సమాజ్ వాదీ పార్టీకి షాక్
లక్నో: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్ లో అధికార సమాజ్ వాదీ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు ఆదివారం బీజేపీలో చేరారు. మీరట్ జిల్లా పంచాయతీ మాజీ అధ్యక్షుడు మనీందర్ పాల్ సింగ్, యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రాహుల్ యాదవ్ తమ మద్దతుదారులతో కలిసి కాషాయ పార్టీలోకి వచ్చారు.
ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ నాయకులు బీజేపీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.