Samaikyandhra Protest
-
ఆ పాపం ప్రజలదే: అశోక్‌బాబు
న్యూఢిల్లీ: సోనియా గాంధీ తన పుట్టినరోజున తెలంగాణ బిల్లును ప్రకటించిందని, ఈ రోజు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పార్లమెంట్లో విభజన బిల్లుపై చర్చకు తావిస్తోందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. పుట్టినరోజుకు బహుమతులు ఇవ్వాలనుకుంటే ప్రాజెక్టులు ఇవ్వండి, రాష్ట్రాలను కాదు అని ఆయన డిమాండ్ చేశారు. రాంలీలా మైదానంలో ప్రారంభమైన ఏపీఎన్జీవోల మహాధర్నాలో అశోక్‌బాబు ప్రసంగించారు. విభజన కోరుకున్న నేతలను గెలిపిస్తే ఆ పాపం ప్రజలదే అవుతుందని వ్యాఖ్యానించారు. విభజనకు బీజేపీ, కాంగ్రెస్‌లు కలిసి కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రాలను ముక్కలు చేసుకుంటూ పోతే దేశం నాశసనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగువాళ్ల సత్తా ఢిల్లీకి చాటాలని అశోక్‌బాబు పిలుపునిచ్చారు. -
సమైక్య గర్జన... భద్రత గుప్పిట్టో హస్తిన
న్యూఢిల్లీ: సమైక్యాంధ్ర ఆందోళనల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భారీ స్థాయిలో పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా పలు మెట్రోస్టేషన్ల మూసివేశారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, కేంద్రమంత్రుల ఇళ్ల వద్ద పోలీస్ బందోబస్తు పటిష్టం చేశారు. పార్లమెంట్‌కు వెళ్లే రహదారుల్లో రాపిడ్ యాక్షన్ బలగాలను పెద్ద సంఖ్యలో మొహరించారు. ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాటర్‌కెనాన్, వజ్ర వాహనాలు అందుబాటులో ఉంచారు. పార్లమెంట్ వైపునకు సమైక్యవాదులు వచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో భద్రత కట్టుదిట్టం చేశారు. -
'అల్లూరి గడ్డపై జన్మించిన మూర్ఖుడు చిరంజీవి'
న్యూఢిల్లీ: మంత్రి పదవిని కాపాడుకోవడానికి చిరంజీవి సమైక్యాంధ్రను తాకట్టు పెట్టాలరని సీమాంధ్ర విద్యార్థి జేఏసీ నేతలు ఆరోపించారు. రెండు వారాల మంత్రి పదవి కోసం ఆయన పాకులాడుతున్నారని మండిపడ్డారు. నీకు పర్యాటకు శాఖ అవసరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాకు రూ. 500 కోట్లకు అమ్ముడు పోయారని ఆరోపించారు. ఇంకా ఎన్ని కోట్లు సందిస్తావు అంటూ ఆవేశంగా ప్రశ్నించారు. అల్లూరి సీతారామరాజు లాంటి పోరాట యోధుడు జన్మించిన గడ్డపై జన్మించిన మూర్ఖుడివి అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పది కోట్ల తెలుగువారికి ద్రోహం చేసిన ద్రోహి అంటూ విరుచుకుపడ్డారు. సొంత జిల్లాలో అడుగు పెడితే ప్రజలు నీ కాళ్లు విరగ్గొడతారంటూ విమర్శించారు. కాగా, ఓ యువకుడు ఒంటిపై కిరోసిన పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
కనిగిరిలో వైయస్ఆర్సిపి దీక్షకు అనూహ్య స్పందన
-
జోరుగా సాగుతున్న సమైక్య ఉద్యమం
-
47వరోజు కొనసాగుతున్న సమైక్యాంధ్ర ఆందోళనలు
-
సమైక్యాంద్రే తమ లక్ష్యమంటూ నినాదాలు
-
పాలకొల్లులో హోరెత్తిన సమైక్య నినాదం
-
మంత్రి శైలజానాథ్‌కు చేదు అనుభవం.
-
మంత్రి శైలజానాథ్‌కు చేదు అనుభవం
-
మంత్రి శైలజానాథ్‌కు చేదు అనుభవం
సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఎస్.శైలజానాథ్‌కు చేదు అనుభవం ఎదురయింది. అనంతపురంలో సమైక్య ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన శైలజానాథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. శైలజానాథ్ గోబ్యాక్ అంటూ సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా కొనసాగించడం మినహా మరే ప్రతిపాదనను అంగీకరించేది లేదని ఆయన ముందునుంచి చెబుతూ వస్తున్నారు. మరోవైపు సమైక్య ఉద్యమాలు అనంతపురం జిల్లాలో 28వ కోజుకు చేరాయి. అనంతపురంలో ఉద్యోగ సంఘాల 48 గంటల బంద్ కొనసాగుతోంది. మంత్రి శైలజానాథ్ కార్యక్రమాలను బహిష్కరించాలని ఉద్యోగసంఘాల జేఏసీ కన్వీనర్ హేమసాగర్ పిలుపునిచ్చారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఎస్కేయూలో సీమాంధ్ర విశ్వవిద్యాలయాల జేఏసీ నేతలు సమావేశమయ్యారు. -
విభజనకు నిరసనగా విజయవాడలో డాక్టర్ల ప్రదర్శన
-
నెల్లూరులో సమైక్యాంధ్ర ఉద్యమం ఉదృతం