చౌటుప్పల్‌లో భారీ అగ్ని ప్రమాదం
చౌటుప్పల్: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని శాంసంగ్ షోరూమ్‌లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మధ్యాహ్న సమయంలో షాపు వెనుక భాగంలో చెత్తను తగలబెట్టెందుకు నిప్పు పెట్టగా ఆ మంటలు పక్కనే ఆనుకుని ఉన్న శాంసంగ్ షోరూంకు అంటుకున్నాయి. రెప్పపాటు కాలంలో మొదటి అంతస్తుకు వ్యాపించడంతో షాపులో ఉన్న విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి.
మంటలు అంటుకున్న సమయంలో సుమారు వందకుపైగా టీవీలు, శాంసంగ్ బ్రాండ్‌కు పలు రకాల వస్తువులు షోరూంలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం కలిగినట్టు సమాచారం.