'అవును నేను దొంగనే' అంటున్న మేయర్
రాజకీయ నాయకులు తప్పును ఒప్పుకోవడం చాలా అరుదు. కానీ ఓ మేయరు గారు 'అవును. నేను దొంగనే.' అని బాహాటంగా ఒప్పేసుకుంటున్నారు. అంతే కాదు 'నేనొక్కడినే కాదు. అందరికీ డబ్బంటే ఇష్టమే'అంటున్నారాయన.
మెక్సికో లోని సాన్ బ్లాస్ నగరం మేయర్ హిలేరియో రామిరెజ్ 'నేను ప్రభుత్వ సొమ్మును తీసుకున్న మాట వాస్తవం. అయితే చాలా కొద్దిగానే తీసుకున్నాను.. అయితే నేను ఈ చేతితో తీసుకుని, ఇంకో చేతితో పేదలను పంచాను' అని ఒప్పుకుంటున్నారు. ఈ విడియోను ఆయన ఏకంగా యూట్యూబులో కూడా పెట్టారు.
సదరు రామిరెజ్ సాన్ బ్లాస్ నగర మేయర్ గా ఉన్న కాలంలో ఒకటిన్నర మిలియన్ డాలర్లను స్వాహా చేశారని విపక్షాలు, ప్రజల ఆరోపణ. అయితే ప్రజాసేవంటే నాకు చాలా ఇష్టం అని సెలవిస్తున్నారు రామిరెజ్ గారు.