sammi Reddy
-
టీడీపీ నేత సోమిరెడ్డికి మంత్రి కాకాణి చురకలు..
సాక్షి, నెల్లూరు: పేదల జీవన ప్రమాణాలను సీఎం జగన్ మెరుగుపరిచారని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. మనుబోలు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నూతన ఆరోగ్యశ్రీ కార్డులు, విద్యార్థులకు ట్యాబ్‌లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మిచాంగ్ తుపాను వచ్చినప్పుడు సోమిరెడ్డి ఇంట్లో పడుకున్నాడని, ఇప్పుడు నిద్రలేచి నష్టపరిహారం తక్కువ ఇచ్చారని మాట్లాడటం హాస్యాస్పదమని దుయ్యబట్టారు. ‘‘టీడీపీ హయాంలో ఎంత నష్టపరిహారం ఇచ్చారో మా దగ్గర జీవోలున్నాయి. ప్రజలన్నీ గమనిస్తున్నారు. సోమిరెడ్డిని హిజ్రాలు తన్నేసరికి ఆయన మైండ్ పాడైపోయింది’’ అంటూ మంత్రి కాకాణి ఎద్దేవా చేశారు. ఇదీ చదవండి: కులం పేరిట బాబు విష రాజకీయం -
పత్తిగింజలు మొలకెత్తకపోవడంతో.. ఆగిన రైతు గుండె
పత్తిగింజలు మొలకెత్తలేదనే మనోవేదనతో రైతు గుండె ఆగిన ఘటన వరంగల్ జిల్లా ఆత్మకూరులో ఆదివారం జరిగింది.మండల కేంద్రానికి చెందిన బుచ్చికొండ సమ్మిరెడ్డి(56) తనకున్న మూడెకరాల్లో వారం రోజుల క్రితం పత్తి విత్తనాలు వేశాడు. అప్పటి నుంచి వర్షాలు కురవకపోవడంతో 10 శాతం కూడా మొలకెత్తలేదు. వ్యవసాయం కోసం చేసిన అప్పు ఇప్పటికే రూ. 2 లక్షలు ఉన్నాయి. ఈ ఏడాది బ్యాంకుల్లో రుణం కోసం ప్రయత్నించి విఫలమయ్యూడు. ఇలా ఆవేదనకు గురవుతూ ఆదివారం ఉదయం భార్య వనమ్మతో కలిసి చేనుకు వెళ్లాడు. గింజలు మొలకెత్తక పోవడంతో ఆవేదనతో అలాగే కుప్పకూలిపోయూడు. పొరుగున ఉన్న రైతులు 108ను పిలిపించేలోపే మృతిచెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.