Sandip Patil
-
ఎంసీఏ ఎన్నికల్లో సందీప్ పాటిల్ పరాజయం
ముంబై: ప్రతిష్టాత్మక ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఎన్నికల్లో భారత మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్‌కు అనూహ్య ఓటమి ఎదురైంది. అమోల్ కాలే 25 ఓట్ల తేడాతో పాటిల్‌పై గెలుపొందారు. బీసీసీఐ కోశాధికారి ఆశిష్ షెలార్ మద్దతుతో బరిలో నిలిచిన కాలేకు 183 ఓట్లు రాగా, పాటిల్‌కు 158 ఓట్లు వచ్చాయి. భారత జట్టు తరఫున 29 టెస్టులు, 45 వన్డేలు ఆడిన 66 ఏళ్ల పాటిల్ జాతీయ క్రికెటర్ అకాడమీ డైరెక్టర్‌గా, బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. భారత్, కెన్యా, ఒమన్ జట్లకు కోచ్‌గా కూడా పని చేసిన ఆయన కొద్ది రోజుల క్రితమే ఎంసీఏ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. చదవండి: T20 World Cup 2022: నమీబియాపై యూఏఈ విజయం.. నెదర్లాండ్స్ సెలబ్రేషన్స్ అదుర్స్ -
పది నెలలుగా సచిన్‌ను కలవలేదు!
ముంబై: సచిన్ టెండూల్కర్ 200వ టెస్టు తర్వాత అతని భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటామని, ఇదే విషయాన్ని మాస్టర్‌కు స్వయంగా చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ కలిసి చెప్పినట్లు మీడియాలో వచ్చిన కథనాన్ని పాటిల్ కొట్టి పారేశారు. అసలు తాను సచిన్‌ను కలిసి దాదాపు పది నెలలు అయిందని ఆయన అన్నారు. మాస్టర్ గొప్పతనాన్ని తగ్గించలేమని...అయితే ప్రతిభ గల యువ ఆటగాళ్లను దృష్టిలో ఉంచుకుంటూ తాము భవిష్యత్తు ప్రణాళికలను రూపొందిస్తున్నామని, ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటూ సచిన్‌కు వివరించినట్లు కూడా ఈ కథనంలో ఉంది. ఒక సెలక్టర్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు కూడా ఓ పత్రిక రాసింది. ‘సచిన్‌ను కలవడాన్ని నేను ఎప్పుడైనా ఇష్ట పడతాను. కానీ దాదాపు 10 నెలలుగా నేను అతడిని కలవలేదు. అతను నాకు గానీ, నేను సచిన్‌కు గానీ కనీసం ఫోన్ కూడా చేయలేదు. మేం ఏ విషయాన్నీ చర్చించలేదు. ఆ వార్త అంతా శుద్ధ అబద్ధం’ అని సందీప్ పాటిల్ స్పష్టం చేశారు. మరో వైపు బీసీసీఐ కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. ఆ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని వివరణ ఇచ్చింది. ‘మేం అటు సచిన్‌తో, ఇటు పాటిల్‌తో కూడా మాట్లాడాం. వారిద్దరి మధ్య ఎలాంటి చర్చా జరగలేదు. రిటైర్మెంట్పై స్వయంగా ఆటగాడే నిర్ణయం తీసుకోవాలనేది బోర్డు పాలసీ. దానిని ఎల్లప్పుడూ అనుసరిస్తూనే ఉన్నాం’ అని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వ్యాఖ్యానించారు. సచిన్ వచ్చే నవంబరులో వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో 200 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకోనున్నాడు. అతడినే నిర్ణయించుకోనివ్వండి : కిర్మాణీ బెంగళూరు: రిటైర్మెంట్ నిర్ణయాన్ని సచిన్‌కే వదిలేయాలని భారత మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ అభిప్రాయ పడ్డారు. 200వ టెస్టు తర్వాత రిటైర్ అవుతాడనే వార్తలు ఎందుకు సృష్టిస్తారో అర్థం కాదని ఆయన అన్నారు. -
పది నెలలుగా సచిన్ టెండూల్కర్ ను కలవలేదు!
ముంబై: సచిన్ టెండూల్కర్ 200వ టెస్టు తర్వాత అతని భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటామని, ఇదే విషయాన్ని మాస్టర్‌కు స్వయంగా చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ కలిసి చెప్పినట్లు మీడియాలో వచ్చిన కథనాన్ని పాటిల్ కొట్టి పారేశారు. అసలు తాను సచిన్‌ను కలిసి దాదాపు పది నెలలు అయిందని ఆయన అన్నారు. మాస్టర్ గొప్పతనాన్ని తగ్గించలేమని...అయితే ప్రతిభ గల యువ ఆటగాళ్లను దృష్టిలో ఉంచుకుంటూ తాము భవిష్యత్తు ప్రణాళికలను రూపొందిస్తున్నామని, ఈ పరిస్థితిని అర్ధం చేసుకోవాలంటూ సచిన్‌కు వివరించినట్లు కూడా ఈ కథనంలో ఉంది. ఒక సెలక్టర్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు కూడా ఆ పత్రిక రాసింది. ‘సచిన్‌ను కలవడాన్ని నేను ఎప్పుడైనా ఇష్ట పడతాను. కానీ దాదాపు 10 నెలలుగా నేను అతడిని కలవలేదు. అతను నాకు గానీ, నేను సచిన్‌కు గానీ కనీసం ఫోన్ కూడా చేయలేదు. మేం ఏ విషయాన్నీ చర్చించలేదు. ఆ వార్త అంతా శుద్ధ అబద్ధం’ అని సందీప్ పాటిల్ స్పష్టం చేశారు. మరో వైపు బీసీసీఐ కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. ఆ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని వివరణ ఇచ్చింది. ‘మేం అటు సచిన్‌తో, ఇటు పాటిల్‌తో కూడా మాట్లాడాం. వారిద్దరి మధ్య ఎలాంటి చర్చా జరగలేదు. రిటైర్మెంట్పై స్వయంగా ఆటగాడే నిర్ణయం తీసుకోవాలనేది బోర్డు పాలసీ. దానిని ఎల్లప్పుడూ అనుసరిస్తూనే ఉన్నాం’ అని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వ్యాఖ్యానించారు. ఇప్పటికే 198 టెస్టులు ఆడిన సచిన్ వచ్చే నవంబరులో వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో 200 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకోనున్నాడు.