samineni viswanatham
-
సామినేని ఉదయభానుకు వైఎస్ జగన్ పరామర్శ
జగ్గయ్యపేట : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభానును పరామర్శించారు. సామినేని ఉదయభాను తండ్రి సామినేని విశ్వనాథం అస్వస్థతతో ఇవాళ ఉదయం మృతి చెందారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పంచాయతీ కి సామినేని విశ్వనాధం ఇరవై రెండు సంవత్సరాల పాటు సర్పంచ్ గా పనిచేశారు. మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా కూడా పని చేశారు. జగ్గయ్యపేట కు ఆయన హయాంలోనే రక్షిత మంచినీటి పథకం, విద్యా, వైద్యశాలలను అందుబాటులోకి తీసుకువచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో విశ్వనాధంకు అత్యంత సాన్నిహిత్యం వుంది. ఆయన అకాల మరణ వార్త తెలియగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ హుటాహుటిన జగ్గయ్యపేటకు చేరుకుని ఉదయభాను కుటుంబాన్ని పరామర్శించారు. విశ్వనాధం మృతదేహానికి నివాళి అర్పించారు. వైఎస్ జగన్ తో పాటు పార్టీ నేతలు కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే రక్షణనిధి, జోగి రమేష్, సింహాద్రి రమేష్, గౌతం రెడ్డి, తోట శ్రీనివాస్, ఉప్పాల రాము తదితరులు విశ్వనాథం మృతదేహానికి నివాళి అర్పించారు. -
పత్రికల పాత్ర గణనీయం
వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు సామినేని విశ్వనాథం జగ్గయ్యపేట అర్బన్ : సమాజాభివృద్ధిలో పత్రికలపాత్ర ఎంతో గణనీయమైనదని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు సామినేని విశ్వనాథం అన్నారు. బుధవారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను స్వగృహంలో పట్టణంలో నూతనంగా ప్రారంభించిన ఎదురుదాడి వారపత్రిక ప్రచురించిన మున్సిపల్ ప్రత్యేక అనుబంధాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలకు,ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉండే పత్రికలు నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురిస్తూ అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా ప్రజాప్రతినిదులు, అధికారులు పనిచేసేలా మరింత చొరవకు పత్రికలు కృషిచేయాలన్నారు. ఎదురుదాడి వారపత్రిక సంపాదకులు మాశెట్టి రమేష్‌బాబును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మున్సిపల్ చైర్మన్తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ పారదర్శకమైన పాలనను అందించేందుకు పత్రికలు తమవంతు సహాయసహాకారాలు అందించాలని కోరారు. వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ మదార్‌సాహెబ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ముత్యాల చలం, వైస్ చైర్మన్ మహ్మద్ అక్బర్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు చింకా వీరాంజనేయులు, జె.ఉదయభాస్కర్, శివాలయం దేవస్థాన మాజీ చైర్మన్ ఎం.కేశవరావు, నాయకులు శేషం ప్రసాద్, వేముల రామకృష్ణ, రఫీ, పలు వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీకే బ్రహ్మరథం
జగ్గయ్యపేట అర్బన్, న్యూస్‌లైన్ : ఇటీవల జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసి ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్ సీపీకే బ్రహ్మరథం పట్టారని, రానున్న ఎన్నికల్లోనూ ఇదే పునరావృతమవుతుందని ఆ పార్టీ సీనియర్ నేత సామినేని విశ్వనాథం స్పష్టం చేశారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే నెలలో వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులను నిశ్చేష్టులను చేస్తూ అవాక్కయ్యే విధంగా ఫలితాలు రాబోతున్నాయన్నారు.గ్రామాల్లో ఎక్కువ శాతం పోలైన ఓట్ల సరళిని బట్టి ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశారని స్పష్టమవుతుందన్నారు. నియోజకవర్గంలో ఉన్న మొత్తం 60 ఎంపీటీసీ స్థానాల్లో 40 పైచిలుకు స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు విజయఢంకా మోగిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే మూడు ఎంపీపీలు, జెడ్పీటీసీలు కైవసం చేసుకుంటామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 27 వార్డులకు గానూ 20కు పైగా వార్డుల్లో తమ పార్టీ అభ్యర్థులు విజయవిహారం చేస్తారని చెప్పారు. పార్జీ జిల్లా అధికార ప్రతినిధి తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల ఫలితాల్లో తమ పార్టీ ఆధిక్యత సాధిస్తుందని స్పష్టంగా కనపడుతుందన్నారు. రేపటి అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా ఉన్న ఈ ఎన్నికల ఓటింగ్ సరళి వలన పార్టీ శ్రేణులు రెట్టించిన సమరోత్సాహంతో ఉదయభానును అఖండమెజార్టీతో గెలిపించటానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల చలం మాట్లాడుతూ రాష్ట్రాన్ని నిలువునా చీల్చిన కాంగ్రెస్, తెలుగుదేశం, బీజే పీలు రాష్ట్ర చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని వాళ్లకు బుద్ధిచె ప్పటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ పట్టణ కన్వీనర్ మదార్‌సాహెబ్ మాట్లాడుతూ చంద్రబాబు బీజే పీతో పొత్తుపెట్టుకుని తన నెత్తిన తానే నిప్పులు పోసుకుంటున్నాడని, ముస్లింలకు మరలా అన్యాయం చేయనని, బీజేపీతో పొత్తుపెట్టుకోనని ప్రగల్భాలు పలికి... నేడు మాట మార్చిన పచ్చి అవకాశవాదని, అయనకు వచ్చే ఎన్నికల్లో ముస్లింలు తగిన మర్యాద చేసేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు చింకావీరంజనేయులు, జె. ఉదయబాస్కర్, నంబూరి రవి, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్, కొలగాని వెంకయ్య, పొన్నా రామ్మోహన్, పట్టణ యూత్‌కన్వీనర్ రాంబాబు, సీనియర్ నాయకులు గంటా హనుమంతరావు, తుమ్మేపల్లి గోపాలరావు, మాదిరాజు కేశవరావు, మైనార్టీ నాయకులు అమీర్భీ, ఖాజామొహిద్దీన్, జాన్‌బాషా పాల్గొన్నారు.