లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
మరిపెడ: లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో వరంగల్ జిల్లా మరిపెడకు చెందిన విద్యార్థి ఆంగోతు సందీప్‌కు స్థానం దక్కింది. సందీప్ స్థానిక సెరుుంట్ ఆగస్టియన్ పాఠశాలలో చదువుతున్నప్పుడు ఒకేసారి 50 జంటలు చదరంగం అడేందుకు వీలుగా చెస్‌బోర్డు తయూరు చేశాడు. దీంతో అప్పట్లో యూనిక్ వరల్డ్ రికార్డు బుక్‌లో చోటు దక్కింది. ఆ తర్వాత లండన్‌లోని యునెటైడ్కింగ్ కళాశాల డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్‌లో కూడ స్థానం సంపాదించాడు.
తాజాగా లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి మండలానికి పేరు తీసుకొచ్చాడు. మండల కేంద్రంలోని పూలబ జారుకు చెందిన ఆంగోతు మంగీలాల్, పద్మ దంపతుల కుమారుడు సందీప్ ప్రస్తుతం ఖమ్మం లోని ఓ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ.. గిన్నిస్ బుక్‌లో పేరు నమోదు చేసుకునే వరకు శ్రమిస్తానని చెప్పాడు.