Samanvay
-
కాలానికి అనుగుణంగా విద్యాబోధన ఉండాలి: సరితా జాదవ్
బంజారాహిల్స్: మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక విద్యావిధానాలతో పాఠశాలలను ఎలా సిద్దం చేయాలనే అంశంపై నిర్వాహకులు దృష్టి సారించాలని యునెస్కోకు చెందిన నేషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సరితా జాదవ్ సూచించారు. ’హైదరాబాద్ సహోదయ స్కూల్స్ కాంప్లెక్స్ (హెచ్ఎస్ఎస్సీ) ఆధ్వర్యంలో ’సమన్వయ 2024’ పేరుతో జాతీయ సదస్సును బంజారాహిల్స్లో నిర్వహించారు.తెలంగాణ రాష్ట్రంలోని 281 సీబీఎస్ఈ స్కూళ్లకు చెందిన ప్రిన్స్పల్స్. అద్యాపకులు, విద్యార్థులు పాల్గొన్న ఈ సదస్సులో సరికొత్త విద్యావిధానాలు, మారుతున్న పరిస్థితులు తదితర అంశాలపై కూలంకశంగా చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యునెస్కోకు చెందిన నేషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సరితా జాదవ్ మాట్లాడుతూ..గ్లోబల్ ఎడ్యుకేషన్ విధానానికి అనుగుణంగా విద్యాబోధనను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం స్కూళ్లలో ఏర్పాటు చేసుకోవాల్సిన మౌళిక సదుపాయాలు, పరిశోధనలపై దృష్టి పెట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్నారు. భవిష్యత్తులో విద్యావ్యవస్థలో రానున్న మార్పులకు సన్నద్ధం చేయడంలో ఇలాంటి సదస్సులు ఎంతో దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ముంబయి ఐఐటీ ప్రొఫెసర్ అజంతా సేన్, ఐఐఎమ్ అహ్మదాబాద్ ప్రొఫెసర్ కాథన్ దుష్యంత్ శుక్లా, హెచ్ఎస్ఎస్ సీ చైర్మన్ అమీర్ ఖాన్, వైస్ చైర్పర్సన్ డా. ఎబెనీజర్, సెక్రెటరీ రోజా పాల్,డా. సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
'కృష్ణమూర్తిని కలిశాకే డ్రగ్స్ నుంచి బయటపడ్డాను'
నా జీవితంలో భగవంతుడికి పెద్దగా ప్రాధాన్యత లేదు అని బాలీవుడ్ అగ్ర దర్శకుడు మహేశ్ భట్ అన్నారు. ఇండియన్ లాంగ్వేజ్ ఫెస్టివల్ 'సమన్వయ్' లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. జీవితంలో కనీస అవసరాలు కూడా తీరకపోవడంతో దేవుడిపై అసంతృప్తి పెరిగిపోయింది అని వ్యాఖ్యలు చేశారు. తన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి జీవితాన్ని ఓ సారి గుర్తు చేసుకుంటూ.. చిత్రాల్లో నటించడానికి ముందు డ్రగ్స్, ఎల్ఎస్ డీలకు అలవాటు పడ్టాను. అయితే ఉప్పలూరి గోపాల(యూజీ) కృష్ణమూర్తిని కలిశాక ఒక్కసారి జీవితమే మారిపోయింది. అప్పుడే జీవితం, సమాజం విలువ తెలుసుకున్నాను. తమ కుమారుడి పోగొట్టుకున్న ఓ దంపతులను చూశాక జీవిత సారాంశాన్ని తెలుసుకున్నాను. అప్పడే నాకు పునర్మన్మ సిద్దాంతం గురించి తెలిసిందని ఆయన అన్నారు. 'జక్మ్' చిత్ర నిర్మాణ సందర్భంగా తాను ఎన్నో కష్టాలు అనుభవించాను. అనేక రాజకీయ ఒత్తిడులను ఎదుర్కొన్నాను. రాజకీయ నేతల నుంచి క్లియరెన్స్ వస్తే తప్ప సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేము అని అధికారుల చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా తెలిపారు. చిన్నతనం నుంచే దేవుడంటే నమ్మకం లేదు అని తెలిపాడు. నా తండ్రి ఎక్కువ కాలం బ్రతకాలని...నాతో ఉండాలని కోరుకున్నాను. అయితే నేను అనుకున్నట్టు జరగకపోవడంతో దేవుడిపై నమ్మకం కోల్పోయాను. నా సన్నిహితుల్లో ఎక్కువ మందికి దేవుడిపై నమ్మకం ఉన్నా.. నేను ఎప్పడూ వారి మనోభావాలకు వ్యతిరేకంగా ప్రవర్తించలేదు అని అన్నారు.