నువులేక నేను ఎందుకని..
•నిన్న విద్యుదాఘాతంతో భర్త మృతి
•నేడు ఆత్మహత్యకు యత్నించిన భార్య
•ఆరోగ్య పరిస్థితి విషమం
•ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైనం
ముత్తారం : ఏడడుగుల బంధంతో ఏకమై.. నిండు నూరేళ్లపాటు కష్టసుఖాల్లో పాలుపంచుకునే భర్త విద్యుదాఘాతంతో మృతి చెందడంతో తట్టుకోలేని భార్య తానూ తనువు చాలించాలని నిర్ణరుుంచింది. ఈ మేరకు పురుగులమందు తాగి అపస్మారక స్థితికి వెళ్లింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. ఈ సంఘటన ముత్తారం మండలం ఖమ్మంపల్లిలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా వెంకటాపూర్ మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన బీస్కుల సారక్క, సమ్మయ్య దంపతులు.
వీరి కూతురు సరిత(24)ను ముత్తారం మండలం ఖమ్మంపల్లికి చెందిన సమ్మయ్యకు ఇచ్చి తొమ్మిది నెలల క్రితం వివాహం జరిపించారు. కొన్నినెలలకే ఆ దంపతులను విధి చిన్నచూపు చూసింది. నీటి అవసరాలకు వినియోగించే విద్యుత్ మోటారు మరమ్మతు చేస్తూ సమ్మయ్య బుధవారం విద్యుదాఘాతంతో దుర్మరణం పాలయ్యూడు. భర్త తనను విడిచి వెళ్లడాన్ని జీర్ణించుకోని సరిత.. తీవ్రమనస్తాపం చెందింది. గురువారం వేకువజామున కుటుంబ సభ్యులు నిద్రలోకి జారుకున్నాక ఇంట్లోని క్రిమిసంహారకమందు తాగింది. మెలకు వచ్చిన కుటుంబ సభ్యులు గమనించేలోగా అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే ఆమెను మంథని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేరుుస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పినట్లు బంధువులు తెలిపారు.