణస్వామి తమ రాష్ట్రాన్ని విడదీసేందుకు కంకణం కట్టుకున్నారని సీమాంధ్రుల్లో గూడుకట్టున్న ఆవేదన కూడా సీమాంధ్ర విలేకరుల నిరసనకు కారణంగా కనబడుతోంది. ఏదీఏమైనా షార్ వేదికగా సీమాంధ్ర జర్నలిస్టులు సమైక్య గళం వినిపించారు. -
‘చిరు’ బృందానికి సమైక్యసెగ
మెటల్ చిప్స్ విసిరిన విద్యార్థులు.. చిరంజీవి, బొత్సలకు శృంగభంగం రాజాం, న్యూస్‌లైన్: వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర, రాష్ట్ర మంత్రుల బృందానికి సమైక్య సెగ తగిలింది. పలు చోట్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, విద్యార్థులు, రైతుల నుంచి నిరసనలు, అడ్డంకులు ఎదురయ్యాయి. మంగళవారం శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి చిరంజీవి, రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, కోండ్రు మురళీమోహన్ల కాన్వాయ్ రేగిడి మండలానికి వెళుతుండగా మొదట రాజాంలోని మాధవ బజార్ జంక్షన్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్త పీఎంజే బాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. జై సమైక్యాంధ్ర, మంత్రులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని పక్కకు నెట్టేసి కాన్వాయ్‌ని ముందుకు పంపారు. అనంతరం రేగిడి మండలం లచ్చన్నవలస జంక్షన్లో కేంద్రమంత్రి చిరంజీవి ఓపెన్ టాప్ జీపు ఎక్కి రైతులనుద్దేశించి మాట్లాడుతుండగా కొంతమంది యువకులు అడ్డుకొని.. విభజనను వ్యతిరేకించని మంత్రులు వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. దాంతో అక్కడ పర్యటన ముగించి మధ్యాహ్నం 2 గంటల సమయంలో రాజాం తిరిగి వచ్చిన మంత్రుల బృందం కేర్ ఆస్పత్రిని పరిశీలించి బయటకు వస్తున్న సమయంలో పక్కనే ఉన్న జీసీఎస్ఆర్ కళాశాల విద్యార్థులందరూ తరలి వచ్చి జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. మంత్రులు స్పందించకపోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు సమీపంలో ఉన్న మెటల్ చిప్స్(చిన్న చిన్న గులక రాళ్లు)ను కాన్వాయ్‌పైకి విసిరారు. మంత్రులు వాటిని తప్పించుకుని కారులో వెళ్లిపోయారు. -
కేంద్రమంత్రి పల్లంరాజుకు సమైక్య సెగ
-
సీమాంధ్ర నేతలపై జనాగ్రహం
సాక్షి నెట్వర్క్: రాష్ర్ట విభజనను అడ్డుకోకుండా పదవులు పట్టుకుని వేలాడుతున్న సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు శుక్రవారం సమైక్య సెగ తగిలింది. పలు జిల్లాల్లో మంత్రుల ఇళ్లను, పార్టీ కార్యాలయాలను ముట్టడించారు. కర్నూలులో మంత్రి టీజీ వెంకటేష్‌కి చెందిన హోటల్ మౌర్య ఇన్‌పై దాడి చేశారు. కేంద్రమంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి నివాసంపై దాడికి యత్నించిన వారిపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. అనంతరం కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేశారు. బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు. ఆత్మకూరులో మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి నివాసం ఎదుట విద్యార్థులు దీక్ష చేశారు. వైఎస్సార్ జిల్లా కడపలో డీసీసీ కార్యాలయంపై విద్యార్థులు రాళ్లతో దాడికి దిగారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. తిరుపతి ఎంపీ చింతామోహన్ ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విశాఖజిల్లా నర్సీపట్నం,పాడేరులో మంత్రి బాలరాజు ఇంటిని ముట్టడించారు. చోడవరంలో ఎమ్మెల్యే కన్నబాబు కారును అడ్డుకున్నారు. కాకినాడలో కేంద్ర మంత్రి పళ్లంరాజు ఇంటిని ముట్టడించారు. మలికిపురంలోని కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేసి ఫ్లెక్సీలు ధ్వంసం చేసి, వాటికి నిప్పు పెట్టారు. రాజమండ్రిలో అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్ ఇంటిని, రంపచోడవరంలో ఎంపీ రత్నాబాయి, ఎమ్మెల్యే కాశీ విశ్వనాథ్‌ల ఇళ్లను ముట్టడించారు. జేఎన్టీయూకే విద్యార్థులు కాకినాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. కొత్తపేటలో కాంగ్రెస్ కార్యాలయం గోడలు బద్దలు కొట్టి, లోపలకు వెళ్లి విధ్వంసం సృష్టించారు. కార్యాలయానికి నిప్పు పెట్టే యత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. శ్రీకాకుళంలో కేంద్రమంత్రి కృపారాణి క్యాంప్ కార్యాలయాన్ని, పాతపట్నంలో మంత్రి శత్రుచర్ల క్యాంప్ ఆఫీసును ఉద్యమకారులు ముట్టడించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంపై రాళ్లు రువ్వి ఆద్దాలు ధ్వంసంచేశారు. ప్రకాశంజిల్లా ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. నెల్లూరు జిల్లా రాపూరులో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇంటిని, గుంటూరులో మంత్రి కన్నా ఇంటిని, ముట్టడించేందుకు ప్రయత్నించిన ఎన్జీవోలను పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై సమైక్యవాదులు దాడి చేశారు. కృషా ్ణజిల్లా విజయవాడలో నగర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్నభవన్పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు.