
సాక్షి, నెల్లూరు: పేదల జీవన ప్రమాణాలను సీఎం జగన్ మెరుగుపరిచారని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. మనుబోలు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నూతన ఆరోగ్యశ్రీ కార్డులు, విద్యార్థులకు ట్యాబ్‌లను మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మిచాంగ్ తుపాను వచ్చినప్పుడు సోమిరెడ్డి ఇంట్లో పడుకున్నాడని, ఇప్పుడు నిద్రలేచి నష్టపరిహారం తక్కువ ఇచ్చారని మాట్లాడటం హాస్యాస్పదమని దుయ్యబట్టారు.
‘‘టీడీపీ హయాంలో ఎంత నష్టపరిహారం ఇచ్చారో మా దగ్గర జీవోలున్నాయి. ప్రజలన్నీ గమనిస్తున్నారు. సోమిరెడ్డిని హిజ్రాలు తన్నేసరికి ఆయన మైండ్ పాడైపోయింది’’ అంటూ మంత్రి కాకాణి ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: కులం పేరిట బాబు విష రాజకీయం