పత్తిగింజలు మొలకెత్తకపోవడంతో.. ఆగిన రైతు గుండె | The farmer died of cardiac arrest | Sakshi
Sakshi News home page

పత్తిగింజలు మొలకెత్తకపోవడంతో.. ఆగిన రైతు గుండె

Published Sun, Jun 19 2016 8:12 PM | Last Updated on Mon, Sep 4 2017 2:53 AM

The farmer died of cardiac arrest

పత్తిగింజలు మొలకెత్తలేదనే మనోవేదనతో రైతు గుండె ఆగిన ఘటన వరంగల్ జిల్లా ఆత్మకూరులో ఆదివారం జరిగింది.మండల కేంద్రానికి చెందిన బుచ్చికొండ సమ్మిరెడ్డి(56) తనకున్న మూడెకరాల్లో వారం రోజుల క్రితం పత్తి విత్తనాలు వేశాడు.

 

అప్పటి నుంచి వర్షాలు కురవకపోవడంతో 10 శాతం కూడా మొలకెత్తలేదు. వ్యవసాయం కోసం చేసిన అప్పు ఇప్పటికే రూ. 2 లక్షలు ఉన్నాయి. ఈ ఏడాది బ్యాంకుల్లో రుణం కోసం ప్రయత్నించి విఫలమయ్యూడు. ఇలా ఆవేదనకు గురవుతూ ఆదివారం ఉదయం భార్య వనమ్మతో కలిసి చేనుకు వెళ్లాడు. గింజలు మొలకెత్తక పోవడంతో ఆవేదనతో అలాగే కుప్పకూలిపోయూడు. పొరుగున ఉన్న రైతులు 108ను పిలిపించేలోపే మృతిచెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement