sandal
-
బైడెన్‌కు దశ దానం.. దాని ప్రాముఖ్యత తెలుసా?
అమెరికా పర్యటనలో భాగంగా.. వైట్‌హౌజ్ విందుకు హాజరైన ప్రధాని మోదీ.. సతీసమేతంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌తో పరస్పరం కానుకలు ఇచ్చి గౌరవించుకున్నారు. మోదీ టేస్ట్‌కి తగ్గట్లే కెమెరాలను బైడెన్ ఇవ్వగా.. భారత సంప్రదాయానికి తగ్గట్లు ఉపనిషత్తుల కాపీని, ఆయన సతీమణి జిల్ బైడెన్‌కు గ్రీన్ డైమండ్‌కు బహుకరించారు. అదే సయమంలో మోదీ బహుకరించిన గంధపు చెక్కతో కూడిన పెట్టె ఒకటి బైడెన్లో ఆసక్తిని రేకెత్తించింది. ఆ పెట్టెను.. అందులో ఉన్న దశ దానం ప్రశస్తిని స్వయంగా మోదీనే బైడెన్‌కు వివరించారు. హిందూ జీవన విధానంలో ‘‘దశ దానం’’ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న అంశం. హిందూ ఆచారాలకు ప్రతీక కూడా. ► ప్రాచీన భారతీయ గ్రంథం కృష్ణ యజుర్వేదంలో వైఖానస గృహ్య సూత్రం ప్రకారం.. ఒక వ్యక్తి దాదాపు 29,530 రోజులు.. మరోలా చెప్పాలంటే ఎనభై సంవత్సరాల ఎనిమిది నెలల వయస్సును పూర్తి చేసినప్పుడు ‘దృష్ట సహస్రచంద్రుడు’ అంటే వెయ్యి పౌర్ణమిలను చూసిన వ్యక్తి అవుతాడు. ► హిందూ జీవన విధానంలో.. ప్రతీ వ్యక్తికి ఇదొక ముఖ్యమైన మైలురాయి లాంటిది. జీవితంలో ఆ దశ పూర్తైన వాళ్లను.. వాళ్ల పరిపూర్ణ అనుభవానికి గుర్తుగా గౌరవించబడతారు. శాస్త్రోక్తంగా.. వినాయక పూజలతో మొదలవుతుంది. పూర్ణహారతి, శతాభిషేకం.. చివరకు సహస్ర చంద్ర దర్శనంతో ముగుస్తుంది. ► సహస్ర పూర్ణ చంద్రోదయం సమయంలో.. దశ దానం చేయడం ఆనవాయితీ. గోదానం, భూదానం, తిలదానం(నువ్వులు) , హిరణ్యదానం(బంగారం), ఆజ్యదానం(నెయ్యిగానీ.. వెన్నగానీ), ధాన్యదానం, వస్త్రదానం, గుడ(బెల్లం) దానం, రౌప్యదానం(వెండి), లవణదానం(ఉప్పు) చేస్తారు. ► బైడెన్ కిందటి ఏడాది నవంబర్‌తోనే 80 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అందుకే ఆయనకు మోదీ దశ దానం సమర్పించారు. ► జైపూర్(రాజస్థాన్)కు చెందిన ఓ కళాకారుడు ఆ ప్రత్యేకమైన చందనపు పెట్టెను రూపొందించారు. అందుకు కావాల్సిన చెక్కలను మైసూర్ నుంచి తెప్పించారు. తరతరాలుగా ఇలా గంధపు పెట్టెల తయారీ రాజస్థాన్‌లో కుల వృత్తిగా నడుస్తోంది. ► బాక్స్‌లో గణేషుడి ప్రతిమ ఉంది. దీనిని కోల్‌కతాకు చెందిన ఓ స్వర్ణకారుడు తయారు చేశారు. ఆయన కుటుంబం ఐదు తరాలుగా విగ్రహాలను తయారు చేస్తోంది. ► ప్రతిమతో పాటు ప్రమిదను కూడా ఉంచారు. ఇది కూడా కోల్‌కతాకు చెందిన స్వర్ణకారుల కుటుంబమే చేసింది. ► ఉత్తర ప్రదేశ్‌కు చెందిన కళాకారులు రూపొందించిన రాగి తామ్ర పాత్ర.. దాని మీద శ్లోకం చెక్కి ఉంది. The box gifted by PM Modi to US President Joe Biden contains ten donations- a delicately handcrafted silver coconut by the skilled artisans of West Bengal is offered in place of a Cow for Gaudaan (donation of cow). A fragrant piece of sandalwood sourced from Mysore, Karnataka… pic.twitter.com/I8ujKCoiK1 — ANI (@ANI) June 22, 2023 ఇక అసలైన దశ దానం.. వెండి పెట్టెల్లో ఉంది. ఆవు స్థానంలో బుల్లి వెండి కొబ్బరికాయ ప్రతిమను, భూదానం స్థానంలో మైసూర్ నుంచి తెప్పించిన సువాసనభరితమైన గంధపు చెక్క ముక్కను, తమిళనాడు నుంచి తెప్పించిన నువ్వులను, హిరణ్యదానం కోసం రాజస్థౠన్ నుంచి తెప్పించిన 24 క్యారెట్ల బంగారపు కాయిన్‌ను, పంజాబ్ నుంచి నెయ్యిని, జార్ఖండ్ నుంచి తెప్పించిన గుడ్డ ముక్కను, ధాన్యదానంలో భాగంగా యూపీ నుంచి బియ్యం, మహారాష్ట్ర నుంచి బెల్లం ముక్కను, రాజస్థాన్ నుంచి వెండి నాణేన్ని, అలాగే గుజరాత్ నుంచి తెప్పించిన ఉప్పును లవణ దానంలో భాగంగా.. చిన్న వెండి పెట్టెల్లో ఉంచి బైడెన్‌కు మోదీ దశ దానంలో భాగంగా అందించారు. The box contains the idol of Ganesha, a Hindu deity considered as the destroyer of obstacles and the one who is worshipped first among all gods. The idol has been handcrafted by a family of fifth-generation silversmiths from Kolkata. The box also contains A diya (oil lamp) that… pic.twitter.com/23eV5ZsWfC — ANI (@ANI) June 22, 2023 -
వైరల్ వీడియో: చెప్పు తీసుకొని పాము పరార్
-
మధ్యప్రదేశ్ సీఎంపైకి చెప్పు?
సీధీ: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్‌పై చెప్పువిసిరినట్లుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రమంతా ‘జన ఆశీర్వాద యాత్ర’ చేస్తున్న చౌహాన్ ఆది, సోమవారాల్లో యూపీ సరిహద్దుల్లోని సీధీ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలుచోట్ల కొందరు నల్లజెండాలతో ఆయన బస్సుకు స్వాగతం పలికారు. ఓ చోట ఆయన బస్సుపై రాళ్లు రువ్వగా బస్సు అద్దాల్లో చీలిక వచ్చింది. పూజా పార్క్ ప్రాంతంలో ఓ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా రికార్డు చేసిన వీడియోలో ఆయనపైకి చెప్పు విసిరిన దృశ్యం రికార్డయింది. నల్లజెండాలు చూపడంతోపాటు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పవన్ కల్యాణ్‌కు చేదు అనుభవం
-
పవన్ కల్యాణ్‌పై చెప్పు విసిరిన వ్యక్తి
సాక్షి, ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో ప్రజాయాత్రకు శ్రీకారం చుట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బుధవారం చేదు అనుభవం ఎదురైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఖమ్మం జిల్లాకు బయల్దేరిన పవన్ తల్లాడ వద్ద అభిమానులకు తన కాన్వాయ్ నుంచి అభివాదం చేస్తున్నారు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి పవన్ కాన్వాయ్‌పై చెప్పును విసిరాడు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేగింది. అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తపడ్డారు. అనంతరం పవన్ తల్లాడ నుంచి ఖమ్మం పట్టణానికి చేరుకున్నారు. నేరుగా ఎంబీ గార్డెన్‌కు వెళ్లిన పవన్ నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పార్టీ ముఖ్య సమన్వయ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా ఎంబీ గార్డెన్లో సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో అభిమానులు అదుపు చేయడం పోలీసులకు తలకుమించిన భారంగా తయారైంది. పవన్ సభ ప్రాంగణానికి చేరుకోగానే రెచ్చిపోయిన కార్యకర్తలు ఒక్కసారిగా బారికేడ్లను తోసుకుంటూ రావడంతో మీడియా సిబ్బంది గాయపడ్డారు. వీడియో జర్నలిస్టుల కెమెరాలు విరిగిపోయాయి. సభా ప్రాంగణమైన ఎంబీ గార్డెన్లో కుర్చీలన్ని విరిగిపోయాయి. పార్టీ అధినేత ఏం మాట్లాడుతున్నారో కూడా పట్టించుకోని అభిమానులు.. వేదికపైకి దూసుకెళ్లారు. పరిస్థితి అదుపు తప్పడంతో పవన్ తన ప్రసంగాన్ని త్వరగా ముగించి వెళ్లిపోయారు. -
ఘనంగా సందల్ షరీఫ్ ఉత్సవం
జన సంద్రంగా మారిన దర్గా ఆకట్టుకున్న ఖవ్వాలీ సమ్మేళనం పోలీస్ బందోబస్తు జమ్మికుంట రూరల్: ఉర్సు ఉత్సవాల్లో భాగంగా జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్ దర్గాలో బుధవారం వేకువజామున ప్రధాన ఘట్టమైన సందల్(గ్రంథ లేపనం) ఉత్సవం ఘనంగా జరిగింది. పెద్ద బిజిగిరిషరీఫ్, మొల్లపల్లి గ్రామాల నుంచి దర్గా ముతావళీ, భక్తులు గ్రంథ లేపనాన్ని డప్పు చప్పుళ్లు, యువకుల కర్రసాముల, అల్లాహ్ కీర్తనలతో దర్గా వద్దకు వేకువజామున 4గంటల ప్రాంతంలో తీసుకొచ్చారు. భక్తి,శ్రద్ధలతో హజ్రత్ సయ్యద్ ఇంకుషావళీ రహ్మతుల్లా ఆలై, హజ్రత్ సయ్యద్ ముర్తుజావళీ, హజ్రత్ సయ్యద్ అక్బర్షావళీ సమాధులపై అలంకరింపజేశారు. సందల్ దర్గా ప్రాంతానికి రావడంతో భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారు. హిందూముస్లిములు తరలొచ్చి అల్లాహ్‌ను స్మరించుకుని సమాధులను దర్శించుకున్నారు. పలువురు కందుర్లు(న్యాజ్) పేరిట మొక్కులు చెల్లించుకున్నారు. కొత్తగూడెంకు చెందిన అశుర్ఖానా కమిటీ గౌరవ అధ్యక్షుడు గాజి గోవర్ధన్ భక్తులకు అన్నదానం ఏర్పాటుచేశారు. భక్తులను ఆకట్టుకున్న ఖవ్వాలీ మహ్మద్ ప్రవక్త ఉపదేశాలను ఆలపిస్తూ నాందేడ్, ఆగ్రాకు చెందిన మహ్మద్ సలీంపాషా, మహ్మద్ గులాం ఆలీ చిస్తి బృందాల చేసిన ఖవ్వాలీ సమ్మేళనాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ముతావళీ దర్గా కమిటీ అధ్యక్షుడు మహ్మద్ చోటేమియా, ఉపాధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ కరీం, కార్యదర్శి ఇక్బాల్, ఎంపీటీసీ సభ్యురాలు చందుపట్ల స్వాతి, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ సమీర్ పాల్గొన్నారు. జాతరలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ సీఐ పింగిళి ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. -
ఘనంగా ఖాదర్‌లింగ ఉరుసు
కౌతాళం: మండల కేంద్రమైన కౌతాళంలో వెలసిన జగద్గురు ఖాదర్‌లింగ స్వామి ఉరుసు ఉత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. తెల్లవారు జామున 3 గంటలకు దర్గా ధర్మకర్త సయ్యద్‌సాహెబ్ పీర్ చిష్తి ఇంటి నుంచి ఊరేగింపుగా గంధాన్ని దర్గాకు తీసుకెళ్లారు. ఈసందర్భంగా పక్కీర్లు చేసిన విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. గంధం దర్గా చేరిన అనంతరం ప్రత్యేక ఫాతెహాలు, ప్రార్థనలు నిర్వహించారు. దర్గా దర్శనం కోసం రాష్ట్రాం నలుమూలల నుంచే కాక తెలంగాణ, మహరాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, మధ్యప్రదేశ్, తమిళనాడు, జమ్ముకాశ్మీర్ తదితర రాష్ట్రాల నుంచి సుమారు రెండులక్షలకుపైగా భక్తులు తరలివచ్చారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధర్మకర్త అన్ని ఏర్పాట్లు చేపట్టారు. అన్నదానం కూడా నిర్వహించారు. తరలివచ్చిన వివిధ దర్గాల ధర్మకర్తలు: ఖాదర్‌లింగ స్వామి ఉరుసు ఉత్సవంలో వివిధ దర్గాల పీఠాధిపతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వీరు మంగళవారం తెల్లవారు జామున జరిగిన గంధం వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ఫాతెహలు నిర్వహించారు. బీదర్‌కు చెందిన సయ్యద్‌షా అసదుల్లా ఉసేని సజ్జదా నసీమ్, ఖ్వాజా అబుల్‌ఫైజ్ ఉసేని, ఐనూద్దీన్ ఉసేని, సయ్యద్‌షా మద్గీ ఉసేని, గుల్బర్గాకు చెందిన పీఠాధిపతులు సయ్యద్ ముజఫర్ ఉసేని చిష్తీ, సయ్యద్ ఖుబుల్లా ఉసేని సజ్జదే, సయ్యద్ ఖుద్బీ ఉసేని చిష్తీ, కర్నూల్ ఖాలీక్‌లింగ దర్గా ధర్మకర్త, కాంగ్రెస్ పార్టీ డీసీసీ కార్యదర్శి ఖలీల్‌బాష తదితర ప్రముఖులు దర్గాను దర్శించుకున్నవారిలో ఉన్నారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్ఐ నల్లప్ప పోలీసు బందోబస్తు నిర్వహించారు. -
భవన విజయం
ఓ ఇంట్లో పూలు పూసే మొక్కలు, కాయలు కాసే చెట్లను చూసుంటాం. ఇంకో ఇంట్లో పిట్టలో, పెంపుడు జంతువులనో చూసుంటాం. మరో చోట ఆకుకూరలతో ‘ఇంటి’ పంట చూసుంటాం. ఇవన్నీ, మరికాసిన్ని ఒకేచోట చూడాలంటే... ఏ అడవికో పోనవసరం లేదు. యూసఫ్‌గూడ క ల్యాణ్నగర్లో ఉన్న ‘వనకుటీరం’ వెళ్తే చాలు! ఈ ఏడాది రాష్ట్రంలో నిర్వహించిన గార్డెన్స్ ఫెస్టివల్లో ఫస్ట్‌ప్లేస్‌లో నిలిచిన టై గార్డెన్ అది. కొన్నేళ్లుగా ప్రకృతి ప్రేమికులకు, పాఠశాల విద్యార్థులకు దర్శనీయ స్థలం కూడా. ..:: ఎస్.సత్యబాబు ఈ వన కుటీరం సృష్టికర్త రామరాజు. భీమవరం సమీపంలోని కాళ్లకూరు గ్రామానికి చెందిన రామరాజు బాల్యం పచ్చని పంటలు, ప్రకృతి నీడలో సాగింది. కాలక్రమంలో కాంక్రీట్ జంగిల్‌కు వల సొచ్చినా.. పూలు, ముచ్చటైన మొక్కలు, వన్యప్రాణులతో తిరిగి దోస్తీ చేయాలనుకున్నారు. ఆ అభిరుచికి తన భవనాన్నే వేదిక చేసుకున్నారు. కల్యాణ్‌నగర్ మూడో ఫేజ్‌లో, తోడల్లుడితో కలసి తాను కట్టుకున్న ఇంటిలోని కొంచెం స్థలంలో వనకుటీరం ఏర్పాటు చేశారు. వ్యయప్రయాసలకోర్చి దానిని దినదిన ప్రవర్ధమానం అయ్యేలా చేస్తున్నారు. కూల్ అండ్ గ్రీన్... మామిడి, సపోటా, గంధం, మారేడు.. భిన్న రకాల చెట్లు ఆయన భవనానికి నాలుగు పక్కలా ఉంటాయి. ‘మాకు ఎండ తీవ్రత తెలీదు. మండే ఎండల్లో కూడా ఇంట్లో టెంపరేచర్ 32 డిగ్రీలు దాటదు’ అని చెప్పే రామరాజు రూమ్ టెంపరేచర్ కొలిచే సాధనం కూడా తనింట్లో ఏర్పాటు చేసుకున్నారు. మూడంతస్తుల భవనం టై మీద రామరాజు పరచిన పచ్చదనం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. టై మీద ఒకటో రెండో కుండీలు పెట్టుకుని ఆనందించే రొటీన్ గార్డెనింగ్‌కు భిన్నంగా ఆయన తన మేడ మీద ఖాళీస్థలంలో అంగుళం వదలకుండా గ్రీనరీనిపరిచారు. ఎన్నెన్నో జాతులు.. రాత్రిపూట ఉదయించి, పొద్దునే అస్తమించే బ్రహ్మకమలం, ఎండాకాలంలో సూర్యోదయంతో పాటు విచ్చుకుని మధ్యాహ్నానికి మాయమయే కాక్టస్.. ఇలాంటి విశేషాలున్న మొక్కలు రామరాజు టైని అపురూపమైన గార్డెన్‌గా మార్చాయి. బోన్సాయి మర్రి, బోధి చెట్టు, రోడ్ డివైడర్స్‌కు మధ్యలో వేసే సైకస్లతో పాటు తీపి చింత, సీడ్లెస్ జామ, వెల్వెట్ బత్తాయి, ఆకుకూరలు, మట్టిలో ఊరే పెండ్లం, ఆల్స్పైస్ (మసాలా ఆకు), రెడ్ జింజిర్, ఆర్నమెంటల్ పైనాపిల్, విక్స్ ఆకు మొక్క, లవంగ, వాటర్ యాపిల్, పూలమొక్కలు... ఇలా 120 రకాల మొక్కలు పెంచుతున్నారు. దీనికి 1,600 చదరపు అడుగుల స్థలంపోగా మిగిలిన 200 చదరపు అడుగుల స్థలంలో చిన్న గది కట్టుకున్నారాయన. ప్లాన్డ్గా ప్లాంట్స్... భవనం పైభాగంలో మొక్కలు పెంచితే పడే బరువు ఏమేరకు ఉండవచ్చునో ఇంజనీరింగ్ నిపుణుల చేత ముందుగానే తనిఖీ చేయించారు రామరాజు. నీటికి కటకటలాడే నగరంలో, అదీ ఐదు కుటుంబాలు నివసించే చోట నీళ్ల సమస్య తప్పదు. తన గార్డెన్‌కు ఆ సమస్య రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. కృత్రిమ రసాయనాలు కాకుండా వెల్లుల్లిరసం, వేపనూనె లను స్వయంగా తయారు చేసి చీడపీడలకు విరుగుడుగా వాడుతున్నారు. గువ్వల కువకువ... తాబేళ్ల తమాషా... మొక్కలు పచ్చదనాన్ని అటుంచితే... ఈ టై గార్డెన్లో పిచ్చుకలు, పావురాల గూళ్లకు కొదవేలేదు. ‘ప్రకృతి అంటే కేవలం పచ్చదనం మాత్రమే కాదు. మరెన్నో జీవులు కూడా’అంటారు రామరాజు. ప్రత్యేకంగా ఒక సిమెంట్ తొట్టెనే పాండ్‌గా రూపొందించి అందులో చేపలు, తాబేళ్లను పెంచుతున్నారు. మేడ మీద లవ్‌బర్డ్స్‌తో పాటు పాల పిట్టలు, పావురాలు వగైరా 50 దాకా నివసించేలా ఒక గూడు సైతం ఏర్పాటు చేశారు. అతిథి దేవోభవ.. ప్రతి రోజూ ఈ ఇంటిని పెద్ద సంఖ్యలో పిచ్చుకలు పలకరిస్తుంటాయి. ఆ భ‘వనా’న విరిసే పూలమీద మకరందాన్ని తాగేందుకు తేనెటీగలు వస్తాయి. రెడ్ చెర్రీ మొదట పచ్చగా ఉంటుంది. ఆ తర్వాత ఎరుపు రంగులోకి మారుతుంది. సరిగ్గా అది ఎరుపు రంగులోకి మారేటప్పటికి దాన్ని తినడానికి ఎవరో చెప్పినట్టు కోయిల వస్తుంది. రామరాజు చెర్రీపండుని కోసుకోరు. కోయిల రావడాన్ని, చెర్రీని తినడాన్ని సంతోషంగా చూస్తారు. ఉడతలు సైతం ఆయన వనానికి అతిథులే. అంతేకాదు... నెలకోసారైనా ఏదో ఒక స్కూల్ పిల్లలు ఆయన ఇంటికి చుట్టాలవుతారు. ఇక వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ అధికారులు, సిబ్బంది తరచుగా ఆయన తోటకు హాయ్ చెబుతూనే ఉంటారు. అందర్నీ ఆప్యాయంగా ఆహ్వానించి మర్యాదలు చేసే రామరాజు... తమ కాలనీలోని పిల్లలకు మొక్కల ప్రాధాన్యత గురించి వివరిస్తుంటారు. వారికి మొక్కల్ని బహుమతులుగా అందిస్తుంటారు. ప్రకృతి ఇచ్చిన వాటిని ఆహారంగా మార్చుకోవడం మాత్రమే కాదు ఆహ్లాదంగా ఆస్వాదించడం కూడా తెలిసిన వారాయన. అందుకే సాయంత్రాల్లో తన వనంలో టీ తాగుతూ సేదతీరుతారు రామరాజు. -
శ్రీగంధం.. ఎర్రచందనం..
మొక్కల పెంపకానికి జిల్లావాసుల ఆసక్తి ►‘మన ఊరు.. మన ప్రణాళిక’లో విజ్ఞప్తులు ►జిల్లా భూభాగం అనువు కాదంటున్న అటవీ అధికారులు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : శేషాచలం అడవుల్లో పెరిగే శ్రీ గంధం, ఎర్రచందనం మొక్కల పెంపకానికి జిల్లావాసులు ఆసక్తి చూపుతున్నారు. ‘మన ఊరు.. మన ప్రణాళిక.’లో భాగంగా గ్రామాలకు వెళ్లిన అటవీ అధికారులకు ఈ అరుదైన రకాల మొక్కలను సరఫరా చేయాలని విజ్ఞప్తులు వచ్చాయి. ఆదిలాబాద్ అంటేనే అడవుల జిల్లాగా పేరుంది. నాణ్యమైన టేకు కలపకు జిల్లా దేశంలోనే ప్రసిద్ధి గాంచింది. కానీ, ఇప్పుడు జిల్లా వాసులు మాత్రం ఈ అరుదైన రకాల మొక్కలు సరఫరా చేయాలని కోరుతున్నారు. ఈ మొక్కలు సరఫరా చేయాలని పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వ చ్చాయని సోషల్ ఫారెస్టు డీఎఫ్‌వో జానకిరామయ్య ‘సాక్షి’తో పేర్కొన్నారు. జిల్లా భూముల్లో శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు పెరిగే అవకాశాలున్నప్పటికీ.. నాణ్యత అంతగా ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల కాలంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై మీడియాలో తరచూ కథనాలు వస్తుండటం కూడా ఒక కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘హరితహారానికి’ 72 లక్షల మొక్కలు తెలంగాణలో 25 శాతం ఉన్న అటవీ ప్రాంతాన్ని 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో కొత్తగా కొలువుదీరిన కేసీఆర్ సర్కారు ముందుకెళుతోంది. ఇందుకోసం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఏటా ఒక్కో నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ సీజనులో నాటేం దుకు జిల్లాలో 72 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఈ లెక్క న ఒక్కో గ్రామ పంచాయతీకి 8వేల మొక్కలు సరఫరా చేయనున్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో అటవీశాఖకు సంబంధించి సామాజిక వన విభాగం (సోషల్ ఫారెస్టు)తో, టెరిటోరియల్ విభాగం నర్సరీలను పెంచుతోంది. డ్వామా, సింగరేణి, అట వీ అభివృద్ధి సంస్థ(టీఎఫ్‌డీసీ) వంటి ప్రభుత్వ రంగ సంస్థల నర్సరీ లు కూడా జిల్లాలో ఉన్నాయి. కాగజ్‌నగర్‌లో ఉన్న ప్రైవేటు సంస్థ ఎస్పీఎం కూడా నర్సరీలను పెంచుతోంది. నిమ్మ, జామ, దానిమ్మ, టేకు, సుబాబుల్, నీలగిరి వంటి మొక్కలు ఈ ఏడాది అందుబాటులో ఉన్నాయి. ఏటా వర్షాకాలంలో ప్రారంభంలో జూన్ మొదటి వారం నుంచి ఆగస్టు నెలాఖరు వరకు మొక్కలు నాటుతారు. ఈ సీజనులో జిల్లా వ్యాప్తంగా అందుబాటులో ఉన్న 72 లక్షల మొక్కలు నాటేందు కు ఏర్పాట్లు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. 2.35 కోట్ల మొక్కల పెంపకానికి ప్రణాళిక రానున్న సంవత్సరానికి 2.35 కోట్ల మొక్కలు పెంచాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అటవీశాఖ సామాజిక వన విభాగం డీఎఫ్‌వో జానకిరామయ్య తెలిపారు. ‘మన ఊరు.. మన ప్రణాళిక ..’లో భాగంగా జిల్లా లో మొక్కల పెంపకానికి అనువైన స్థలాలను గుర్తిస్తున్నామని అన్నా రు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, బొడగుట్టలు, కాలువల పక్కన స్థలాలు, పడీత్ భూములు వంటి వాటిని గుర్తించామని అన్నారు. ఇంటి ఆవరణలు, పొలంగట్లలో ఏ మేరకు స్థలం అందుబాటులో ఉందో గుర్తిస్తున్నామని తెలిపారు. -
ఈ విలేజ్‌లో... కేవలం రిలాక్స్ అవ్వండి!
విహారం సూర్యుడిలోని ప్రకాశం, పువ్వుల్లోని సుగంధం, ప్రకృతిలోని సౌందర్యం... వీటన్నింటినీ కలగలుపుకున్నది ఆ నదీ తీరం. ఆకట్టుకునే పరిసరాలు, సహజమైన రూపం ఆ ప్రదేశం సొంతం. ఈ రెండింటి సంగమమే ఆ దృశ్యకావ్యం... ఈ వర్ణనకు వాస్తవ రూపమే పోర్టోఫినో.. ఇటలీ దేశంలో, ఇటాలియా నదీ తీరంలోని అందమైన అందాల గ్రామమది. సదుపాయాలు పెరిగి నగరంగా పిలువబడుతోంది. నదీ తీరాలు నాగరికతకు పుట్టిళ్లు. పంటలు ఇచ్చాయి. జ్ఞానాన్ని పెంపొందించుకొనే తీరికనిచ్చాయి. ఉల్లాసాన్ని ఇచ్చే వాతావరణాన్ని ఇచ్చాయి. భూమ్మీద అలాంటి నదిలెన్నో ఉన్నాయి. దేని ప్రత్యేకత దానిదే. దేని సొగసు దానిదే. ఇలాంటి నేపథ్యంతోనే.. ఎన్నో రిసార్ట్ టౌన్లను తన ఒడిలో అనుసంధానించుకొని గుంభనంగా సాగుతుంటుంది ఇటాలియా నది. యూరప్‌లోని నార్త్ గయానా నుంచి ఫ్రెంచ్ సరిహద్దు వరకూ లైగేరియా సముద్రపు అంచులను కలుపుతూ సాగుతుంది ఈ నది. ఇది యూరప్ ఒడ్డును ఒరుసుకొని పోతున్నా.. అక్కడి మనుషుల సకల జీవరంగాలనూ స్పృశిస్తూనే ఉంటుంది. అలా ఈ నదీ స్పర్శతో ఒక ఉనికిని తెచ్చుకొన్నదే పోర్టోఫినో గ్రామం. ప్రపంచంలో పర్యాటక కేంద్రాలంటే పెద్ద నగరాలే... అనుకునే వారు ఇక్కడికి ఓ సారి రావాల్సిందే. పచ్చని పైరు, చక్కని సెలయేరు, చల్లటి గాలి... అన్నట్టుగా పర్యాటకకేంద్రంగా విలసిల్ల్లుతోంది ఈ గ్రామం. ఎన్నెన్నో విశేషాలు... పోర్టోఫినో గ్రామానిది శతాబ్దాల చరిత్ర. ఇక్కడ కవిత్వం పుట్టింది. సంగీతం పుట్టింది. అందుకే పర్యాటక చిత్రపటంలోనే కాదు... చారిత్రకంగానూ దీనిది ప్రముఖ స్థానమే. ఒక్కమాటలో చెప్పాలంటే పోర్టోఫినో పరిసరాల్లోనే ఇటాలియన్ కళ, కవిత్వం దాగుంది. ఈ ఊరి పరిసరాల స్ఫూర్తితో కవిత్వం రాశామని, ఈ పరిసరాల్లో కూర్చొని తమ కలాలను ఝళిపించామని చెప్పే రచయితలు అనేక మంది. ఇక్కడి ప్రకృతి ఆవరణంలో ఏదో మాయ ఉందని వారు అంటారు. అలాగే ఇది యూరప్‌లోనే సెలబ్రిటీలకు ఫేవరెట్ స్పాట్‌గా పేరు పొందింది. వేసవిలో సేదతీరడానికి ఎంతో మంది ఇక్కడకు చేరుకుంటుంటారు. ఇంత ప్రేరణ ఉందంటే... ఆ వాతావరణం ఎంత అందంగా ఉంటుంటో అర్థం కావట్లేదూ! ఇంకా చిత్రమేంటంటే... ఈ అందమైన ప్రకృతిపై మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల ముద్ర కూడా ఉంది. ప్రత్యేక ఆకర్షణలు... నడుస్తూ ఈ ఊరి అందాలను చూడటం ఉల్లాసానికి ఒక ఉత్తమమైన మార్గమని ఇటలీ వాసులు, పర్యాటక ప్రేమికులు చెబుతారు. ఇందులో రెండు సౌలభ్యాలున్నాయి. ఒకటి ఇక్కడి హోటళ్ల, బీచ్‌ల అందాలు చూడొచ్చు.. రెండు భారీ స్థాయిలోని టాక్సీ చార్జీలను తప్పించుకోవచ్చు అంటూ ఇక్కడ టాక్సీ చార్జీల గురించి టూరిస్ట్ గైడ్లు ముందుగానే హెచ్చరిక జారీ చేస్తుంటారు. ఇక్కడ అన్నీ ఆకట్టుకొనేవే.. ప్రత్యేకించి ఇక్కడి జీవన విధానం. ఫొర్టోఫినో ట్రిప్ ప్లాన్ చేసుకోవడంలో ముందుగానే ప్రయారిటీలు, షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవడానికే అవకాశం లేదట. ఎందుకంటే అక్కడకి వెళ్లే వరకే మన చేతుల్లో ఉంటుంది. అక్కడికెళ్లాక ఆ అందాలు అక్కడ్నుంచి కదలనివ్వవు. దాంతో ప్రణాళిక మొత్తం మారిపోతుంది. బీచ్‌లో కూర్చుని అందాలు తనివి తీరా అనుభవిస్తుంటే... లాగూన్లలో డాల్ఫిన్లు చేసే విన్యాసాలను ఆస్వాదిస్తుంటే.. గంటలు నిమిషాల్లా గడిచిపోతాయని అంటారు. మధ్యయుగం నాటి ఆనవాళ్లు... ఇక్కడ పదహారో శతాబ్దం నాటి కోట క్లాస్టెల్లో బ్రౌన్ ఉంటుంది. ఒకనాడు అంతఃపురంగా విలసిల్లిన ఈ కోట ఇప్పుడు మ్యూజియంగా మారి అలనాటి వైభవానికి ఆనవాలుగా ఉంది. మధ్య యుగానికి చెందిన మరో చారిత్రక ప్రదేశం సెయింట్ మార్టిన్ చర్చి ఇక్కడ మరో ఆకర్షణ. ‘క్రైస్ట్ ఆఫ్ ఏబియస్’ పేరిట ఇక్కడ ఏర్పాటుచేసిన యేసు క్రీస్తు విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. దాదాపు 30 అడుగుల ఎత్తుండే ఈ విగ్రహం నది మధ్యలో మునిగి ఉంటుంది. ఇలాంటి అనుభూతి మీకు మరెక్కడా దొరకదు. స్కూబా డ్రైవర్లకు, ఫిషర్ మ్యాన్లకు విగ్రహ రూపంలోని యేసుక్రీస్తు రక్షణగా ఉంటాడని ఒక నమ్మకం. మునిగి ఉన్న ఈ విగ్రహాన్ని పర్యాటకులు వీక్షించడానికి వీలుగా ఉంటుంది. రిలాక్స్...రిలాక్స్... ఈ ఊరిని వచ్చే పర్యాటకులకు ఒకే ఒక్క ముఖ్య సూచన ఉంది. అదేంటంటే.. ఇక్కడ విజ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం అస్సలు చేయొద్దు. ప్రకృతి మిస్టరీల గురించి ఆలోచించనే వద్దు... జస్ట్ రిలాక్స్! ఇక్కడ చేయగలిగిన, చేయాల్సిన గొప్ప పని ఏదైనా ఉందంటే అది రిలాక్స్ కావడమే మాత్రమే. ప్రకృతికి ఒక సొంతం గ్రామం ఉంటే అదిలా ఉంటుందనిపించే ఈ చిన్న నగరంలో కలియతిరగండి. ఆద్యంతం అనుభవైకవేద్యమైన అనుభూతి పొందండి. నదీ ప్రవాహ గలగలలు వినండి. చక్కటి ఇటాలియన్ వంటలతో మైమరిచిపోండి. ఎందుకంటే పోర్టోఫినో ఉన్నది అందుకే! ఫోర్టోఫినోకు ఎలా వెళ్లాలి? 1940లలో బ్రిటన్ నుంచి గుర్రాల ద్వారా పర్యాటకులు ఈ ఊరికి వచ్చేవారట. అలా ఇక్కడికి పర్యాటకుల ప్రవాహం మొదలైంది. ప్రస్తుతానికి అయితే పోర్టోఫినో దగ్గరలో జెనోవా నగరంలో క్రిస్టోఫర్ కొలంబస్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి దాదాపు 36 కిలోమీటర్ల కారు ప్రయాణంతో పోర్టోఫినో చేరుకోవచ్చు. ఇంకా ఫ్రాన్స్‌లోని నైస్, ఇటలీలోని మిలాన్ ఎయిర్ పోర్ట్‌లు కూడా పోర్టోఫినోకు దగ్గరగా ఉన్న ఇతర విమానాశ్రయాలు. ఊరి పేరు ఎలా వచ్చిందంటే... పోర్టోఫినో రోమన్లు పెట్టిన పేరు. ఈ నదీతీరపు గ్రామానికి కాలక్రమేణా ఊరిపేరు మారిపోయేంత ప్రస్థానం ఉంది. డాల్ఫిన్లకు స్వర్గధామమైన నదికి తీరంలో ఉండే ఈ గ్రామానికి ‘పోర్టస్ డాల్ఫినో’గా రోమన్లు నామకరణం చేశారు. పోర్ట్ ఆఫ్‌ది డాల్ఫిన్‌గా పిలుచుకునే వారు. క్రమేణ ఇదే ఫోర్టోఫినో అయ్యింది. పేరులోనే డాల్ఫిన్లను దాచుకొన్న ఈ ఊరును ఒక ఎక్వేరియంగా అభివర్ణిస్తారు ఇటాలియన్లు. ఇక్కడి తీరంలో కూర్చున్నా.. నదిలో ఈదులాడినా వందల, వేల రకాల చేపలను వీక్షించడానికి అవకాశం ఉంఆది. అందుకే దీన్ని ఫిషింగ్ సిటీ అని అంటారు. ఊరి జనాభా 500! ఇక్కడ శాశ్వతంగా నివసించే వారి సంఖ్య 500. అయితే యూరప్‌లో వేసవి కాలం వచ్చి భానుడు ఒళ్లు విరుచుకున్నాడంటే.. ఈ ఊరిలో జనాభా అమాంతం పెరిగిపోతుంది. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఇక్కడకి వస్తారు. వీరి కోసం బొటిక్స్, ఆర్ట్‌గ్యాలరీలు, కేఫ్‌లు, రెస్టారెంట్లు నడపడమే స్థానికుల జీవనాధారం. ఫిషింగ్ ఆదాయం ఆదనం.