శాంసంగ్ ఎస్8, ఎస్8+ భారత్‌లో విడుదల
శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ అభిమానులకు శుభవార్త. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ఎస్8ప్లస్ ఫోన్లు భారత్‌లో లాంచ్ కానున్నాయి. ఏప్రిల్ 19న ఇండియాలో విడుదల చేస్తున్నట్లు ట్విట్టర్లో తెలిపింది. దీని ధర సుమారు రూ.59,999 ఉండవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. గతేడాది విడుదల చేసిన గెలాక్సీ నోట్7 బ్యాటరీ సమస్యలతో ఇబ్బందులపాలైన కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ ఎస్8, ఎస్8+ లను ప్రతిష్టాత్మకంగా రూపొందించింది.
ఎస్8, ఎస్8+ ప్రత్యేకతలు
♦ ర్యామ్: 4జీబీ
♦ ఇంటర్నల్ మెమోరీ: 64జీబీ, ఎస్డీకార్డుతో 256 జీబీ వరకూ పెంచుకోవచ్చు.
♦ కెమెరా: ఫ్రంట్ 8 మెగా ఫిక్సల్, రేర్ 12 మెగా ఫిక్సల్
♦ బ్యాటరీ: 3000 ఎంఏఎచ్ ఎస్8+లో బ్యాటరీ 3500 ఎంఏఎచ్
♦ స్ర్కీన్: ఎస్8 5.8 అంగుళాలు, ఎస్8+ 6.2 అంగుళాలు. గొరిళ్లా గ్లాస్5ను అమర్చారు.
అధికారిక వెబ్సైట్ సమాచారం ప్రకారం రెండిటిలో ఐరిష్ స్కానర్, ఫేస్ రికగ్నైస్ టెక్నాలజీని నిక్షప్తం చేశారు. వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌గా రూపొందించారు.